జబర్ధస్త్ కమెడియన్ కేసులో కీలక మలుపు.. వినోద్ అలా చేయడం వల్లే.. బయటకొచ్చిన సంచలన విషయం
Recommended Video
నాలుగు రోజుల క్రితం జబర్ధస్త్ కమెడియన్ వినోద్‌పై దాడి జరిగిన విషయం తెలిసిందే. అద్దెకు ఉంటున్న ఇంటి యజమాని తనను దారుణంగా కొట్టాడని అతడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. ఈ ఘటనలో వినోద్ కుడి కంటి పైభాగంలో తీవ్రంగా గాయమైంది. ప్రస్తుతం అతడు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ ఘటనకు సంబంధించి ఓ విషయం తాజాగా బయటకు వచ్చింది.

వినోద్ చెప్పిందిదే
దాడికి కారణాలను వినోద్ పోలీసులకు, మీడియాకు వివరించాడు. ‘నేను కిరాయికి ఉంటున్న ఇంటిని కొందామని ఇద్దరు వ్యక్తులకు రూ.10 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాను. ఐతే.. రిజిస్ట్రేషన్ ఎపుడు పెట్టుకుందానమని అడిగినపుడల్లా.. ఇవాళ, రేపు అంటూ నాన్చుతూ వచ్చారు. దీంతో నేను ఇంటిని రిజిస్ట్రేషన్ అయినా చేయించండి.. లేదా నా డబ్బులు వెనక్కి తిరిగి ఇవ్వమని అడిగాను. దీంతో వాళ్లు నాపై దాడి చేశారు' అని జబర్ధస్త్ కమెడియన్ చెప్పుకొచ్చాడు.

యజమాని తరపు వాళ్లు మాత్రం
వినోద్‌పై దాడి చేసిన యజమాని తరపు వాళ్లు మాత్రం దీనిని ఖండిస్తున్నారు. కొద్దిరోజులుగా ఇల్లు అమ్మమని వినోద్ బలవంతం చేస్తున్నాడని, అది కుదరదని ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదని అంటున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని, ఆ సమయంలో వినోదే మొదట యజమానిపై దాడి చేశాడని ఆరోపిస్తున్నారు. ఆ తర్వాతనే యజమాని వినోద్‌పై దాడి చేశాడని అంటున్నారు.

పరారీలో యజమాని
వినోద్‌పై దాడి జరిగిన తర్వాత సదరు ఇంటి యజమాని పరారయ్యాడు. జబర్ధస్త్ కమెడియన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఆయన ఇంటికి వెళ్లగా, అక్కడ ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో అతడు పరారీలో ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అలాగే, ఆ వ్యక్తిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.

రివర్స్ కంప్లైంట్
వినోద్‌పై దాడి చేశాడని చెబుతున్న వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఆయన ఈ రెండు మూడు రోజుల్లో బయటకు వస్తాడని కొందరు అంటున్నారు. అంతేకాదు, సదరు యజమాని వినోద్‌పై రివర్స్ కంప్లైంట్ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని కూడా చెబుతున్నారు.

ఆడ వేషాలతో ఫేమస్
వినోద్.. జబర్ధస్త్ షో ద్వారా బుల్లి తెరకు పరిచయం అయ్యాడు. ఎప్పుడూ ఆడ వేషాలు వేయడంతో అతడు బాగా ఫేమస్ అయ్యాడు. ఎక్కువగా చమ్మక్ చంద్ర స్కిట్లలో వినోద్ కనిపిస్తూ ఉండేవాడు. దీంతో అతడికి ఫాలోయింగ్ కూడా భారీగా పెరిగిపోయింది. ఎక్కడికి వెళ్లినా చాలా మంది తనను సెల్ఫీలు అడుగుతుంటారని వినోద్ గతంలో చెప్పాడు.

వినోద్ తీరు వివాదాస్పదం
జబర్ధస్త్ కమెడియన్ వినోద్ తీరు మొదటి నుంచీ వివాదాస్పదంగానే ఉంది. గతంలో ఒకసారి వినోద్‌కు పెళ్లి చేసేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నింగా ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన అప్పట్లో పెద్ద దుమారం రేపింది. ఆ తర్వాత అతడు కిడ్నాప్‌కు గురయ్యాడు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనం అయింది.


Click it and Unblock the Notifications











