Bigg Boss : 11 ఏళ్ల బంధానికి తెర .. బిగ్‌బాస్ హోస్టింగ్‌కు స్టార్ హీరో గుడ్‌బై
ఎన్ని వివాదాలు రేగినా.. ఎన్ని గొడవలు జరిగినా.. భారతీయ సంస్కృతిని నాశనం చేస్తున్నారని సాంప్రదాయవాదులు వ్యతిరేకిస్తున్నా.. చివరికి కోర్టు మెట్లెక్కినా బిగ్‌బాస్ రియాలిటీ షోకు క్రేజ్ పెరుగుతూనే ఉంది. ఒక్క తెలుగులో మాత్రమే కాదు.. ప్రతి భారతీయ భాషలోనూ బిగ్‌బాస్ సక్సెస్ అయ్యింది. ప్రతి సీజన్‌కు రేటింగ్‌ను పెంచుకుంటూ.. కంటెస్టెంట్స్‌గా పాల్గొన్న వారికి స్టార్‌డమ్‌ను, వారి కెరీర్‌కు మాంచి బూస్టప్‌ను అందిస్తోంది.
దేశంలో ఎన్ని రియాలిటీ షోలు ఉన్నా వాటన్నింటినీ అధిగమించి క్రేజ్ తెచ్చుకున్న గ్రాండ్ రియాలిటీ షో బిగ్‌బాస్. పశ్చిమ దేశాలలో స్టార్ట్ అయినా ఇండియాలోనూ ఈ షోకు జనం బ్రహ్మారథం పడుతున్నారు. హిందీ మార్కెట్‌లో సక్సెస్ కావడంతో భారతదేశంలోని ప్రాంతీయ భాషల్లోనూ బిగ్‌బాస్‌ను దించారు. తెలుగు , తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, మరాఠీ భాషల్లో బిగ్‌బాస్ దుమ్మురేపుతోంది. కానీ మన తెలుగులో వచ్చిన రెస్పాన్స్ మాత్రం ఏ భాషలోనూ లేదు. ఇండియాలోనే హయ్యెస్ట్ రేటింగ్స్ తెలుగు బిగ్‌బాస్‌కు దక్కాయి.

ఇటీవల బిగ్‌బాస్ తెలుగు 8కు ఎండ్ కార్డ్ పడిన సంగతి తెలిసిందే.. తాజాగా జనవరి 26తో కన్నడ బిగ్‌బాస్ కూడా ముగియనుంది. శాండల్‌వుడ్ సూపర్‌స్టార్ కిచ్చా సుదీప్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ కన్నడ 11 గడిచిన కొద్దిరోజులుగా ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతోంది. సెప్టెంబర్ 29 నుంచి కలర్స్ కన్నడ ఛానెల్‌లో బిగ్‌బాస్ కన్నడ 11 సీజన్ ప్రారంభమైంది. తొలుత 17 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లో అడుగుపెట్టారు . తర్వాత 50వ రోజున వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హనుమంత, శోభాశెట్టి, రజత్ కిషన్‌లు హౌస్‌లో అడుగుపెట్టారు.
బిగ్‌బాస్ కన్నడ సీజన్ 11 ఫినాలేలో హనుమంత, త్రివిక్రమ్, మోక్షితలు బెర్త్‌లు కన్ఫర్మ్ చేసుకున్నారు. 16వ వారం నామినేషన్స్‌లో ఉన్న భవ్య, ధరణి, గౌతమి, మంజు, రజత్‌లలో .. రజత్, మంజులు ఎలిమినేట్ అవుతారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మిగిలిన ముగ్గురు గ్రాండ్ ఫినాలేలో అడుగుపెడతారని అంటున్నారు. ఫైనల్ ఎపిసోడ్ కోసం నిర్వాహకులు గ్రాండ్‌గా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సుదీప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఈ షోకు తాను హోస్ట్‌గా చేయనని .. త్వరలో జరగనున్న గ్రాండ్ ఫినాలే తర్వాత బిగ్‌బాస్ చేయనని ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. వ్యాఖ్యాతగా వినోదాన్ని అందించానని భావిస్తున్నానని.. నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి సుదీప్ ధన్యవాదాలు తెలిపారు. అయితే గతంలోనే తాను బిగ్‌బాస్ హోస్టింగ్ నుంచి తప్పుకుంటున్నట్లు సుదీప్ తెలిపారు. మిగిలిన భాషల్లో బిగ్‌బాస్‌కు వచ్చినంత గుర్తింపు కన్నడ షోకు రావడం లేదని.. అలాంటప్పుడు తాను ఇంతగా కష్టపడాల్సిన అవసరం లేదని సుదీప్ ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. తాజాగా తన నిర్ణయాన్ని కన్ఫర్మ్ చేస్తూ అధికారికంగా బిగ్‌బాస్‌కు వీడ్కోలు పలికారు కిచ్చా.


Click it and Unblock the Notifications











