పెళ్లయ్యాక కూడా పడుకుంటావా అని అడిగారు.. కుటుంబమే నాకు ముఖ్యం, టీవీ నటి హాట్ కామెంట్స్!

చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల అంశం తరచుగా చర్చనీయాంశం అవుతోంది. ఆడిషన్స్ సమయంలో, షూటింగ్ లొకేషన్స్ లో తమకు ఎదురవుతున్న వేధింపులని పలువురు నటీమణులు ధైర్యంగా ప్రస్తావిస్తునారు. బుల్లి తెర నటీమణులకు కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. హిందీలో బుల్లితెరపై చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు సొంతం చేసుకున్న రిచా భద్ర తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను నటనకు గుడ్ బై చెప్పడానికి గల కారణాలని రిచా వివరించింది.

 చైల్డ్ ఆర్టిస్ట్‌గా

చైల్డ్ ఆర్టిస్ట్‌గా

రిచా భద్ర పలు టివి సీరియల్స్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. కిచిడి, బాబాహూ ఔర్ బేబీ, మిస్టర్ టెండూల్కర్ లాంటి సీరియల్స్ లో రిచా భద్ర చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణించింది. రిచా భద్రకి వివాహం కూడా జరిగింది. ఆమె భర్త ఓ కార్పొరేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. వివాహం అయ్యాక తాను టివి సీరియల్స్ లో నటించడానికి ప్రయత్నించానని రిచా భద్ర చేబోతోంది.

 పెళ్లయ్యాక కూడా

పెళ్లయ్యాక కూడా

వివాహం తర్వాత కొన్ని సీరియల్స్ లో నటించేందుకు ప్రయత్నించాను. ఆడిషన్స్ కు కూడా వెళ్లాను. కానీ అక్కడ నాకు చేదు అనుభవం ఎదురైంది. ఓ దర్శకుడు తనతో చాలా నీఛంగా ప్రవర్తించాడని రిచా భద్ర చెబుతోంది. నన్ను సుఖపెట్టు.. నీకు మరిన్ని అవకాశాలు వస్తాయి అని ఓ దర్శకుడు తనతో ఆడిషన్స్ సందర్భంగా అన్నట్లు రిచా పేర్కొంది. మరో దర్శకుడు మనమిద్దరం ఓసారి కలవాలి అని అన్నాడు. కాఫీ షాప్ లో కలుద్దాం అని చెప్పా. కాదు హోటల్ రూమ్ కి రా అని అడిగాడు.

 ఆ అవసరం నాకు లేదు

ఆ అవసరం నాకు లేదు

ఇలాంటి చేదు సంఘటనల తర్వాత నిర్ణయించుకున్నా ఇక నటన జోలికి వెళ్లకూడదు అని. కాంప్రమైజ్ అయి నటించాల్సిన అవసరం నాకు లేదు. నాకు కుటుంబమే ముఖ్యం. అందుకే తాను ఇకపై నటిగా అవకాశాల కోసం ప్రయత్నించకూడదని నిర్ణయించుకున్నట్లు రిచా తెలిపింది.

అలాంటి పాత్రలే

అలాంటి పాత్రలే

నటనకు దూరం కావడానికి రిచా మరో కారణం కూడా చెప్పింది. నేను కాస్త బొద్దుగా కనిపిస్తాను. నిన్ను గ్లామరస్ గా చూపిస్తాం. కాస్త ఎక్స్పోజింగ్, రొమాన్స్ చేయాలని అని మరికొందరు దర్శకుడు అడిగారు. మా కుటుంబాన్ని ఇబ్బందిపెట్టే పనులు నేను ఎప్పుడూ చేయను. టివి రంగం మొత్తం ఇలాగే ఉంటుంది కాబట్టి నటనకు గుడ్ బై చెప్పినట్లు రిచా పేర్కొంది. ప్రస్తుతం రిచా తన భర్తతో కలసి సంతోషంగా జీవనం సాగిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X