Bigg Boss Voting : ఓటింగ్ రారాణి గంగవ్వ .. ఆ ఇద్దరికి బిగ్ రిలీఫ్, ఈ వీక్‌తో ఆమె జర్నీ ముగిసినట్లేనా?
బిగ్‌బాస్ తెలుగు 8లో ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్స్, రాయల్ క్లాన్ సభ్యుల మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత బాగా డల్ అయిపోయారు పాత కంటెస్టెంట్స్. కామెడీ, గేమ్స్, డిస్కషన్స్ ఇలా అన్నింట్లోనూ రాయల్ క్లాన్ డామినేషన్ చేస్తుండటంతో ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్స్ ఎలాగైనా సత్తా చాటాలని భావిస్తున్నారు. ఈ వారం నామినేషన్స్ కూడా హోరాహోరీగా జరగడంతో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారోనని ఉత్కంఠగా నిలిచింది. మరి ఓటింగ్ ఎలా జరుగుతుందో చూస్తే :
ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్స్, రాయల్ క్లాన్ సభ్యులకు మధ్య గత సీజన్‌లలోనే మాదిరిగానే బిగ్‌బాస్ హోటల్ టాస్క్ ఇచ్చాడు. అతిథులను మెప్పించి ఎవరైతే ఎక్కువ సంపాదిస్తారో వారు మెగా చీఫ్ కంటెండెర్స్‌గా నిలుస్తారు. అలాగే ఎవరి దగ్గర ఎక్కువ స్టార్స్ ఉంటాయో వారికి స్పెషల్ పవర్ లభిస్తుందని బిగ్‌బాస్ ఆఫర్ ఇస్తారు. రాయల్ క్లాన్ సభ్యులు అతిథుల్లాగా.. ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్స్ హోటల్ స్టాఫ్‌లా మారిపోయారు.

టాస్క్‌లోనూ పృథ్వీతో రొమాన్స్ చేసింది విష్ణుప్రియ. గెస్ట్‌లను చూసుకుంటూనే ఎవరూ చూడకుండా డబ్బులున్న బ్యాగ్ కొట్టేసింది సీత. ఇంతలో విష్ణుప్రియ గమనించగా.. ఆమెకు డబ్బులో సగం ఇస్తానని చెబుతుంది. అటు టిప్పు కోసం యష్మీ చేసిన పిల్ల చేష్టలు నవ్వు తెప్పిస్తాయి.. కామెడీ బాగా వర్కవుట్ కావడంతో అవినాష్ రెచ్చిపోయాడు. ఆమె చేత డ్యాన్స్ చేయించి ఇంకాస్త ఆడుకున్నాడు ముక్కు అవినాష్. ప్రేరణ అయితే స్విమ్మింగ్ పూల్‌లోకి దిగి మరి టేస్టీ తేజకి సేవలు చేసింది.
గార్డెన్‌లో మాట్లాడుకుంటున్న గంగవ్వ, గౌతమ్, టేస్టీ తేజ దగ్గరికి వచ్చిన యష్మీని.. గౌతమ్‌ని పెళ్లి చేసుకోమని చెబుతుంది గంగవ్వ. డబుల్ టిప్ ఇస్తే దేనికైనా రెడీ అంటూ యష్మీ షాకిస్తుంది. అలా బిగ్‌బాస్ హోటల్ టాస్క్ బోల్డెంత వినోదాన్ని పంచుతుంది. ఎవరు ఎంత సంపాదించారో, ఎవరి దగ్గర ఎన్ని స్టార్స్ ఉన్నాయో, ఎవరు మెగా చీఫ్ కంటెండర్ అవుతారో చూడాలి.
ఇక ఈ వారం ఓటింగ్ విషయానికి వస్తే.. ఆరో వారం నామినేషన్స్‌లో ఆరుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. వారు యష్మిగౌడ, విష్ణుప్రియ, కిర్రాక్ సీత, పృథ్వీరాజ్, గంగవ్వ, మెహబూబ్. బిగ్‌బాస్ హౌస్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి గంగవ్వ ఓటింగ్‌లో దుమ్మురేపుతున్నారు. నాలుగు రోజులు ఓటింగ్‌లో నెంబర్ వన్ ప్లేస్‌లో కంటిన్యూ అవుతున్నారు ఈ విలేజ్ బ్యూటీ. ఆమెకు 26.2 శాతం ఓట్లు పడగా. . మెహబూబ్ 19.9 శాతం ఓట్లతో సెకండ్ ప్లేస్‌లో నిలిచాడు.

మూడో స్థానం కోసం కొట్టుకున్న విష్ణు, యష్మిలు సేఫ్ జోన్‌లోకి వచ్చినట్లుగా ఓటింగ్ రిజల్ట్స్ చెబుతున్నాయి. విష్ణుకి 19.03 శాతం ఓట్లు పడగా.. యష్మికి 15.42 శాతం ఓటింగ్ నమోదైంది. పృథ్వీరాజ్ 14.5 శాతం ఓటింగ్‌తో ఐదో స్థానంలో, కిర్రాక్ సీత 10.3 శాతం ఓటింగ్‌తో డేంజర్ జోన్‌లో నిలిచారు. వీరిద్దరిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అవ్వడం ఖాయం. ముఖ్యంగా సీత ఎలిమినేట్ అవుతారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.


Click it and Unblock the Notifications











