Bigg Boss 7 Leaks: లీకైన ఎలిమినేషన్.. ఫస్ట్ వీక్ ఆ బ్యూటీనే ఔట్.. తెలుగు పిల్ల పైకి అతడు కిందకు!
తెలుగు బుల్లితెరపై ఎన్నో రకాల కార్యక్రమాలు వస్తున్నా.. భారీ స్థాయిలో ప్రేక్షకుల ఆదరణను అందుకుంటూ.. సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలుస్తోన్న ఏకైక షో బిగ్ బాస్. అంతలా ఇది ఏడేళ్లుగా అందరినీ అలరిస్తూ నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది.
దీంతో ఇప్పుడు ఏడో సీజన్ కూడా ఎంతో గ్రాండ్‌గా ప్రారంభం అయింది. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని నడుపుతున్నారు. ఇక, ఈ సీజన్‌లో మొదటి వారం ఎలిమినేషన్ ప్రక్రియ వివరాలు లీక్ అయ్యాయి. మరి ఫస్ట్ వీక్‌లో షో నుంచి బయటకు వెళ్లిపోయింది ఎవరో చూద్దాం పదండి!

ఆరంభంలోనే ఆసక్తిని రేపుతూ: బిగ్ బాస్ ఆరో సీజన్ డిజాస్టర్ అవడంతో ఏడో దాన్ని ఉల్టా పుల్టా అనే కొత్త కాన్సెప్టును తీసుకు వచ్చారు. ఇందులో ప్రీమియర్ ఎపిసోడ్ నుంచి ఎన్నో ఊహించని అంశాలను చూపిస్తున్నారు. అదే సమయంలో గతంలో ఎన్నడూ చూడని కొత్త కొత్త టాస్కులు కూడా చూపిస్తున్నారు. దీంతో ఈ సీజన్‌పై ఆరంభంలోనే అందరిలో ఆసక్తి పెరిగిపోయింది. ఫలితంగా రెస్పాన్స్ కూడా వస్తోంది.
మొదటి వారం నామినేషన్స్: ప్రస్తుతం ప్రసారం అవుతోన్న ఏడో సీజన్‌లో మొదటి వారం జరిగిన నామినేషన్స్ ప్రక్రియలో మొత్తం ఎనిమిది మంది సభ్యులు నామినేట్ అయిన విషయం తెలిసిందే. వారిలో పల్లవి ప్రశాంత్, కిరణ్ రాథోడ్, ప్రిన్స్ యావర్, శోభా శెట్టి, షకీలా, రతికా రోజ్, గౌతమ్ కృష్ణ, దామినిలు ఉన్నారు. గతంలో కంటే ఇప్పుడు ప్రేక్షకుల ఓట్ల సంఖ్యను తగ్గించడంతో ఎలిమినేషన్స్ రంజుగా మారింది.
ఓటింగ్ సరళి లీక్.. అతడికే: బిగ్ బాస్ ఓటింగ్ ప్రాసెస్ మొత్తం సీక్రెట్‌గా సాగుతుందన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ దీనిపై సమాచారం మాత్రం లీక్ అవుతూనే ఉంటుంది. ఇందులో భాగంగానే ఏడో సీజన్‌కు సంబంధించి మొదటి వారానికి జరిగిన ఓటింగ్‌లో యువ రైతుగా ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్‌కు ప్రేక్షకులు జై కొట్టినట్లు తెలిసింది. మొత్తంగా ఈ వారంలో అతడే టాప్‌లో ఉన్నాడు.
ఫస్ట్ వీక్‌లో ఆమె ఎలిమినేట్: బిగ్ బాస్ షోకు సంబంధించి ఎలిమినేషన్ అనేది చాలా సీక్రెట్‌గా జరిగే వ్యవహారం అన్న విషయం తెలిసిందే. అయినా ఇది ఒకరోజు ముందుగానే షూటింగ్ జరుపుకోవడంతో సమాచారం మొత్తం లీక్ అవుతోంది. ఇక, ఏడో సీజన్ మొదటి వారంలో కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయినట్లు ఇప్పటికే న్యూస్ బయటకు వచ్చేసింది. దీంతో ఆమె ఫ్యాన్స్ అయోమయంలో ఉన్నారు.
చివర్లో మారింది.. వాళ్లిద్దరే: బిగ్ బాస్ ఏడో సీజన్ మొదటి వారంలో జరిగిన ఓటింగ్‌లో కిరణ్ రాథోడ్‌కు తక్కువ ఓట్లు పోల్ అవుతున్నాయని ముందే చెప్పుకున్నాం. ఆమె తర్వాత దామినికి స్వల్ప ఓటింగ్ ఉందన్న విషయం కూడా లీకైంది. అయితే, అనూహ్యంగా చివరి రోజు దామిని పుంజుకుంది. దీంతో ఆరో స్థానంలో ఉన్న ప్రిన్స్ యావర్ ఏడో ప్లేస్‌కు చేరాడు. ఫలితంగా చివరి రౌండ్‌కు వచ్చాడు.


Click it and Unblock the Notifications











