నాగార్జున నిర్ణయాన్ని మార్చుకోవాలంటూ డైరెక్టర్ ధర్నా.. చర్చనీయాంశం అవుతున్న వివాదం

'బిగ్ బాస్' రియాలిటీ షో.. ఇది ఎంతటి పాపులారిటీని సంపాదించుకుందో.. అంతకు మించిన కాంట్రవర్సీలను క్రియేట్ చేస్తోంది. గత రెండు సీజన్ల వరకు వివాదాలు హౌస్‌ లోపలి వరకే పరిమితం కాగా, ఇప్పుడు మాత్రం బహిర్గతం అయ్యాయి. షో కోసం మమ్మల్ని సెలెక్ట్ చేసి అసభ్యకరమైన ప్రశ్నలు అడిగారని ఒకరు.. తమతో అనుచితంగా ప్రవర్తించారని మరొకరు ఆరోపణలు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అంతేకాదు, దీనిపై పలు చానెళ్లలో ప్రత్యేకంగా డిబెట్లు కూడా ఏర్పాటు చేయడంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ అయింది.

ఆ తర్వాత దీనిపై జరిగిన రచ్చ గురించి అందరికీ తెలిసిందే. శ్వేతా రెడ్డి, గాయత్రి గుప్తాలకు ప్రముఖ దర్శక నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డితో పాటు ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులు మద్దతుగా నిలవడంతో 'బిగ్ బాస్' షోను నిషేదించాలని డిమాండ్ ఎక్కువ వినిపించింది. వీరంతా కలిసి అన్నపూర్ణ స్టూడియోస్‌ను, అక్కినేని నాగార్జున ఇంటిని ముట్టడించడం వంటివి చేశారు. ఇక్కడే కాదు.. శ్వేతా రెడ్డి, గాయత్రి గుప్తా, కేతిరెడ్డిలు దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో ఈ వ్యవహారం భారతదేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఒకపక్క ఇది జరుగుతుండగానే, 'బిగ్ బాస్' సీజన్ - 3 అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.

Kethireddy Jagadishwar Reddy Dharna In Amaravathi

ఈ నేపథ్యంలో 'బిగ్ బాస్' షోను నిషేదించాలని, నాగార్జున దీని నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తూ కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ధర్నాకు దిగారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ''బిగ్ బాస్ షో వల్ల తెలుగు రాష్ట్రాల్లోని యువత చెడు మార్గంలోకి వెళ్తున్నారు. అందుకే దీనికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం. కొద్దిరోజుల క్రితం ఢిల్లీలో నిరసన తెలియజేశాం. ఇప్పుడు అమరావతిలో చేస్తున్నా. ఈ షో నిషేదించకపోతే దేశ వ్యాప్తంగా ఇదే తరహా నిరసనలు చేస్తాం'' అని ఆయన వెల్లడించారు.

అలాగే షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నాగార్జున గురించి కూడా కేతిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ''అన్నమయ్య', 'షిరిడిసాయి' లాంటి భక్తిరస చిత్రాల్లో నటించిన నాగార్జున ఇలాంటి షోలు చేయడం ఎంత వరకు సమంజసం..? ఆయన వెంటనే 'బిగ్ బాస్' నుంచి తప్పుకోవాలి'' అని ఆయన డిమాండ్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X