జీవితంలో మళ్లీ దాని జోలికి వెళ్లను.. అవసరం, అవకాశం అంటూ జబర్దస్త్ కమెడియన్ సెన్సేషనల్ కామెంట్స్
జబర్దస్త్ షో గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని ప్రేక్షకులుండరు. బుల్లితెరపై గత కొన్నేళ్లలో తన కంటూ ఓ ముద్ర వేసుకున్న జబర్దస్త్ షోతో.. ఎంతో మంది ఆర్టిస్ట్‌లు వెలుగులోకి వచ్చారు. జబర్దస్త్‌నే ఇంటి పేరుగా చేసుకుని కొంతమంది ఓ రేంజ్‌కు వెళ్లిపోయారు. అయితే కొన్ని రోజులుగా జబర్దస్త్ వార్తల్లో నిలుస్తూనే ఉంది.

నాగబాబు అవుట్..
జబర్దస్త్ షో నుంచి నాగబాబు బయటకు రావడమే ఓ పెద్ద సెన్సేషన్. వస్తూ వస్తూ షో మీదా, నిర్వాహకుల మీదా విమర్శలు చేశాడు. నాగబాబు తన యూట్యూబ్ చానెల్‌లో జబర్దస్త్‌లోని అంతర్గత విషయాలను ఎపిసోడ్స్ ఎపిసోడ్స్‌గా వీడియోలు పెట్టాడు.

కొత్త షోలో పాత ఆర్టిస్ట్‌లు..
జబర్దస్త్ సీనియర్ ఆర్టిస్ట్‌లు వేణు వండర్స్, ధన్‌రాజ్ వంటివారు, చమ్మక్ చంద్ర, కిరాక్ ఆర్పీలతో వేరే చానెల్‌లో అదిరింది అంటూ ఓ కొత్త షోను ప్రారంభించారు. జబర్దస్త్‌లో క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల బయటకు వచ్చామని చెప్పుకున్న దర్శకులు నితిన్ భరత్‌ల ఆద్వర్యంలో ఈ కొత్త షో నడుస్తోంది.

పోటాపోటీగా పంచ్‌లు..
జబర్దస్త్, అదిరింది షోలో పోటాపోటీగా పంచ్‌లు పడుతూనే ఉంటాయి. అక్కడి అర్టిస్ట్‌లు ఇక్కడ.. ఇక్కడి ఆర్టిస్ట్‌లు అక్కడ ఒకరిపై మరొకరు సెటైర్లు వేసుకుంటారు. ఇందులో ముఖ్యంగా హైపర్ ఆది అనసూయ, నాగబాబు వంటివారిపై పరోక్షంగా పంచ్‌లు వేస్తూనే ఉంటాడు.
Recommended Video


అవసరం.. అవకాశం..
జబర్దస్త్ జోలికి మళ్లీ వెళ్లనని కిరాక్ ఆర్పీ చెప్పుకొచ్చాడు. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌తో మాట్లాడుతూ.. ఎవ్వరూ ఎవ్వరికీ లైఫ్ ఇవ్వరని తెలిపాడు. రోడ్డు మీద వెళ్లే ఆర్పీని తీసుకొచ్చి ఎవ్వరూ లైఫ్ ఇవ్వరని, వారు ఓ షో పెట్టారని వారికి అది అవసరం.. నాకు అది అవకాశం అంతేనని పేర్కొన్నాడు. ఇక్కడ ఎవ్వరూ లైఫ్ ఇవ్వరని, అది చాలా పెద్ద మాట అని ఎలా పడితే అలా వాడేయొద్దని అన్నాడు.


Click it and Unblock the Notifications











