Don't Miss!
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- News రేవంత్‌కు అందుకే నాపై కక్ష: కాళేశ్వరం, కవిత అరెస్టుపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
బిగ్ బాస్ హోస్ట్‌గా మరో స్టార్ హీరో: నాగార్జునతో కలిసి రచ్చ.. ఈ సీజన్‌కే హైలైట్ ఇది!
తెలుగులో బిగ్ బాస్ షో చూపెడుతోన్న ప్రభావం అంతా ఇంతా కాదు. దేశంలో చాలా భాషల్లో ప్రసారం అవుతోన్నా... మన దగ్గర మాత్రమే విపరీతమైన స్పందన వస్తోంది. అందుకే టెలివిజన్ చరిత్రను బిగ్ బాస్‌కు ముందు ఆ తర్వాత అనేలా పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలుగులో ఇప్పటికే మూడు సీజన్లు కంప్లీట్ చేసుకున్న ఈ షో.. నాలుగో దానిని సైతం పూర్తి చేసే దిశగా పయనిస్తోంది. ఇలాంటి సయమంలో బిగ్ బాస్‌లోకి హోస్టుగా మరో స్టార్ హీరో ఎంట్రీ ఇచ్చాడు. ఆదివారం జరిగే ఎపిసోడ్లో నాగార్జునతో కలిసి ఆయన రచ్చ రచ్చ చేయనున్నాడు. ఆ వివరాలు మీకోసం!
రికార్డులు బద్దలు.. రేటింగ్‌లో దూకుడు
బిగ్ బాస్ నాలుగో సీజన్ రెండు నెలల క్రితం అంగరంగ వైభవంగా ప్రారంభం అయింది. దీనికి ఆరంభంలోనే అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో ప్రీమియర్ ఎపిసోడ్‌కు ఏకంగా 18 పైచిలుకు రేటింగ్ నమోదైంది. ఫలితంగా ఇండియన్ టెలివిజన్ హిస్టరీలోనే భారీ రేటింగ్ సాధించిన రియాలిటీ షోగా తెలుగు బిగ్ బాస్ నిలిచింది. అప్పటి నుంచి ఈ షో దేశ వ్యాప్తంగా హైలైట్ అవుతోంది.
గతంలో చూడని సరికొత్త కంటెంట్‌తో షో
తెలుగులో ఇప్పటి వరకు మూడు సీజన్లు పూర్తవగా, వాటన్నింటికీ భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సారి వాటికి మించిన స్పందనను అందుకోవాలన్న పట్టుదలతో బిగ్ బాస్ యూనిట్ పని చేసింది. ఇందులో భాగంగానే వినోదాన్ని రెట్టింపు చేయాలని డిసైడ్ అయింది. అందుకు అనుగుణంగానే సరికొత్త టాస్కులు, ప్రేక్షకులకు నచ్చ కంటెంట్‌తో షోను నడిపిస్తున్నారు.
హోస్టింగ్‌తో ఆకట్టుకున్న కింగ్ నాగార్జున
బిగ్ బాస్ షోకు ఇప్పటి వరకు ముగ్గురు స్టార్ హీరోలు హోస్టులుగా చేశారు. మొదటి సీజన్‌ను జూనియర్ ఎన్టీఆర్, రెండో దాన్ని నేచురల్ స్టార్ నాని, మూడుతో పాటు ప్రస్తుతం ప్రసారం అవుతోన్న సీజన్‌ను అక్కినేని నాగార్జున నడిపిస్తున్నారు. రెండు సీజన్లలోనూ ఆయన అదిరిపోయే హోస్టింగ్‌తో ఆకట్టుకుంటున్నారు. అదే సమయంలో షోకు అదనపు అందాన్ని తీసుకొస్తున్నారు.
స్పెషల్ సర్ప్రైజ్లతో మారిన పరిస్థితులు
వీకెండ్ ఎపిసోడ్స్‌లో ఎప్పుడూ స్పెషల్ సర్ప్రైజ్లు ప్లాన్ చేస్తుంటుంది బిగ్ బాస్ యూనిట్. ఎలిమినేషన్ ఉండే ఆరోజున ఏదైనా జరగొచ్చు అనేలా షోను నడిపిస్తున్నారు. అన్నింటికీ మించి ఆదివారం ఎపిసోడ్‌ను ఫన్నీగా రూపొందిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక అతిథులను సైతం షోలోకి తీసుకు వస్తున్నారు. దీంతో షోలో ఉన్న పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతున్నాయి.
|
బిగ్ బాస్ హోస్ట్‌గా మరో స్టార్ హీరో ఎంట్రీ
సరికొత్త టాస్కులు, లవ్ ట్రాకులు, మసాలా కంటెంట్ సహా ఊహించని సర్ప్రైజ్లతో నాలుగో సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో షో ఒకే తరహా రేటింగ్‌ను అందుకుంటూ ముందుకు సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో షోకు మరింత వన్నె తీసుకు వచ్చేందుకు బిగ్ బాస్ యూనిట్ కొత్త ప్లాన్లతో ముందుకొస్తుంది. ఇందులో భాగంగానే షోలోకి మరో స్టార్ హీరోను తీసుకొచ్చింది.
Recommended Video
నాగార్జునతో కలిసి రచ్చ.. సీజన్‌కే హైలైట్
తాజా సమాచారం ప్రకారం.. బిగ్ బాస్ షోలోకి కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ ఎంట్రీ ఇచ్చాడు. వాళ్ల భాషలో ప్రసారం అయ్యే బిగ్ బాస్‌కు హోస్ట్‌గా చేస్తున్న ఆయన.. ఆదివారం ఎపిసోడ్లో మన షోలో సందడి చేయనున్నాడు. స్పెషల్ హోస్టుగా ఎంట్రీ ఇచ్చిన సుదీప్.. నాగ్‌తో కలిసి రచ్చ రచ్చ చేశాడని సమాచారం. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించాడు.