నాగార్జునపై అఖిల్ అక్కినేని అసంతృప్తి.. బయటపెట్టిన కిచ్చ సుదీప్

బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్‌లో మరో అతిథి ప్రత్యక్షమయ్యాడు. కన్నడ సూపర్ స్టార్, బిగ్‌బాస్ కన్నడ షోకు ఏడుసార్లు హోస్ట్‌గా వ్యవహరించిన కిచ్చ సుదీప్ స్పెషల్ గెస్ట్‌గా వచ్చి కంటెస్టెంట్లతో మాట్లాడారు. నాగ్‌తోపాటు కిచ్చ సుదీప్ చిలిపిగా వ్యవహరించారు. తనదైన ప్రశ్నలు, విషయాలతో ఆకట్టుకొన్నారు. ఈ సందర్భంగా హోస్ట్ నాగ్‌పై తన కుమారుడు అఖిల్‌ వెల్లడించిన అసంతృప్తిని చెప్పారు. ఈ వివారాల్లోకి వెళితే..

బిగ్‌బాస్ కన్నడలో ఏడు సీజన్లకు హోస్ట్‌గా

బిగ్‌బాస్ కన్నడలో ఏడు సీజన్లకు హోస్ట్‌గా

కిచ్చ సుదీప్ గురించి నాగార్జున మాట్లాడుతూ.. ఈగ చిత్రం ద్వారా విశేషంగా అభిమానులను సొంతం చేసుకొన్నారు. బాహుబలి చిత్రంలో చిన్న పాత్ర ద్వారా మరింత ప్రేక్షకాదరణ సాధించారు. అతను ఎవరో కాదు కన్నడ బిగ్‌బాస్‌కు సంబంధించి ఏడు సీజన్లకు హోస్ట్‌గా వ్యవహరించిన కిచ్చ సుదీప్ అంటూ ప్రేక్షకులకు పరిచయం చేశారు.

సుదీప్ నీవు నాకు సీనియర్‌వు

సుదీప్ నీవు నాకు సీనియర్‌వు

కిచ్చ సుదీప్‌తో మాట్లాడుతూ.. చాలా హ్యాపీగా ఉంది. ఈ వేదికను మీతో పంచుకొంటున్నందుకు అని నాగార్జున అన్నారు. ఆర్టిస్టుగా కాకుండా.. బిగ్‌బాస్ పరంగా నీవు నాకు సీనియర్‌వు అని పేర్కొన్నారు. అందుకు సమాధానంగా.. ఏదో ఒక విషయంలో మీకు సీనియర్ కావడం గర్వంగా ఉంది. ఈ వేదికను మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది అని సుదీప్ అన్నారు.

అఖిల్‌తో నీకు ఫ్రెండ్‌షిప్

అఖిల్‌తో నీకు ఫ్రెండ్‌షిప్

ఆ తర్వాత నాకంటే నా కుమారుడు అఖిల్‌తో మీకు మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది. మీరు సీసీఎల్ క్రికెట్ ఆడినప్పుడు మీ మధ్య మంచి అనుబంధం ఏర్పడిందని తెలుసుకొన్నాను. మీ గురించి అఖిల్ ఎక్కువగా చెబుతుంటాడు. మీరంటే అఖిల్‌కు చాలా ఇష్టం. మీరంటే చాలా గౌరవం ఉంది అని నాగ్‌ తెలిపారు.

నాగ్ మీరంటే అఖిల్‌కు అసంతృప్తి

నాగ్ మీరంటే అఖిల్‌కు అసంతృప్తి

అయితే నాగ్ మాటలను మధ్యలో కట్ చేస్తూ.. మీ గురించి అఖిల్‌ నుంచి ఓ కంప్లయింట్ ఉందని సుదీప్ అంటే.. ఏదేంటి అని నాగ్ అడిగాడు. అఖిల్‌ను చాలా సార్లు ఏదో బాధలో ఉన్నట్టు కనిపించే వాడు. అయితే ఒకసారి ఏంటీ నువ్వు ఏదో బాధపడుతున్నట్టు కనిపిస్తున్నదన అడిగితే అసలు విషయం చెప్పాడని కిచ్చ సుదీప్ వెల్లడించారు.

Recommended Video

Bigg Boss Telugu 4 : Jordar Sujatha Re Entry In Bigg Boss House
ఆ విషయం చూసి తట్టుకోలేకపోతున్నా

ఆ విషయం చూసి తట్టుకోలేకపోతున్నా

అఖిల్ నీకు అంతా బాగానే ఉంది కదా.. అంటే ఏదైనా ఉంటే చెప్పు అని నేను అడిగాను. అయితే నా ప్రాబ్లెం నా ఫాదర్. అతనే నాకు సమస్య అంటూ బయటపెడితే నేను షాక్ తిన్నాను. మీ నాన్న అంటే అందరికి ఇష్టం. నీకు ఏమి సమస్య అంటే.. ఆయన వయసు మీద పడుతున్నా.. ఇంకా యంగ్‌గా, యువకుడిగా కనిపిస్తుంటారు. ఆయనను చూసి తట్టుకోలేకపోతున్నానని అఖిల్ చెప్పినట్టు సుదీప్ వెల్లడించారు. దాంతో నాగ్ నవ్వుల్లో మునిగిపోయాడు. ఈ విషయం నీవు చెబుతావని ముందే ఊహించాను అంటూ నాగ్ పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X