‘KGF Chapter 2’ నుంచి అదిరిపోయే అప్‌డేట్: టీజర్ రిలీజ్ డేట్‌పై నిర్మాత ప్రకటన

దక్షిణాదిలోని అన్ని భాషలతో పోలిస్తే కన్నడం సినిమాలకు మాత్రం పెద్దగా రికార్డులు ఉండేవి కాదు. దీనికి కారణం మన సినిమాలు అక్కడ రిలీజ్ చేయకూడదు.. అక్కడివి ఇక్కడ రాకూడదు అని ఆ పరిశ్రమ ఏర్పాటు చేసుకున్న కొన్ని నిబంధనలే. అయితే, KGF Chapter 1 రిలీజ్ అయ్యాక ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇండియన్ సినిమాపై ఈ సినిమా చూపించిన ప్రభావం అంతా ఇంతా కాదు. ఇది ఐదు భాషల్లో విడుదల కాగా, అన్ని చోట్లా సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. అదే సమయంలో కన్నడ సినిమా స్టామినాను కూడా దేశ వ్యాప్తంగా చాటి చెప్పుకుంది.

ఇంతటి విజయం తర్వాత దీనికి కొనసాగింపుగా KGF Chapter 2 రూపొందుతోన్న విషయం తెలిసిందే. మొదటి భాగంలో గరుడను చంపి కేజీఎఫ్‌ను తన సొంతం చేసుకుంటాడు రాఖీ బాయ్‌. చాప్టర్ 2లో హీరోకు అధీర (సంజయ్ దత్) రూపంలో మరో శత్రువు పుట్టుకొస్తాడు. అతడిని ఎలా అంతమొందిచాడు అన్న కథతో ఇది తెరకెక్కుతోంది. కరోనా ప్రభావంతో ఆలస్యం అయిన ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఒకటి బయటకు వచ్చింది. అదే.. ఈ సినిమా టీజర్ గురించిన విషయం.

KGF Chapter 2 Teaser Date Fix

ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన కార్తీక్ గౌడ తాజాగా సోషల్ మీడియాలో లైవ్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనను KGF Chapter 2 టీజర్‌ను ఎప్పుడు విడుదల చేస్తారని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా 'జనవరి 8న టీజర్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఆరోజు మన హీరో గారి పుట్టినరోజు కాబట్టి అందుకు తగినట్లుగానే సర్‌ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాం' అని వెల్లడించాడు. దీంతో యశ్ అభిమానులు ఆనంద పడుతున్నారు. ఇదిలా ఉండగా, ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X