Kirrak Seetha: ఆరోజు ఏడుపు ఆగలేదు, నిఖిల్ ఒక వేస్ట్ ఫెలో..కిర్రాక్ సీత షాకింగ్ కామెంట్స్

బిగ్‌బాస్ తెలుగు 8 నుంచి అనూహ్య పరిణామాల మధ్య కిర్రాక్ సీత ఎలిమినేట్ అయ్యారు. హౌస్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌లో ఒకరిగా ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. ఫిజికల్ టాస్క్‌లైనా , హాట్ డిస్కషన్‌లోనైనా సీత ముందుంటారు. పాయింట్‌పై మాట్లాడటంలో సీతకు తిరుగులేదు. ఎవరినైనా నిలదీసి.. తప్పుంటే అంతే హుందాగా తలదించుకుని మంచి పేరు తెచ్చుకున్నారు సీత. ఖచ్చితంగా టాప్ 5లో ఉంటుందని అనుకున్న దశలో ఆమె బిగ్‌బాస్‌ను వీడటం ఫ్యాన్స్‌కి షాకిచ్చింది. ఈ నేపథ్యంలో ఎలిమినేషన్ తర్వాత అర్జున్ అంబటికి ఇచ్చిన బిగ్‌బాస్ బజ్ ఇంటర్వ్యూలో సీత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే :

ఆరవ వారం సీతతో కలిపి ఆరుగురు నామినేషన్స్‌లో ఉన్నారు. గంగవ్వ, విష్ణుప్రియ, మెహబూబ్, యష్మిగౌడ, పృథ్వీరాజ్‌లు మిగతా వారు. ఆదివారం నాటి ఎపిసోడ్‌లో నాగార్జున ఒక్కొక్క కంటెస్టెంట్‌ను సేవ్ చేస్తూ రాగా.. చివరిలో మెహబూబ్, సీతలు మిగలగా.. కిర్రాక్ సీత ఎలిమినేట్ అయినట్లుగా నాగార్జున ప్రకటించారు. అయితే బిగ్‌బాస్ నిర్ణయాన్ని సీత అభిమానులు, నెటిజన్లు తప్పుబడుతున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్‌లో అడుగుపెట్టిన మెహబూబ్ పెద్దగా ఎంటర్‌టైన్ చేసిందేమీ లేదు.. నాగ్ కూడా అతనికి మొట్టికాయలు వేశాడు. అయితే ఫిజికల్ గేమ్స్ బాగా ఆడటంతో పాటు వివాదాలు రేపడంలో మనోడు సిద్ధహస్తుడు , పైగా వచ్చిన వారానికే మెహబూబ్‌ను ఎలిమినేట్ చేస్తే జనంలోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న ఉద్దేశంతో బిగ్‌బాస్ సీతను బలి చేశారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

Kirrak Seetha Bigg Boss Buzzz Interview with arjun Ambati after elimination from bigg boss telugu 8

హౌస్‌ను వీడుతూ తన బెస్ట్ ఫ్రెండ్ విష్ణుప్రియ గురించి బాగా మాట్లాడింది సీత. ఆమె చాలా అమాయకురాలని.. ఈ గేమ్ నీకు అర్ధం కాదని, కానీ నీ లోపల ఫైర్ ఉందని చెబుతుంది. బిగ్‌బాస్ నుంచి బయటికి వచ్చాక అమ్మని మరిపించే వ్యక్తి నీకు భర్తగా వస్తాడని ఇది కృష్ణుడు నా ద్వారా నీకు చెప్పించిన మాట అని అంటుంది సీత. నేను నిన్ను ఫినాలేలో చూడాలని.. బాగా ఆడమని తన ఫ్రెండ్‌కి వీడ్కోలు పలికింది కిర్రాక్ సీత.

బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయిన వాళ్లను నటుడు అర్జున్ అంబటి ఇంటర్వ్యూలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా సీత కూడా అతనికి ఇంటర్వ్యూ ఇచ్చింది. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. బిగ్‌బాస్ అనేది లైఫ్ టైం అపర్చ్యూనిటి అని.. దానిని సరిగా యూజ్ చేసుకున్నారా అని అర్జున్ అడుగుతాడు. నా 100 పర్సెంట్ ఎఫర్ట్ నేను ఇచ్చానని చెబుతుంది. హౌస్‌లో మీ పతనం ఎప్పుడు మొదలైందని అనుకుంటున్నారని అర్జున్ ప్రశ్నించగా.. టాస్క్‌లు వచ్చినప్పుడు వేరే వాళ్లని పుష్ చేయడం వల్లేనే అని సీత అభిప్రాయపడ్డారు. తన వ్యక్తిత్వాన్ని చంపుకునేలా వ్యవహరించలేదని.. సోనియాకు నిఖిల్ రెడ్ హగ్ ఏం చూసి ఇచ్చాడో తనకు అర్ధం కాలేదని, పర్సనల్ ఎమోషన్స్ చూసి ఇస్తాడని తాను ఎక్స్‌పెక్ట్ చేయలేదని అందుకే ఆ టైంలో ఏడుపొచ్చిందని సీత చెబుతుంది.

నిఖిల్‌ను ఏం చూసి పర్ఫెక్ట్ హజ్బెండ్ మెటీరియల్ అనే ట్యాగ్ ఇచ్చారని అర్జున్ అడగ్గా.. ఓ వ్యక్తిని మనం ఇష్టపడితే, అతను మనల్ని తిరిగి ఇష్టపడితే బాగుంటుందని చెప్పింది. తర్వాత హౌస్ మేట్స్ ఫోటోలను ఇచ్చి ఎవరైతే వెస్ట్ అనుకుంటున్నారో చెప్పాలని అర్జున్ టాస్క్ ఇస్తాడు. టేస్టీ తేజా, మణికంఠ, నిఖిల్, ప్రేరణలను వేస్ట్ అని చెబుతుంది. అమ్మ పంపిన లెటర్ గురించి అర్జున్ అడగ్గా.. అమ్మను హౌస్‌లో చూడలేకపోయానని ఎమోషనల్ అవుతుంది. మరి ఆమె చెప్పిన మరిన్ని సంగతులు తెలుసుకోవాలంటే ఫుల్ ఎపిసోడ్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X