twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కిడ్నాప్ కేసులో జబర్దస్త్ కమెడియన్.. కారులో తీసుకెళ్లి చితకబాదిన వైనం.. కేసు నమోదు

    |

    తెలుగు టెలివిజన్ షోలతో బెస్ట్ కామెడీ షోగా క్రేజ్ అందుకుంటున్న జబర్దస్త్ పై వివాదాలు చెలరేగడం కొత్తేమి కాదు. ఇక కమెడియన్స్ కూడా చాలా సందర్భాల్లో స్కిట్స్ కారణంగా పలు వివాదాల్లో ఇరుక్కోవాల్సి వచ్చింది. మరికొందరైతే పర్సనల్ లైఫ్ లో కూడా ఊహించని విధంగా తప్పుల కారణంగా పోలీసులకు దొరికిపోయారు. ఇక చాలా రోజా తరువాత మరో జబర్దస్త్ కమెడియన్ పై పోలీస్ కేసు నమోదవ్వడం హాట్ టాపిక్ గా మారింది.

    కార్తిక్ పై కిడ్నాప్ కేసు

    కార్తిక్ పై కిడ్నాప్ కేసు

    జబర్దస్త్ షో ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కెవ్వు కార్తిక్ పై పోలీస్ కేసు నమోదవ్వడం ఒక్కసారిగా వైరల్ అయ్యింది. గూడూరు పోలీస్ స్టేషన్ లో కిడ్నాప్ కేసుతో పాటు ఈ కమెడియన్ పై దాడి కేసు కూడా నమోదైంది. ఈ వార్త ఒక్కసారిగా సోషల్ మిడియాలోనే కాకుండా ఇతర మీడియా ఛానెల్స్ లలో కూడా హాట్ టాపిక్ గా మారింది.

     టీమ్ లీడర్ గా కొనసాగుతున్న కార్తిక్

    టీమ్ లీడర్ గా కొనసాగుతున్న కార్తిక్

    గతంలో జబర్దస్త్ కమెడియన్స్ వేణు, నరేష్, దొరబాబు, ధన్ రాజ్, వివిధ రకాల వివాదాలతో వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు అదే తరహాలో కెవ్వు కార్తిక్ కూడా ఒక వివాదంలో ఇరుక్కోవడం చర్చనీయాంశంగా మారింది. కెవ్వు కార్తీక్ జబర్దస్త్ లో దాదాపు అన్ని టీమ్ లలో సపోర్టింగ్ కమెడియన్ గా అలరించాడు. సొంతంగా స్క్రిప్ట్ లు కూడా రాసుకోగలడు. ప్రస్తుతం టీమ్ లీడర్ గా కొనసాగుతున్నాడు.

     బలవంతంగా 15కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి..

    బలవంతంగా 15కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి..

    ఇక అసలు విషయంలోకి వెళితే కెవ్వు కార్తీక్ పై అలాగే అతని తల్లిదండ్రులపై కూడా కిడ్నాప్ కేసుతో పాటు దాడి కేసు కూడా నమోదైంది. తన సోదరి భర్తను బలవంతంగా కిడ్నాప్ చేసి 15కిలోమీటర్ల దూరం తీసుకువెళ్లారని రవి యాదవ్ అనే వ్యక్తి పోలీసులకు పిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. కార్తిక్ స్నేహితులతో పాటు అతని తల్లిదండ్రులు కూడా ఈ గోడవకు అసలు కారణమని ఫిర్యాదులో పేర్కొన్నారు.

    కిడ్నాప్ చేసి దాడి చేశారు

    కిడ్నాప్ చేసి దాడి చేశారు

    కారులో దూరం తీసుకువెళ్లిన తరువాత కార్తీక్ తో పాటు అతని స్నేహితులు తన సోదరి భర్తపై దారుణంగా దాడి చేసినట్లు రవి యాదవ్ చెప్పడంతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ గోడవపై మీడియాలో ఇప్పటికే అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. అయినప్పటికీ ఇంతవరకు కార్తిక్ వివరణ ఇవ్వలేదు. కెరీర్ సరైన పద్దతిలో కొనసాగుతున్న క్రమంలో సడన్ గా ఇలాంటి వివధాల్లో చిక్కుకోవడం అంత మంచిది కాదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

    English summary
    Controversy is not new with jabardast, who is getting craze as the best comedy show with Telugu television shows. Even comedians have in many cases been embroiled in controversy due to skits. The other was found by the police due to unexpected mistakes even in personal life. After a long time, the filing of a police case against another formidable comedian became a hot topic.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X