Bigg Boss 7 Telugu నన్ను కీలుబొమ్మను చేసి ఆడించింది.. ఆవిడ నాగిన్ లాంటింది.. కిరణ్ రాథోడ్ స్రీకెట్స్ బట్టబయలు
బిగ్‌బాస్ తెలుగు 7 రియాలిటీ షోలో తొలివారం సాదాసీదాగా ముగిసింది. ఇంటిలోకి వెళ్లిన కంటెస్టెంట్లు ఇంకా హౌస్‌మేట్స్ కాకముందే ఎలిమినేషన్ ప్రక్రియను బిగ్‌బాస్ సక్సెస్‌పుల్‌గా ముగించారు. ఇంటిలోకి వచ్చిన సీనియర్ హీరోయిన్ కిరణ్ రాథోడ్ అందరూ ఊహించినట్టే ఇంటి నుంచి బయటకు వచ్చారు. అయితే బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన కంటెస్టెంట్లను ఇంటర్వ్యూ చేసే బిగ్‌బాస్ బజ్ కార్యక్రమంలో కిరణ్ రాథోడ్ పాల్గొన్నాడు. ఆమె చెప్పిన విషయాల్లోకి వెళితే..
బిగ్‌బాస్ తెలుగులో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను స్టార్ మా మ్యూజిక్ చానెల్ పలు విషయాలను అడిగి తెలుసుకొంటుంది. ఈాసారి బిగ్‌బాస్ బజ్ కార్యక్రమంలో హోస్ట్‌గా గీతూ రాయల్ హోస్గ్‌గా వ్యవహరించారు. ఎలిమినేట్ అయిన కిరణ్ రాథోడ్‌కు స్వాగతం పలికి ప్రశ్నలతో తికమక పెట్టేందుకు ప్రయత్నించింది.

బిగ్‌బాస్ తెలుగు 7 రియాలిటీ షో నుంచి తొలివారమే రావడం ఊహించారా? అంటే.. లేదు. చాలా త్వరగా నిర్ణయం తీసుకొన్నారు. ఇంకా కొన్ని రోజులు ఉంటే.. నేను తెలుగులో అందరితో వాగ్వాదం చేసే అవకాశం ఉండేది. కానీ త్వరగా బయటకు పంపించారు. మళ్లీ అవకాశం లభిస్తే నేను ఇంట్లోకి వెళ్లి తెలుగులో రఫ్ ఆడిస్తాను అని కిరణ్ రాథోడ్ చెప్పారు.
మీరు సోషల్ మీడియాలో హాట్‌గా ఫోటోలు పెడుతారు. మీరు సెక్సీగా, బ్యూటీఫుల్‌గా కనిపిస్తారు. కానీ బిగ్‌బాస్ ఇంటిలో అలా హాట్ ఎందుకు కనిపించలేదు అని గీతూ రాయల్ అడిగిన ప్రశ్నకు.. బిగ్‌బాస్ షో ఫ్యామిలీ ఆడియెన్స్ చేసే ప్రొగ్రాం. అందుకే అలాంటి డ్రస్సులతో నేను కనిపించలేదు. దామిని నాకు అలా ఉండకూడదని సలహా ఇచ్చింది అని కిరణ్ రాథోడ్ చెప్పారు. దాంతో దామిని ఆఢించిన తోలుబొమ్మవా? అంటే.. అవును అని కిరణ్ రాథోడ్ చెప్పారు.

బిగ్‌బాస్ ప్రేక్షకులు కోరుకొన్నట్టు మీరు కనిపించలేదు. అందుకే మీరు అవుట్ అయ్యారా? అని గీతూ రాయల్ అంటే.. అవును.. ఇప్పుడు రియలైజ్ అవుతున్నాను అని కిరణ్ సమాధానం చెప్పింది. మళ్లీ అవకాశం కల్పిస్తే ఏం మార్చుకొంటావు అంటే.. లోపలికి వెళ్లి తెలుగులో వారితో ఫైట్ చేస్తాను. వారిని ఓడిస్తాను అంటూ కిరణ్ రాథోడ్ చెప్పారు.
శుభశ్రీ తెలివి తక్కువ వ్యక్తి. శోభాశెట్టి నాగిన్. దామిని పరిస్థితులను బట్టి మారిపోతుంటుంది. పల్లవి ప్రశాంత్ ముందే బాగా ప్రిపేర్ అయ్యాడు. అదే విషయం ఆయనకు మైనస్ అయ్యే అవకాశం ఉంటుందేమో అని కిరణ్ రాథోడ్ చెప్పారు. గౌతమ్ క్యూట్ అబ్యాయి అని అన్నారు. షకీలా, శివాజీ, శుభశ్రీకి ముద్దులు పెట్టింది. తేజా, శోభాశెట్టి, పల్లవి ప్రశాంత్ పోస్టర్లపై కొపంగా కొడిగుడ్లను కొట్టారు. తేజా వల్ల నేను ఎలిమినేట్ అయ్యాను అని కిరణ్ రాథోడ్ చెప్పారు.


Click it and Unblock the Notifications











