Hyper Aadi: పెళ్లై పిల్లలున్న మహిళను పెళ్లాడబోతున్న హైపర్ ఆది.. ఫ్లోలో రివీల్ చేసిన జబర్దస్త్ నరేష్!
హైపర్ ఆది.. ఈ పేరు తెలియని, ఈయన పంచుల గురించి తెలియని తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ఆయన వేసేవి డబుల్ మీనింగ్ పంచులే అయినా కడుపుబ్బా నవ్వకుండా ఉండలేరు. గత పదేళ్లుగా జబర్దస్త్ షోలో కమెడియన్ గా చేస్తూ అందరినీ నవ్విస్తున్న ఈయన కెరియర్ పరంగా దూసుకు వెళ్తున్నారు. అయితే ఈయన ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. ఆయన పెళ్లిపై ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి. కానీ తొలిసారి జబర్దస్త్ నరేష్ షాకింగ్ కామెంట్లు చేశాడు. హైపర్ ఆది పెళ్లి అయి పిల్లలు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపాడు. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు చూసేద్దాం.
జబర్దస్త్ షోలో అదిరిపోయే పంచులు వేస్తూ అతి తక్కువ కాలంలోనే ట్రెండింగ్ లోకి వచ్చేశాడు హైపర్ ఆది. ముఖ్యంగా ఆయన వేసే డబుల్ మీనింగ్ డైలాగ్ ల పంచులకు సెపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉంది. బీటెక్ చేసిన ఈయన ఉద్యోగం చేయకుండా.. సినిమాలపై తనకు ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చాడు. అలా జబర్దస్త్ షోలో అవకాశం రాగా తన టాలెంట్ తో అత్యున్నత స్థాయికి చేరుకున్నాడు. కమెడియన్ స్థాయి నుంచి టీం లీడర్, యాంకర్ గా కూడా మారి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు.

ఊహించని స్థాయిలో క్రేజ్ దక్కించుకున్న ఈయన ఒక్క జబర్దస్త్ లోనే కాకుండా అనేక రకాల షోలలో కనిపిస్తూ సందడి చేస్తున్నాడు. ముఖ్యంగా శ్రీదేవి డ్రామా కంపెనీ, మరోవైపు జబర్దస్త్.. ఇంకా ఢీ జోడీ ఇవే కాకుండా అనేక ఈవెంట్లు చేసుకుంటూ తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటున్నాడు. అయితే తాజాగా ఈయన శ్రీదేవి డ్రామా కంపెనీలో అందరిపై పంచులు వేస్తూ కనిపించాడు. కానీ షాకింగ్ గా తొలిసారి ఈయనపైనే ఓ పెద్ద పంచ్ వేశాడు కమెడియన్ నరేష్. పంచ్ వేయడం మాత్రమే కాదండోయ్.. హైపర్ ఆదికి పెళ్లికి సంబంధించిన విషయాన్ని వెల్లడించాడు.
ముందుగా షోలోకి ఎంట్రీ ఇచ్చిన హైపర్ ఆది తాగుబోతు రమేష్, బల్లెట్ భాస్కర్ ల గురించి మాట్లాడుతూ.. వీరిందరిపై విపరీతమైన పంచులు వేశారు. ఆ తర్వాత అక్కడకు వచ్చిన నరేష్... ఏయ్ తమ్ముడు, ఏయ్ తమ్ముడు అంటూ హైపర్ ఆదిని పిలిచాడు. రేయ్ నేను నీకు తమ్ముడిని ఏంట్రా.. నువ్వే నా తమ్ముడివి అనగా ఓకే అన్నా... నీకు భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నావు అని అడిగాడు. దీనికి వెంటనే హైపర్ ఆది ఓ మంచి తండ్రిని కావాలనుకుంటున్నానని చెప్పాడు.

అప్పటి వరకు చక్కగా ఇదంతా విన్న నరేష్.. నువ్వు ఫాదర్ ఏంటన్నా.. స్టెప్ ఫాదర్ అవుతావు కానీ అంటూ చెప్పుకొచ్చాడు. ఇది విన్న అందరూ కడుపుబ్బా నవ్వుకోగా.. హైపర్ ఆది మాత్రం మొహం వాడ్చుకున్నాడు. నరేష్ కావాలనే ఈ పంచ్ వేసినప్పటికీ.. హైపర్ ఆది పెళ్లైన అమ్మాయిని.. అందులోనూ పిల్లలు ఉన్న అమ్మాయని పెళ్లి చేసుకోబోతున్నట్లు చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. దీంతో నెట్టింట ఈ వీడియో వైరల్ అయింది.


Click it and Unblock the Notifications











