Bigg Boss Telugu 8 Voting : మెరుగుపడని ఓటింగ్ .. బిగ్‌బాస్ నుంచి ఆమె ఔట్?
బిగ్‌బాస్ తెలుగు 8 సక్సెస్‌ఫుల్‌గా 40 రోజులు పూర్తి చేసుకుని మరో పది రోజుల్లో 50 డేస్ మార్క్‌ను క్రాస్ చేయనుంది. 14 మందితో మొదలైన ఈ సీజన్ కొత్త కొత్త ట్విస్ట్‌లతో సాగుతోంది. 5 వారాల్లోనే ఆరుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కాగా.. 8 మందిని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా లోపలికి పంపారు. పాత వారిని ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్స్ అని, కొత్త వారిని రాయల్ క్లాన్‌గా పిలుస్తున్నారు. ఈ వారం నామినేషన్స్ కూడా హోరాహోరీగా జరగడంతో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారోనని ఉత్కంఠగా నిలిచింది. మరి ఓటింగ్ ఎలా జరుగుతుందో చూస్తే :
గత రెండు రోజులుగా హౌస్‌లో బిగ్‌బాస్ హోటల్ టాస్క్ జరుగుతోంది. ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్స్ బ్యాచ్ హోటల్ స్టాఫ్‌గా.. రాయల్ క్లాన్ సభ్యులు అతిథులుగా అవతారమెత్తి కడుపుబ్బా నవ్విస్తున్నారు. ఈ టాస్క్‌లో ఎవరైతే ఎక్కువ సంపాదిస్తారో వారు మెగా చీఫ్ కంటెండర్‌గా నిలుస్తారు. ఎవరి దగ్గరైతే ఎక్కువ స్టార్స్ ఉంటాయో వారికి స్పెషల్ పవర్ వస్తుంది. దీంతో రాయల్ క్లాన్ సభ్యులను ఎంటర్‌టైన్ చేయడానికి పాత కంటెస్టెంట్స్ కిందా మీదా పడ్డారు. ఎవరికి వచ్చిన విద్యను వారు ప్రదర్శించారు.

అయితే బిగ్‌బాస్ ఈ క్యారెక్టర్లను మార్చేశాడు. అవినాష్, రోహిణిల అసిస్టెంట్‌గా టేస్టీ తేజను , హరితేజ కొడుకుగా మెహబూబ్‌ని, గౌతమ్‌ని ఆకతాయిగా ఫిక్స్ చేశాడు. ఓజీ బ్యాచ్‌లో పృథ్వీని నబీల్‌కు కొడుకుగా.. అవినాష్‌కు అట్రాక్ట్ అయ్యే హోటల్ మేనేజర్‌గా ప్రేరణను సెట్ చేశాడు. యష్మీ గౌడ బాగా చేసిందని ఆమెకు ఓ స్టార్ ఇవ్వాలని రాయల్ క్లాన్ నిర్ణయించింది. తర్వాత సీత, నిఖిల్‌లు కూడా స్టార్స్‌ను గెలుచుకున్నారు. బాత్‌రూమ్‌లో వాటర్ వేస్ట్ చేసినందుకు గాను ఇంటి సభ్యులకు బిగ్‌బాస్ ఓ టాస్క్ ఇవ్వగా ఇందులో ఓజీ క్లాన్ గెలిచింది. హోటల్ టాస్క్‌లో రాయల్ క్లాన్ విన్ అవ్వగా.. ఓరిజినల్ గ్యాంగ్‌స్టర్స్ వద్ద రూ.1,08,500.. రాయల్ క్లాన్ దగ్గర రూ.1,16,500 ప్రైజ్‌మనీ ఉన్నట్లు బిగ్‌బాస్ అనౌన్స్ చేశాడు. మొత్తంగా 40వ రోజు ప్రేక్షకులకు మంచి వినోదం దొరికింది.
ఇక ఈ వారం ఓటింగ్ దాదాపుగా ముగియగా.. ఎలిమినేట్ అయ్యేది ఎవరో సోషల్ మీడియాలో కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు నెటిజన్లు. ఆరో వారం నామినేషన్స్‌లో యష్మిగౌడ, విష్ణుప్రియ, కిర్రాక్ సీత, పృథ్వీరాజ్, గంగవ్వ, మెహబూబ్ ఉన్నారు. గంగవ్వ ఈ వారం మొత్తం ఓటింగ్‌లో నెంబర్ వన్ ప్లేస్‌లో కంటిన్యూ అవుతున్నారు . ఆమెకు 21.51 శాతం ఓట్లు పడగా. . మెహబూబ్ 17.56 శాతం ఓట్లతో సెకండ్ ప్లేస్‌లో నిలిచాడు.

విష్ణుకి 16.06 శాతం ఓట్లు పడగా.. యష్మికి 15.96 శాతం ఓటింగ్ నమోదైంది. పృథ్వీరాజ్ 13.19 శాతం ఓటింగ్‌తో ఐదో స్థానంలో, కిర్రాక్ సీత 10.8 శాతం ఓటింగ్‌తో డేంజర్ జోన్‌లో నిలిచారు. వీరిద్దరిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అవ్వడం ఖాయం. ముఖ్యంగా సీత హౌస్‌ను వీడతారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. పలుమార్లు బిగ్‌బాస్ ఇచ్చిన అవకాశాలను వినియోగించుకోలేకపోవడం, టాస్క్‌లలో డల్ అయిపోవడంతో సీత ఓటింగ్ తగ్గుతూ వచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఆమె ఎలిమినేట్ అవుతుందా లేక బిగ్‌బాస్ చివరిలో షాకిస్తాడా అనేది చూడాలి.


Click it and Unblock the Notifications











