Don't Miss!
- News
స్వల్ప భూకంపం.. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో.. జనం పరుగులు
- Finance
Success Story: చిన్న వయస్సులోనే వ్యాపారంలోకి.. ప్రపంచంతో పోటీపడుతూ.. నూతన సాంకేతికతతో..
- Sports
భారత క్రీడల్లో స్వర్ణ యుగం మొదలైంది: నరేంద్ర మోదీ
- Automobiles
మరింత శక్తివంతమైన ఇంజన్‌తో అప్‌గ్రేడ్ అవుతున్న రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450
- Technology
OnePlus 10T 5G కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్లో బగ్ సమస్యలకు చెక్...
- Lifestyle
ముద్దొచ్చే బుజ్జాయిలను ముద్దాడనివ్వొద్దు
- Travel
పర్యాటకులను ఆకర్షించే మేఘ్ మలహర్ పర్వ విశేషాలు!
Jabardasthపై ఆర్పీ సంచలన వ్యాఖ్యలు.. ఇది వ్యాపారమే.. చంచల్‌గూడ నయం అంటూ!
జబర్దస్త్ షో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షోలో ఫేమస్ అయ్యాక సినిమాల్లో కూడా తమ సత్తా నిరూపించుకుంటున్నారు. జబర్దస్త్ అద్భుతం అంటూ ఇప్పటివరకు బయటకు వచ్చిన వాళ్ళందరూ కామెంట్లు చేస్తూ వచ్చారు కానీ తాజాగా జబర్దస్త్ నుంచి బయటకు వచ్చి కామెడీ స్టార్స్ ప్రోగ్రాంలో మెరుస్తున్న కిరాక్ ఆర్పీ మాత్రం షోపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు జబర్దస్త్ అన్నా శ్యాం ప్రసాద్ రెడ్డి అన్నా మల్లెమాల సంస్థ అన్నా, అసలు నచ్చదు అంటూ ఆయన కామెంట్ చేశారు. ఆ వివరాలు వెళ్తే

కిరాక్ ఆర్పీ
జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన కమెడియన్లలో కిరాక్ ఆర్పీ కూడా ఒకరు.. ఒకప్పుడు హోటల్ లో వెయిటర్ గా పనిచేసే స్థాయి నుంచి ఈరోజు జబర్దస్త్ ద్వారా ఒక సొంత ఇల్లు హైదరాబాద్ లో కొనుక్కునే స్థాయికి వచ్చాడు. అయితే ఈ మధ్యకాలంలో ఆయన లక్ష్మీ ప్రసన్న అనే యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ సందర్భంగా ఒక యూట్యూబ్ ఛానల్ ఆయనతో ఇంటర్వ్యూ నిర్వహించింది. ఆ ఇంటర్వ్యూలో ఆయన అనేక విషయాలను పంచుకున్నారు.

పచ్చబొట్టు
ఈ మధ్యకాలంలో కామెడీ స్టార్స్ ప్రోగ్రాంలో నాగబాబు పేరుని ఆర్పీ తన గుండెల మీద పచ్చబొట్టు వేయించుకున్నాడనే విషయం బయటకు రావడంతో యాంకర్ ఇదే విషయాన్ని ప్రశ్నించారు. మీ అమ్మ పేరు కానీ, అమ్మలాంటి జబర్దస్త్ పేరు కానీ, నీకు కాబోయే భార్య లక్ష్మీ ప్రసన్న పేరు కానీ పచ్చబొట్టు వేయించుకోలేదు కానీ ఆయన పేరు ఎందుకు వేయించుకున్నావు అంటే అది ఒకటి రెండు కారణాల వల్ల వేయించుకున్న పచ్చబొట్టు కాదని అనేక విషయాల్లో ఆయన తనకు అండగా నిలబడ్డారని ఆర్పీ చెప్పుకొచ్చాడు.

వ్యవహారమని
అంతేకాకుండా జబర్దస్త్ గురించి మీరు అనుకున్నదంతా నిజం కాదని మల్లెమాల అనేది ఒక పేరు మాత్రమే అదేమీ దేవత, తల్లో కాదంటూ పేర్కొన్నాడు. శ్యాంప్రసాద్ రెడ్డి చేసేది కేవలం వ్యాపారం మాత్రమే. ఆయన నాకేంటి, నీకేంటి అన్నట్టుగానే వ్యవహరిస్తారు తప్ప మరోటి కాదని ఆర్పీ అన్నారు. అదే నాగబాబు మాత్రం చేసేది వ్యవహారమని ఆయన అందరిని ఆదుకుంటూ తలలో నాలుకలా వ్యవహరిస్తారని చెప్పుకొచ్చారు.

గెస్ట్ గా వెళ్లానని
ఈ సందర్భంగా తన ప్రేమ విషయాన్ని కూడా బయటపెట్టిన కిరాక్ ఆర్పీ లక్ష్మీ ప్రసన్న సివిల్స్ చదువుకునే ఇన్స్టిట్యూట్ కి తాను గెస్ట్ గా వెళ్లానని ఆ సమయంలో ఆమె నచ్చడంతో ఆమె ఫోన్ నెంబర్ తీసుకున్నానని వెల్లడించాడు. ఆమె తెలివిగా వాళ్ళ అమ్మ నెంబర్ ఇవ్వడంతో ముందు ఆమెతో మాట్లాడానని ఆర్పీ చెప్పుకొచ్చాడు.

వివాహానికి రంగం సిద్ధం
ఇక ఇదే విషయం గురించి లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ సంవత్సరం పాటు అమ్మతో మాట్లాడిన తర్వాతే తన వరకు వచ్చాడని అయితే పెళ్లి గురించి ముందే అమ్మకు అర్థం కావడంతో కాస్త దూరం కూడా పెట్టిందని చెప్పుకొచ్చింది. అయితే ఫైనల్ గా ఆర్పీ మా బంధువులందరికీ కూడా దగ్గరై తర్వాత ఎట్టకేలకు తన తల్లిని కూడా ఒప్పించి వివాహానికి రంగం సిద్ధం చేశాడని ఆమె వెల్లడించారు.