యాంకర్‌తో ఇమ్మాన్యుయేల్ హద్దు మీరిన రొమాన్స్.. కక్కుర్తి వెధవ అంటూ అనసూయ
స్టార్ మాలో ప్రసారమవుతున్న కిర్రాక్ బాయ్స్- ఖిలాడీ గర్ల్స్ సీజన్ 2కు మంచి ఆదరణ దక్కుతోంది. వారం వారం సరికొత్త థీమ్‌తో నిర్వాహకులు ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నారు. శ్రీముఖి హోస్టింగ్.. జడ్జిలుగా అనసూయ- శేఖర్ మాస్టర్, అమ్మాయిల అందచందాలు, అబ్బాయిల సెటైర్లతో యూత్‌కి బాగా కనెక్ట్ అవుతోంది. ఎప్పటిలాగే ఈ వారం కూడా మంచి థీమ్‌తో అలరించేందుకు సిద్ధమైంది కిర్రాక్ బాయ్స్- ఖిలాడీ గర్ల్స్. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. ఈ వివరాల్లోకి వెళితే..
షోను నడిపిస్తోన్న శ్రీముఖి
సరిగ్గా బిగ్‌బాస్ ప్రారంభానికి ముందు ప్రసారమవుతున్న కిర్రాక్ బాయ్స్- ఖిలాడీ గర్ల్స్ 2 బాగా క్లిక్ అయ్యింది. గత బిగ్‌బాస్ సీజన్‌కు కూడా ఈ షోలో పార్టిసిపేట్ చేసిన వారే కంటెస్టెంట్స్‌గా రావడంతో అది ఒక ప్లస్ పాయింట్‌గా మారుతుంది. వీరి పర్ఫార్మెన్స్ చూసి బిగ్‌బాస్‌కు ఎవరెవరు కంటెస్టెంట్స్‌గా వస్తారో అంచనా వేస్తున్నారు ప్రేక్షకులు. బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్స్, సీరియల్ నటులతో ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నడిపిస్తున్నారు శ్రీముఖి. ఆమెకు అనసూయ, శేఖర్ మాస్టర్‌లు సహకరిస్తున్నారు.

పార్టీ థీమ్‌తో లేటెస్ట్ ఎపిసోడ్
ఎప్పటిలాగే ఈ వారం కూడా కిర్రాక్ బాయ్స్- ఖిలాడీ గర్ల్స్ సరికొత్త థీమ్‌తో సిద్ధమైంది. అదే పార్టీ థీమ్. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. ప్రోమో ప్రారంభం కాగానే సై మూవీలోని సాంగ్‌తో కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. అమర్‌దీప్ చౌదరి- శ్రీసత్యలను పిలిచిన శ్రీముఖి ఓ బాక్స్‌లో నుంచి చీటి తీయమని చెబుతుంది. ఇద్దరూ లోపల చేయి పెట్టగా వీడు నా చేయి నొక్కుతున్నాడని శ్రీసత్య కసురుకుంటుంది. దాంతో ఓరేయ్ లోపల కూడా కెమెరా ఉందని శ్రీముఖి వార్నింగ్ ఇస్తుంది. ఆ మాటలతో నాలుక కరచుకున్న అమర్‌దీప్.. లోపల కూడా కెమెరా పెట్టారని తొంగి చూస్తాడు.
దేబ్‌జనీని ముద్దు అడిగిన ఇమ్మాన్యుయేల్
తర్వాత జబర్తస్త్ ఇమ్మాన్యుయేల్- బుల్లితెర నటి దేబ్‌జనీ మోదక్‌లు స్టేజ్ మీదకు వచ్చి బాక్స్‌లో చేయి పెడతారు. ఇమ్మాన్యుయేల్ తన చేతిని నొక్కుతూ ఉండటంతో నొప్పిగా ఉంది వదలమని చెప్పండి అంటూ శ్రీముఖీని అడుగుతుంది దేబ్‌జనీ. ఇది చూసిన అనసూయ ఛీ.. కక్కుర్తి వెధవ అని తిడుతుంది. రెడ్ కలర్ బాల్ తీసిన ఇమ్మాన్యుయేల్‌కు దేబ్‌జనీ నుంచి నీకేం కావాలని ఆఫర్ ఇస్తుంది శ్రీముఖి. దాంతో దేబ్‌జనీ వచ్చి నాకు ముద్దు పెట్టాలని చెబుతాడు ఇమ్మాన్యుయేల్. ఆ మాటలతో అంతా షాక్ అవ్వగా.. దేబ్‌జనీ అలా చూస్తుండి పోతుంది.
వన్స్‌మోర్ అన్న అనసూయ
ఇంతకీ ఆమె ముద్దు పెడుతుందా? లేదా? అని మిగిలిన కంటెస్టెంట్స్ చూస్తుండగా ఇమ్మాన్యుయేల్ కళ్లు మూసిన దేబ్‌జనీ.. అతని బుగ్గపై ముద్దుపెడుతుంది. దాంతో అబ్బాయిలు, అమ్మాయిలు కేకలు వేస్తుండగా.. ముద్దు పెట్టేసిందా అని అనసూయ- శేఖర్ మాస్టర్‌లు తెల్లబోతారు. మీరు ముద్దు పెట్టుకుంటుంటే మేం చూడలేదని, మాట్లాడుకుంటున్నామని శేఖర్, అనసూయ చెబుతారు. మీరు చూడలేదా? జడ్జిలు చూడకపోతే ఎలా? మళ్లీ ముద్దు పెట్టమంటూ దేబ్‌జనీని పిలుస్తాడు ఇమ్మాన్యుయేల్. ఆ మాటలతో దేబ్‌జనీ షాక్ అవ్వగా.. ఇమ్మాన్యుయేల్‌ను కొడుతుంది శ్రీముఖి. మరి ఇమ్మాన్యుయేల్‌కు దేబ్‌జనీ మోదక్ మరోసారి ముద్దు పెట్టిందా? ఈ పార్టీ థీమ్‌లో అబ్బాయిలు గెలిచారా? అమ్మాయిలు గెలిచారా? అన్నది తెలియాలంటే ఈ ఆదివారం వరకు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











