సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి.. 2 సార్లు చచ్చి బతికాను.. కితకితలు హీరోయిన్
టాలీవుడ్ లో తనకంటూ మంచి గుర్తింపు దక్కించుకుంది నటి గీతా సింగ్. కితకితలు హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులను మెప్పించ కలిగింది. కమెడియన్ గా, హీరోయిన్ గా ఆమె ఈ చిత్రంలో పోషించిన పాత్ర ఇప్పటికీ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటుంది. ఇక గీతా సింగ్ 20 ఏళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమలో యాక్టివ్ గా ఉంటున్నారు. నటిగా తనకు వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ ప్రేక్షకులకు మరింతగా వినోదాన్ని పంచుతోంది. 2004లో జై సినిమాలో ముఖ్య పాత్రలో నటించి మొదటి సారిగా వెండితెరపై మెరిచింది. అప్పటి నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తూనే వస్తోంది.
ఇక బుల్లితెరపై తనదైన శైలిలో దూసుకుపోతున్న జబర్దస్త్ వర్ష ప్రస్తుతం కిస్సిక్ టాక్స్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోకు ఇప్పటికే టాలీవుడ్ నటీనటులు, బుల్లితెర సెలబ్రెటీలు హాజరవుతూనే ఉన్నారు. తమ గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలను, తమ బాధలను, తాము జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లను చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలో జబర్దస్త్ వర్ష తన కిస్సిక్ టాక్స్ షోకు తాజాగా నటి గీతా సింగ్ ను ఆహ్వానించింది. షోకు హాజరైన గీతా సింగ్ ను జబర్దస్త్ వర్ష పలు ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగింది. అందుకు గీతా సింగ్ స్పందిస్తూ తన లైఫ్ గురించి, కెరీర్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఇక గీతా సింగ్ మాట్లాడుతూ.. 'నేను ప్రస్తుతం చాలా హ్యాపీగా ఉన్నాను. నా దృష్టిలో నేను సూపర్ సెక్సీగా ఉంటాను. ఇక నేను ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. ప్రధానంగా నన్నే ఎవరూ మెచ్చలేదు. దాంతో ఇక బతకండ్రా బాబు అంటూ నేను కూడా పెళ్లి చేసుకునే ఆలోచనను వదులుకున్నాను. ఇప్పటికీ నేను పెళ్లి చేసుకొందామని రెడీగా ఉన్నా. నన్ను పెళ్లాడటానికి ఎవరూ రెడీగా లేరు. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో నా ఫేవరెట్ కమెడియన్ అలీ. ఆయనంటే చాలా ఇష్టం. టచ్ మీ.. డోంట్ టచ్ మీ అంటూ ఆయన చెప్పిన డైలాగ్ నాకు బాగా నచ్చుతుంది. ఇక అలీతో రొమాంటిక్ సీన్స్ లో నటించేందుకు కూడా నేను సిద్ధమే. కానీ ఆయన ఒప్పుకోరు కదా' అంటూ జబర్దస్త్ వర్ష ప్రశ్నలకు బదులిస్తూ వచ్చింది.
అలాగే.. వెండితెరపై ప్రస్తుతం ఎక్కువ కనిపించడం లేదు. ఆడియెన్స్ ను బాగా మిస్ అవుతున్నాను. నాకు ఆఫర్లు రాకపోవడానికి కారణం జనరేషన్ గ్యాప్ అనే అనుకుంటున్నాను. ప్రస్తుతం ఇండస్ట్రీలోకి కొత్త కొత్త డైరెక్టర్స్ వస్తున్నారు. ఇక వాళ్లు అవకాశాలు ఇవ్వడం లేదు. కాస్తా మేం ఉన్నామని కూడా గుర్తించండి. కొంతమందికి ఎలాంటి యాక్టింగ్ కూడా రాదు. అలా ఏమీ రానివాళ్లకు మీరు ఒక స్థాయిని ఇచ్చేయడం సరికాదేమో. ఇక మాకు ఇచ్చే రెమ్యునరేషన్ ఎక్కువని భావించే వాళ్లు మా స్థానంలో మరొకరని ఎక్కడి నుంచో తీసుకొచ్చుకుంటున్నారు. ఆమెకు మాత్రం ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చి మంచిగా చూసుకుంటున్నారు.
ఇక తెలుగు నటీనటులను తక్కువగా చూస్తున్నారు. నేను ఒక సినిమా చేస్తున్న సమయంలో అవమాన పడ్డాను. ఆ సినిమా షూటింగ్ సమయంలో జెన్స్ కు, లేడీస్ కు ఒకటే క్యారవాన్ పెట్టారు. అది కూడా వాష్ రూమ్ కోసమని పెట్టారు. నేను నా హెయిర్ డ్రెసర్ క్యారవాన్ లోకి వెళ్తుంటే.. ఒకరు ఉండి హే ఎవరు ఆమె జూనియర్ ఆర్టిస్ట్ క్యారవాన్ లోకి వెళ్లిందని నన్ను అవమానించింది. ఇక నెక్ట్స్ డే అల్లరి నరేశ్ సెట్ లోనే కోవై సరళితో మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు నన్ను పిలిచారు. ఎవరైతే అమానించారో ఆమె ముందు నా గురించి చెప్పడం స్టార్ట్ చేశారు.
ఈమె నా హీరోయిన్. నాకు తన వల్లనే ఇండస్ట్రీలో బ్రేక్ వచ్చిందని నరేశ్ చెప్పడంతో వాళ్లు షాక్ అయ్యారు. ఇక నాకంటూ నా జీవితంలో ఉన్నది నా కొడుకు ఒక్కడే. వాడి చదువు మొత్తం మోహన్ బాబు గారే చూసుకున్నారు. ఒక్క రూపాయి కూడా అడగలేదు. నన్ను చాలా మంది మోసం చేశారు. అప్పుడు సూసైడ్ చేసుకోవాలని అనుకున్నాను. రెండు సార్లు ఆత్మహత్యకు ప్రయత్నించాను. ఇక నన్ను మోసం చేసింది మన ఇండస్ట్రీ వాళ్లే కావడం చాలా బాధ కలిగించింది. సూసైడ్ అటెంప్ట్ చేసినప్పుడు అందరూ చనిపోయారని అనుకున్నారు. కానీ బతికి బయటపడ్డాను.


Click it and Unblock the Notifications











