జబర్ధస్త్ వర్ష ఆత్మహత్యయత్నం: స్టూడియోలో కొట్టుకున్న ఇద్దరు టీమ్ లీడర్లు.. అలా బయటకు వచ్చిన మేటర్!

తెలుగు బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ, కొన్ని షోలు మాత్రమే ప్రేక్షకుల మన్ననలు అందుకుని సూపర్ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతాయి. అలాంటి వాటిలో ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న జబర్ధస్త్ ఒకటి. చాలా కాలంగా టెలివిజన్ రంగంలో తనదైన మార్కుతో దూసుకుపోతోన్న ఈ షో.. ఎంతో మందిని ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఇందులో వచ్చే స్కిట్లు లక్షల మందికి నవ్వులు పంచుతున్నాయి. ఇలాంటి ఈ జబర్ధస్త్‌లో ఊహించని ఘటన జరిగింది. దీంతో పెద్ద రాద్దాంతమే చోటు చేసుకుంది. అసలేం జరిగింది? వివరాలు మీకోసం!

సుదీర్ఘ ప్రయాణం... వందల మందికి లైఫ్

సుదీర్ఘ ప్రయాణం... వందల మందికి లైఫ్

తెలుగులో ఎన్నో రకాల షోలు వచ్చాయి. అయితే, కామెడీ ప్రధానంగా వచ్చిన వాటిలో కేవలం ఒకే ఒక్క షో నిలబడగలిగింది. అదే జబర్ధస్త్. దాదాపు ఎనిమిదేళ్లుగా హవాను చేపిస్తోన్న ఈ కార్యక్రమం.. ఆరంభంలో వారానికి ఒకరోజు మాత్రమే వచ్చిన ఇది.. ఆ తర్వాత గురు, శుక్రవారాల్లో ప్రసారం అవుతోంది. ఈ షో వల్ల వందల మంది ఆర్టిస్టులు బుల్లితెరకు పరిచయం అయ్యారు.

 వాళ్లకు మాత్రం బాగా కలిసొచ్చిన జబర్ధస్త్

వాళ్లకు మాత్రం బాగా కలిసొచ్చిన జబర్ధస్త్

ఆర్టిస్టులకు మాత్రమే కాదు.. జబర్ధస్త్ షో వల్ల పద్ద పెద్ద వాళ్లకు సైతం మంచి గుర్తింపు దక్కింది. అందులో యాంకర్లుగా పని చేస్తున్న అనసూయ భరద్వాజ్.. రష్మీ గౌతమ్ అయితే ఎనలేని క్రేజ్‌ను అందుకుని సత్తా చాటుతున్నారు. తద్వారా వరుస ఆఫర్లు అందుకుంటూ మరింత ముందుకు వెళ్తున్నారు. వీరితో పాటు మెగా బ్రదర్ నాగబాబు.. రోజాకు కూడా ఇది చాలా ఉపయోగపడింది.

వివాదాలున్నా తగ్గలేదు... సక్సెస్‌ఫుల్‌గా

వివాదాలున్నా తగ్గలేదు... సక్సెస్‌ఫుల్‌గా

దాదాపు ఎనిమిదేళ్లుగా బుల్లితెరపై హవాను చూపిస్తోంది జబర్ధస్త్ షో. దీనికి కారణం ఈ షోకు ఎంతో మంది అభిమానులు ఉండడమే. అదే సమయంలో దీనిని విమర్శించే వాళ్లు కూడా అంతే స్థాయిలో ఉన్నారు. వెకిలి కామెడీ చేస్తున్నారనో.. బూతులు మాట్లాడుతున్నారనో.. పలానా కులం, ప్రాంతం వారిని కించపరిచారో.. ఆడవాళ్లను అగౌరపరిచారనో.. దీనిపై వివాదాలూ చెలరేగాయి.

ఈ మధ్య కాలంలో ఆమెనే ఫుల్ పాపులర్

ఈ మధ్య కాలంలో ఆమెనే ఫుల్ పాపులర్

జబర్ధస్త్‌లోకి ఎంతో మంది ఆర్టిస్టులు వస్తున్నారు. ఈ మధ్య కాలంలోనైతే కొంత మంది అమ్మాయిలు కూడా ఎంట్రీ ఇచ్చారు. కానీ, ఒకరో ఇద్దరో మాత్రమే మంచి గుర్తింపును దక్కించుకున్నారు. అందులో తెలుగు అమ్మాయి వర్ష ఒకరు. హైపర్ ఆది ద్వారా షోలోకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత రాకింగ్ రాకేష్, కెవ్వు కార్తీక్ టీమ్‌లలో చేస్తోంది. ఇమాన్యూయేల్‌తో ట్రాక్ నడుపుతోంది.

జబర్ధస్త్ షూటింగ్‌లో ఘర్షణ.. గాలివానలా

జబర్ధస్త్ షూటింగ్‌లో ఘర్షణ.. గాలివానలా

ప్రస్తుతానికి కొన్ని చానెళ్లలో కామెడీ షోలు వస్తున్నప్పటికీ.. జబర్ధస్త్‌ను మించిన మజాను పంచలేకపోతున్నాయి. దీంతో ఇప్పటికీ ఈ షోకే ఎక్కువ ఆదరణ లభిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో నిర్వహకులు సరికొత్త ప్రయోగాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా జబర్ధస్త్ షూటింగ్ స్పాట్‌లో ఘర్షణ జరిగింది. చిన్నగా మొదలై చిలికి చిలికి గాలివానలా మారింది.

ఆ ఎఫెక్ట్.. జబర్ధస్త్ వర్ష ఆత్మహత్యయత్నం

వచ్చే వారం ప్రసారం కానున్న ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్ ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో కెవ్వు కార్తీక్.. వర్ష స్కిట్ చేస్తున్న సమయంలో జడ్జ్ రోజా 'మీరూ మీరూ ఫూల్స్ చేసుకోవడం కాదు. బయట ఉన్న టీమ్ లీడర్లను చేయండి' అని వాళ్లకు చెప్పింది. దీంతో మొదట హైపర్ ఆదితో ఆ తర్వాత చలాకీ చంటితో ప్రాంక్ చేసింది వర్ష. తర్వాత గొడవ జరగడంతో ఆత్మహత్యయత్నం చేసింది.

 స్టూడియోలో కొట్టుకున్న ఇద్దరు టీమ్ లీడర్లు

స్టూడియోలో కొట్టుకున్న ఇద్దరు టీమ్ లీడర్లు

చలాకీ చంటి.. వర్షను ఉద్దేశించి 'మంచిగా ప్రాక్టీస్ చేసుకో.. అన్నీ చెబుతారా' అంటూ మందలించాడు. దీంతో ఆమె బిల్డింగ్ పైకి ఎక్కి దూకుతా అని బెదిరించింది. దీంతో అతడు భయపడిపోయాడు. ఆ తర్వాత కిందకు వచ్చి ఏప్రిల్ ఫూల్ అని పంచ్ వేసింది. దీంతో కోప్పడిన చంటి.. కార్తీక్‌పై గొడవకు దిగాడు. ఆ తర్వాత చాలా మంది వచ్చారు. దీంతో ఇద్దరు టీమ్ లీడర్లు కొట్టుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X