Kiraak Boys Khiladi Girls : సినిమా డైలాగ్స్‌తో కొట్లాట.. నేను దిగనంత వరకే, ఇంకా రెచ్చగొడుతోన్న అనసూయ
సీరియల్స్, కొత్త సినిమాలు, ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్స్ ఇలా అన్నింటిలోనూ దూసుకెళ్తూ తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్స్‌లో ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ప్రస్తుతం ఈ ఛానెల్‌లో ప్రసారమవుతోన్న 'కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్' షోకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. జూన్ 29 నుంచి శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు టెలికాష్ట్ అవుతోన్న ఈ షోకి ఈ వారంతో ఎండ్ కార్డ్ పడనుంది. స్టార్ యాంకర్ అనసూయ ఖిలాడీ బ్యూటిస్‌కి , కిర్రాక్ బాయ్స్‌కి కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ లీడర్స్‌గా ఉంటే.. మన రాములమ్మ శ్రీముఖీ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ గేమ్‌లో గెలిచిన టీమ్‌కి ఏకంగా రూ.20 లక్షల ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు.
ఇప్పటికే గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ప్రోమోని వదిలింది మాటీవీ. ఫైనల్ కావడంతో కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ అమ్మాయిలు, అబ్బాయిలు కలర్‌ఫుల్ డ్రెస్సుల్లో ర్యాంప్ వాక్ చేస్తూ ఎంట్రీ ఇచ్చారు. ఆ ఏడు కొండల మీదున్న వెంకన్న సామి మీద ఒట్టు.. కప్ మా చేతిలో ఉంటది, క్యాష్ ఆ సూట్‌కేసులో ఉంటది అంటూ అర్జున్ అంబటి చెప్పే డైలాగ్‌కి అబ్బాయిలు గోల గోల చేస్తుంటారు. ఇన్ని వారాలు చూసింది ట్రైలర్ మాత్రమేనని.. ఇప్పుడు అసలైన క్లైమాక్స్ మొదలవబోతోందని మన బిగ్‌బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ చెప్పిన పంచ్ డైలాగ్ వైరల్ అవుతోంది.

గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌కి నేచురల్ స్టార్ నానీ చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. ఇంతలో ఓ బుల్లితెర నటి పరిగెత్తుకుంటూ వచ్చి నానిని హగ్ చేసుకోవడంతో అంతా షాక్ అవుతారు. హోస్ట్ శ్రీముఖి .. ఆయనకు పెళ్లయ్యిందని , వదిలిపెట్టాలని హెచ్చరింస్తుంది. కానీ ఆ అమ్మాయి మాత్రం యాంకర్ మాటలు పట్టించుకోకుండా ఇట్స్ ఓకే పర్లేదండి అని చెబుతుంది. దానికి నాని కూడా ఇట్స్ ఓకే నాక్కూడా పర్లేదంటూ నవ్వుతూ చెబుతున్నారు. అనంతరం జడ్జి సీట్‌లో కూర్చొని ఈరోజు గ్రాండ్ ఫినాలేలా లేదని.. నాలుగేళ్ల కాలేజీ లైఫ్‌కి ఈరోజు ఫేర్‌వెల్‌లా ఉందని చెప్పారు.
ఇదొక్కటే కాదు.. గ్రాండ్ ఫినాలేకు సంబంధించి మరో రెండు ప్రోమోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఈ ఖతర్నాక్ గేమ్ షోలో కప్ ఎవరు కొట్టారు.. అమ్మాయిలా, అబ్బాయిలా అన్నది మాత్రం తెలియడం లేదు. ఖిలాడీ గర్ల్స్‌కి ప్రియాంకా జైన్‌ను కెప్టెన్‌ని చేసినప్పుడే అమ్మాయిల పని అయిపోయిందని, వాళ్లే చేజేతులా కప్‌ను అబ్బాయిల చేతుల్లో పెట్టారంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. దీనికి బిగ్‌బాస్‌లో ఆమె ఆటతీరును ప్రస్తావిస్తున్నారు. ఫైనల్‌లో చూసుకుందామంటూ శపథాలు చేసినా రిజల్ట్ వేరే లేదంటున్నారు. అంతగా ఈ షో యూత్‌కి కనెక్ట్ అయ్యింది. అమ్మాయిలు, గెలిచినా అబ్బాయిలు గెలిచినా మాటీవీకి మాత్రం ఈ వీకెండ్‌లో టీఆర్పీలు అదిరిపోతాయంటున్నారు.
మరోవైపు.. గ్రాండ్ ఫినాలేకు ముందు కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ మధ్య మాటల యుద్ధం జరుగుతూ.. ఒకరికొకరు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. ఇందుకు సినిమా డైలాగ్స్‌ను వాడుకుంటున్నారు. అవేంటో ఒకసారి చూస్తే .. ఎవ్వడు గేమ్ ఆడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో వాళ్లే కిర్రాక్ బాయ్స్ అని అబ్బాయిలు అంటున్నారు. టిప్పర్ లారీ వచ్చి స్కూటర్‌ని గుద్దితే ఎట్లా ఉంటదో తెలుసా తేజగాడు గుద్దితే అలా ఉంటది. ముట్టుకుంటే మసి , పట్టుకుంటే నాశనం, ఈ ఖిలాడీ గర్ల్స్‌తో పెట్టుకుంటే మట్టికొట్టుకుపోతారు. చివరిలో అనసూయ వస్తే బాలయ్య లెజెండ్ సినిమాలోని డైలాగ్ చెప్పడంతో ప్రోమో ముగిసింది. మరి అమ్మాయిలు- అబ్బాయిల్లో ఎవరు గెలవబోతున్నారో తెలియాలంటే కొద్దిగంటలు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











