అనసూయ - శేఖర్ మాస్టర్‌ల మధ్య కోల్డ్ వార్.. నలిగిపోతున్న శ్రీముఖి
కొత్త కొత్త రియాలిటీ షోలతో స్టార్ మా మరోసారి సిద్ధమైంది. ప్రతి యేటా బిగ్‌బాస్ సీజన్‌కు ముందు ప్రతిసారి ఏదో ఒక గేమ్ షో తీసుకురావడం స్టార్ మాకు అలవాటు. తాజాగా కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ సీజన్ 2కు సందడి మొదలైంది. గతేడాది మొదలైన ఈ గేమ్ షో బాగా జనాల్లోకి వెళ్లింది. మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది.
స్టార్ యాంకర్ అనసూయ, స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ జడ్జిలుగా మరో స్టార్ యాంకర్ శ్రీముఖీ హోస్ట్‌గా ప్రసారమైన ఈ షో యూత్‌ను, ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. 2024 జూన్ 29 రాత్రి 9 గంటలకు ప్రారంభమైన కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ శని, ఆదివారాల్లో ప్రసారం అయ్యేది. కిర్రాక్ బాయ్స్ టీమ్‌కు శేఖర్ మాస్టర్, ఖిలాడీ లేడీస్ టీమ్‌కు అనసూయలు టీమ్ లీడర్స్‌గా వ్యవహరించారు. ఈ షోలో కంటెస్టెంట్స్ సంగతి ఏమో కానీ అనసూయ - శేఖర్‌లు రెచ్చిపోయేవారు. ఇద్దరూ సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటూ రచ్చ రచ్చే చేసేవారు.

ఓ ఎపిసోడ్‌లో అనసూయ తన బ్లేజర్ విప్పడంతో కంటెస్టెంట్ట్స్ షాక్ అయ్యారు. దీంతో శేఖర్ మాస్టర్ కూడా షర్ట్ తీసేశారు. రెండు జట్లు గోల గోల చేసుకోవడంతో దీనికి సంబంధించి క్లిప్ యూత్‌లోకి బాగానే వెళ్లి కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ బాగానే క్లిక్ అయ్యింది. మధ్యలో శ్రీముఖి అందాలు, పంచ్‌లు, అరుపులు కేకలు ఉండనే ఉన్నాయి. 10 మంది అమ్మాయిలు, 10 మంది అబ్బాయిల మధ్య జరిగిన ఈ పోరులో చివరికి ఖిలాడీ గర్ల్స్‌పై కిర్రాక్ బాయ్స్ గెలిచి రూ.20 లక్షల ప్రైజ్ మనీ అందుకున్నారు. గేమ్స్, టాస్క్‌లు అచ్చు గుద్దినట్లు బిగ్‌బాస్ మాదిరే ఉండటం ఈ షో క్లిక్ కావడానికి మరో రీజన్.
కట్ చేస్తే ఈ ఏడాది కూడా కిర్రాక్ బాయ్స్ - ఖిలాడీ గర్ల్స్ బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా రిలీజ్ చేసింది. 1.50 నిమిషాల నిడివితో రిలీజైన ఈ ప్రోమోలో అనసూయ- శేఖర్ మాస్టర్‌లు , ఈ షోకు సెలెక్ట్ అయిన కంటెస్టెంట్స్ నెక్ట్స్ లెవల్‌లో తలపడి .. సీజన్ 2 ఎలా ఉండబోతుందో అన్నది హైలైట్ చేశారు. మీరు గత సీజన్‌లో ఓడిపోయారంటూ అనసూయపై సెటైర్లు వేశారు శేఖర్ మాస్టర్.
సింహం ఒక అడుగు వెనక్కి వేసిందంటే ఓడిపోయినట్లు కాదంటూ కౌంటర్ విసిరింది అనసూయ. ఆ వెంటనపే మైక్ తీసుకుని.. హల్లో మైక్ టెస్టింగ్ అంటూ ఎంట్రీ ఇచ్చింది శ్రీముఖీ. మళ్లీ ఫైర్ మొదలైంది.. ఇది ఎక్కడికి వెళ్తుందోనంటూ గొడవలు ఎలా ఉంటాయో చెప్పకనే చెప్పింది. ఇదే ప్రోమోలో కిర్రాక్ బాయ్స్ - ఖిలాడీ లేడీ సీజన్ 2కి సెలెక్ట్ అయిన కంటెస్టెంట్స్ ఒక్కొక్కరిగా కనిపించారు. జబర్దస్త్ ఐశ్వర్య, తేజస్వి మదివాడ, దేబ్‌జనీ మోదక్, శ్రీసత్య, హమీదా ఖాతూన్, జబర్దస్త్ రోహిణి, నిఖితా రాజేష్, ఇమ్మాన్యుయేల్, రవికృష్ణ, యాంకర్ నిఖిల్, శివకుమార్, పృథ్వీ, బమ్ చిక్ బబ్లూ, సుస్మిత తదితరులు కనిపించారు. మరి కిర్రాక్ బాయ్స్ - ఖిలాడీ గర్ల్స్ ఎప్పుడు టెలికాస్ట్ కానుంది? ఈసారి గేమ్స్ ఎలా ఉంటాయో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











