నీ బతుక్కి వాళ్లతో పోటీపడగలవా .. ఫస్ట్ ఓడిపోయేది మా యువరాణే : జబర్దస్త్‌గా రోజా పరువు తీసేసిన కిరాక్ ఆర్పీ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నేతలు ప్రచారంలో మాటల యుద్ధానికి దిగుతున్నారు. వాడి వేడి విమర్శలు, కౌంటర్లు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో ఏపీ రాజకీయం హాట్ హాట్‌గా సాగుతోంది. మధ్యలో సినీతారల ఎంట్రీతో ఇది తారా స్థాయికి చేరింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంపై ఫోకస్ ఎక్కువగా వుంది. ఆయన కోసం హీరోలు, ఇతర సినీనటులు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. నాగబాబు, వరుణ్ తేజ్, సాయిథరమ్ తేజ్ , వైష్ణవ్ తేజ్‌లతో పాటు జబర్దస్త్ ఆర్టిస్టులు హైపర్ ఆది, రాంప్రసాద్, సుడిగాలి సుధీర్‌, గెటప్ శ్రీనులు పవన్ కళ్యాణ్‌ను గెలిపించాలని కోరుతున్నారు.

మిగిలిన వారి సంగతేమో కానీ జబర్దస్త్ ఆర్టిస్టులపై వైసీపీ క్యాంప్ నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాళ్లు పెయిడ్ ఆర్టిస్టులని, డబ్బు తీసుకుని ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు. మొన్నామధ్య మంత్రి రోజా చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. వాళ్లవి చిన్న ప్రాణాలని పట్టించుకోవాల్సిన అవసరం లేవంటూ వ్యాఖ్యానించారు. దీనిపై గెటప్ శ్రీను ఘాటుగానే బదులిచ్చారు. తన బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇస్తానని .. జనసేన నుంచి రూపాయి వచ్చినట్లు నిరూపించాలని సవాల్ విసిరారు. తమను ఎవరూ ప్రచారానికి పిలవలేదని, తామే స్వచ్ఛందంగా పవన్ కళ్యాణ్ కోసం తిరుగుతున్నామని తేల్చిచెప్పారు.

Kiraak RP strong counter to ap minister rk roja for her comments on jabardasth artists

తాజాగా మరో జబర్దస్త్ నటుడు కిరాక్ ఆర్పీ ఈ లిస్ట్‌లోకి చేరారు. నేరుగా రోజాపైనే ఆయన విమర్శలు ఎక్కుపెట్టాడు. ఆమె మాకు మర్యాద ఇస్తేనే మేం కూడా ఇస్తూ మాట్లాడతామని.. మావి చిన్న ప్రాణాలని, చిన్న ఆర్టిస్టులమని రోజా అంటున్నారు. మరి ఆవిడేమైనా నేషనల్ లెవల్ ఆర్టిస్టా.. ఆ యువరాణికి 10 నేషనల్ అవార్డులు, 10 ఆస్కార్ అవార్డులు గెలిచిందా అంటూ ఆర్పీ సెటైర్లు వేశారు. సుధీర్, శ్రీను, హైపర్ ఆది వంటి ఆర్టిస్టులు పవన్ కళ్యాణ్ కోసం స్వచ్ఛందంగా ప్రచారం చేస్తున్నారని ప్రశంసించారు. అంతటితో ఆగలేదు.. నీ జీవితంలో ఎప్పుడైనా గెటప్ శ్రీనులాగా యాక్ట్ చేయగలవా.. సుధీర్ కింది స్థాయి నుంచి కష్టపడి ఎదిగి ఇవాళ హీరో అయ్యాడని, అతనికి ఉన్నంత క్రేజ్ అయినా వుందా అని ఆర్పీ విరుచుకుపడ్డాడు.

హైపర్ ఆది జబర్దస్త్ చరిత్రనే మార్చేశాడని.. గంటసేపు ఏకధాటిగా కామెడీ చేసి నవ్వించగలడని, ఆయనతో నువ్వు పోటీ పడగలవా అని కిరాక్ ఆర్పీ ప్రశ్నించారు. నీ బతుకులో వీరి ముగ్గురిలాంటి ఛరిష్మాను చూశావా అంటూ మండిపడ్డారు. రేపు జరగబోయే ఎన్నికల్లో ఫస్ట్ ఓడిపోయే సీటే నగరి.. అని అక్కడ ఆమెకు డిపాజిట్లు కూడా రావన్నారు. జనసేనలో ఏడుగురు హీరోలుంటే.. రోజా వాళ్ల అన్న దగ్గర 70 మంది రౌడీలున్నారని ఆర్పీ ఆరోపించారు. ఒకసారి ఆయనను ఎదిరించి మాట్లాడగలవా.. నిన్ను లేపేస్తాడని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. తామెప్పుడూ రోజాను అగౌరవంగా మాట్లాడలేదని.. కానీ ఆవిడ మాత్రం మమ్మల్ని చిన్న ప్రాణులు, చిన్న ఆర్టిస్టులని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నోరు మూసుకుని నీ ప్రచారం నువ్వు చేస్కో.. వీలుంటే జనసేనకు సపోర్ట్ చేయ్, జూన్ 4న అందరి లెక్కలు తేలుస్తామని కిరాక్ ఆర్పీ హెచ్చరించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X