బిగ్‌బాస్2: అతడి పద్ధతి నచ్చలేదు.. తేజస్వి, సామ్రాట్ ప్రేమాయణం, గెలుపు ఎవరిదో చెప్పిన కిరీటి!

నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 2 రసవత్తరంగా సాగుతోంది. మూడవ వీక్ లో నటుడు కిరీటి హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. తొలి రెండు వారాల్లో సామాన్యులు గా ఉన్న సంజన, నూతన్ నాయుడు షో నుంచి ఎలిమినేట్ అయ్యారు. దీనితో హౌస్ నుంచి సామాన్యులనే బయటకు పంపిస్తున్నారని విమర్శలు ఎదురయ్యాయి. మూడవ వారంలో మాత్రం సెలెబ్రిటీ అయిన కిరీటిని బయటకు పంపడం విశేషం. తాజగా ఓ ఇంటర్వ్యూలో కిరీటి పలు ఆసక్తికర విషయాలు బిగ్ బాస్ గురించి తెలియజేశాడు.

Recommended Video

Bigg Boss Season 2 Telugu : Episode 22 Highlights
మంచి అనుభవం

మంచి అనుభవం

బిగ్ బాస్ అనేది అద్భుతమైన గేమ్ షో అని కిరీటి తెలిపాడు. తాను షోనుంచి ఎలిమినేట్ అయ్యాననే భాద లేదని తెలిపాడు. షోనుంచి బయటకు వస్తే జైలుకు వెళ్లమని, ఇంటికే వెళతామని తెలుపాడు. బిగ్ బాస్ అనేది గేమ్ షో కాబట్టి ఎవరో ఒకరు ఎలిమినేట్ కాక తప్పదని తెలిపాడు.

అతడి పద్ధతి నచ్చలేదు

అతడి పద్ధతి నచ్చలేదు

తాను బిగ్ బాస్ హౌస్ లో అందరితో మంచిగానే ఉన్నానని కౌశల్ తెలిపాడు. కానీ కౌశల్, తేజస్వి మధ్య జరిగిన గొడవలో కౌశల్ పద్ధతి నచ్చలేదని కిరీటి తెలిపాడు. ఆ విషయాన్ని తాను అతడికే చెప్పానని అన్నాడు.

కౌశల్ కెప్టెన్ అయితే

కౌశల్ కెప్టెన్ అయితే

ఒకవేళ కౌశల్ కెప్టెన్ అయితే ఇంకా బాధ్యతలు పెరుగుతాయి. అప్పుడు ఇలాంటి వైఖరితో ఉండకూడదు. ఈ విషయాన్నే అతడికి చెప్పానని కిరీటి వివరించాడు.

 నా గురించి నెగిటివ్ గా

నా గురించి నెగిటివ్ గా

తాను హౌస్ లోపల ఉండడం వలన తన గురించి బయట ఎలాంటి ప్రచారం జరుగుతుందో తెలియదని తెలిపాడు. హౌస్ నుంచి బయటకు వచ్చాక తనపై కొంత నెగిటివిటి ఉందని సన్నిహితుల ద్వారా తెలిసిందని కిరీటి తెలిపాడు.

 బెస్ట్ ఫ్రెండ్ దొరికాడు

బెస్ట్ ఫ్రెండ్ దొరికాడు

బిగ్ బాస్ 2 ద్వారా తనకు బెస్ట్ ఫ్రెండ్ దొరికారాని, ఆయన బాబు గోగినేని అని కిరీటి తెలిపాడు. ఆయనతో జీవితాంతం స్నేహం కొనసాగిస్తానని కిరీటి తెలిపాడు.

ఎలిమినేషన్ ముందే ఊహించా

ఎలిమినేషన్ ముందే ఊహించా

తాను తన ఎలిమినేషన్ ముందే ఊహించానని కిరీటి తెలిపాడు. ఎలిమినేషన్ కు ముందు రోజు.. ఛ.. నీకు హగ్ ఇవ్వను అని నాని అన్నాడు. అప్పుడే తనకు అర్థం అయిందని కిరీటి తెలిపాడు.

నా వెనుక ఎవరూ లేరు

నా వెనుక ఎవరూ లేరు

కౌశల్ ని టార్గెట్ చేయడం వెనుక మరో ఉద్దేశం లేదని కిరీటి తెలిపాడు. తన వెనుక కూడా ఎవరూ లేరని తెలిపాడు.

సామ్రాట్, తేజస్వి లవ్ స్టోరీ

సామ్రాట్, తేజస్వి లవ్ స్టోరీ

సామ్రాట్, తేజస్వి మధ్య ప్రేమాయణం జరుగుతోందంటూ ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై కిరీటి స్పందించాడు. వారిద్దరూ మంచి స్నేహితులు మాత్రమే అని తెలిపాడు. ఇక మీద ప్రేమికులుగా మారుతారేమో తనకు తెలియదని, తాను గమనించినత వరకు వారు మంచి స్నేహితులుగా ఉన్నారని తెలిపాడు.

వాస్తవం కాదు

వాస్తవం కాదు

గణేష్ కి మాట్లాడించే అవకాశం హౌస్ లో లేదని వస్తున్న వార్తలపై కూడా కిరీటి స్పందించాడు. అందులో వాస్తవం లేదని, గణేష్ ని ముందు నుంచి ప్రోత్సాహించింది తానేనని కిరీటి అన్నారు.

బిగ్ బాస్ 2 ఎవరు గెలుస్తారంటే

బిగ్ బాస్ 2 ఎవరు గెలుస్తారంటే

బిగ్ బాస్ 2 టైటిల్ గెలిచే సత్తా తేజస్వికి ఎక్కువగా ఉందని కిరీటి తెలిపాడు. టీవీ9 దీప్తి, యాకర్ శ్యామలకు కూడా అవకాశాలు ఉన్నాయని వివరించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X