ఎన్టీఆర్ కుదరదని చెప్పేశాడు.. నాగార్జున ఏమంటాడో!

Recommended Video

Bigg Boss 3 Telugu : King Nagarjuna Approached By Big Boss Management | Filmibeat Telugu

బిగ్ బాస్ 2 సీజన్ ప్రేక్షుకులని బాగానే ఎంటర్ టైన్ చేసింది. కానీ కొన్ని వివాదాలు కూడా చోటుచేసుకున్నాయి. బిగ్ బాస్ 2 ముగిసిన తర్వాత బిగ్ బాస్ 3 గురించి అనేక ఉహాగానాలు మొదలయ్యాయి. బిగ్ బాస్ 3 మరింతగా ఆకట్టుకునే విధంగా ఉండాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. తొలి సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించాడు. ఎన్టీఆర్ షోని నడిపించిన విధానానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత అదే జోరుని నాని కొనసాగించాడు. కాగా ఈ ఏడాది ప్రారంభం కాబోయే సీజన్ 3కి హోస్ట్ ఎవరనే ఉత్కంఠ అందరిలో నెలకొని ఉంది.

ఎన్టీఆర్ గురించి జోరుగా

ఎన్టీఆర్ గురించి జోరుగా

బిగ్ బాస్ సీజన్ 3కి కూడా ఎన్టీఆరే హోస్ట్ గా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వినిపించాయి. ఎన్టీఆర్ అయితేనే బావుంటుందని ఫ్యాన్స్ కూడా అభిప్రాయ పడుతున్నారు. కానీ ఆర్ఆర్ఆర్ బిజీ షెడ్యూల్ వలన తాను బిగ్ బాస్ 3కి హోస్ట్ గా ఉండలేనని ఎన్టీఆర్ తేల్చి చెప్పేసినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ నిర్వాహకులు భారీ పారితోషికం ఆఫర్ చేసిన ఎన్టీఆర్ తిరస్కరించిందట. ఎన్టీఆర్ తప్పుకోవడంతో ఈ షోని విజయవంతంగా నడిపించే మరో హోస్ట్ కోసం నిర్వాహకులు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

నాగార్జునతో సంప్రదింపులు

నాగార్జునతో సంప్రదింపులు

ఎన్టీఆర్ తప్పుకోవడంతో బిగ్ బాస్ నిర్వాహకులు కింగ్ నాగార్జునతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నాగార్జున ఇదివరకే మీలో ఎవరు కోటీశ్వరుడు షోకి హోస్ట్ గా వ్యవహరించారు. ఈ షో సూపర్ సక్సెస్ అయింది. నాగార్జున ఏమాత్రం తడబడకుండా అద్భుతంగ హోస్టింగ్ చేశారు. వ్యాఖ్యాతగా నాగార్జున నైపుణ్యాన్ని అంతా ప్రశంసించారు. ఇలాంటి షోలకు నాగార్జున బాగా సూట్ అవుతాడు కూడా. దీనితో నాగార్జునని సంప్రదించి ఆయన్ని ఒప్పించే పనిలో బిగ్ బాస్ టీం ఉన్నట్లు తెలుస్తోంది.

వివాదాలు లేకుండా

వివాదాలు లేకుండా

గత ఏడాది జరిగిన బిగ్ బాస్ షోకు నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించాడు. బిగ్ బాస్ 2 అనేక వివాదాలకు కారణం అయింది. కొందరు కంటెస్టెంట్స్ ప్రవర్తించిన తీరు, మహిళలకు ఇబ్బంది కలిగించేలా ఉండే కొన్ని టాస్క్ లపై విమర్శలు ఎదురయ్యాయి. అలాంటి పొరపాట్లు బిగ్ బాస్3 లో జరగకూడదని నిర్వహకులు భావిస్తున్నారు.

త్వరలోనే

త్వరలోనే

జూన్ లేదా జులైలో బిగ్ బాస్ 3 షో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా హోస్ట్ ని డిసైడ్ చేసి షో ప్రారంభించాలని భావిస్తున్నారు. మొదటి సీజన్ ని ముంబైలో షూట్ చేశారు. బిగ్ బాస్ 2 చిత్రీకరణ హైదరాబాద్ లోనే జరిగింది. దీనితో చాలా విషయాలు ఎపిసోడ్ ప్రసారం కాకముందే లీక్ అయిపోయాయి. 3వ సీజన్ కోసం షూటింగ్ లొకేషన్ మారుస్తారేమో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X