స్టేజ్‌పైనే నానితో ఆమె అలా .. తప్పు అంటూ శ్రీముఖి, పెళ్లయినా నాకు ఓకే అన్న నేచురల్ స్టార్

ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై మాటీవీ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. సీరియల్స్, కొత్త సినిమాలు, ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్స్ ఇలా అన్నింటిలోనూ దూసుకెళ్తూ మంచి టీఆర్‌పీలు అందుకుంటోంది స్టార్ మా. త్వరలో ప్రారంభం కానున్న బిగ్‌బాస్‌తో ఈ ఛానెల్ రేటింగ్స్ ఓ రేంజ్‌లో ఉంటాయని టాక్. ప్రస్తుతం ఈ ఛానెల్‌లో ప్రసారమవుతోన్న 'కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్' షోకి మంచి రెస్పాన్స్ వస్తోంది. జూన్ 29 నుంచి శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు టెలికాష్ట్ అవుతోన్న ఈ షో యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యింది.

స్టార్ యాంకర్ అనసూయ ఖిలాడీ బ్యూటిస్‌కి , కిర్రాక్ బాయ్స్‌కి కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ లీడర్స్‌గా ఉంటే.. మన రాములమ్మ శ్రీముఖీ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ గేమ్‌లో గెలిచిన టీమ్‌కి ఏకంగా రూ.20 లక్షల ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు. కొద్దిరోజుల క్రితం ఓ చిన్న టాస్క్‌లో భాగంగా అనసూయ తన టాప్‌ని విప్పగా, శేఖర్ మాస్టర్ తన షర్ట్ విప్పి షాకిచ్చారు. ఈ దెబ్బతో షో జనాల్లోకి బాగా వెళ్లింది. ఈ వారంతో కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్ షోకి ఎండ్ కార్డ్ పడనుందని టాక్.

kirrak boys vs Khiladi girls game show Grand Finale promo goes viral Natural Star Nani is chief guest

ఎప్పటిలాగే ఈ వారం కూడా ఈ వీక్ ఎపిసోడ్‌ ప్రోమోని వదిలింది మేకర్స్. కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ గ్రాండ్ ఫినాలేకు అమ్మాయిలు, అబ్బాయిలు కలర్‌ఫుల్ డ్రెస్సుల్లో ర్యాంప్ వాక్ చేస్తూ ఎంట్రీ ఇచ్చారు. ఆ ఏడు కొండల మీదున్న వెంకన్న సామి మీద ఒట్టు.. కప్ మా చేతిలో ఉంటది, క్యాష్ ఆ సూట్‌కేసులో ఉంటది అంటూ అర్జున్ అంబటి చెప్పే డైలాగ్‌కి అబ్బాయిలు గోల గోల చేస్తుంటారు.

ఇన్ని వారాలు చూసింది ట్రైలర్ మాత్రమేనని.. ఇప్పుడుంటుంది అసలైన క్లైమాక్స్ అని ప్రియాంక జైన్ పంచ్ డైలాగ్ చెబుతుండగా.. లేడీ డ్యాన్సర్ల మధ్యలో నుంచి నేచురల్ స్టార్ నానీ ఎంట్రీ ఇస్తారు. ఆయనను చూడగానే అనసూయ, శేఖర్ మాస్టర్‌తో పాటు పార్టిసిపెంట్స్ అంతా ఈలలు వేస్తూ గోలగోల చేస్తుంటారు. ఆయన వేసిన స్టెప్స్‌‌కి అమ్మాయిలు కుర్చీల్లో కూర్చోరంటే ఒట్టు.. ఇంతలో ఓ బుల్లితెర నటి పరిగెత్తుకుంటూ వచ్చి నానిని హగ్ చేసుకోవడంతో అంతా షాక్ అవుతారు.

హోస్ట్ శ్రీముఖి తొలుత షాకైనా వెంటనే తేరుకుని హీ ఈజ్ మ్యారీడ్ అని అంటుంది. కానీ ఆ అమ్మాయి మాత్రం ఆమె మాటలు పట్టించుకోకుండా ఇట్స్ ఓకే పర్లేదండి అని చెబుతుంది. దానికి నాని కూడా ఇట్స్ ఓకే నాక్కూడా పర్లేదనడంతో స్టేజ్ దద్ధరిల్లిపోతుంది. అనంతరం జడ్జి సీట్‌లో కూర్చొని పార్టిసిపేట్స్ చేసే టాస్క్‌లపై కామెంట్ చేశారు నాని. చివరిలో ఈ షోకి ఈరోజు గ్రాండ్ ఫినాలేలా లేదని.. నాలుగేళ్ల కాలేజీ లైఫ్‌కి ఈరోజు ఫేర్‌వెల్‌లా ఉందని చెప్పడంతో ప్రోమో ముగుస్తుంది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఏం కవర్ చేశావన్నా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. నానికి గతంలో ఇలాంటి షోలలో పార్టిసిపేట్ చేసిన అనుభవం ఉంది. బుల్లితెర సెన్షేషన్ బిగ్‌బాస్ తెలుగు సెకండ్ సీజన్‌ని అద్భుతంగా హోస్ట్ చేసి తనకు ఎక్కడైనా తిరుగులేని నాని ప్రూవ్ చేసుకున్నారు. ప్రస్తుతం నాని నటించిన సరిపోదా శనివారం ఆగస్ట్ 29న రిలీజ్ కానుంది. ఇందులో ఆయన సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించగా, ఎస్‌జే సూర్య కీలకపాత్ర పోషిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X