ప్రభాస్, రానా, రాజమౌళి .... అందరిలోనూ ఉత్కంఠ, ఏం చెప్పబోతున్నారు?

ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ నిర్వహించే సెలబ్రిటీ టాక్ షో 'కాఫీ విత్ కరణ్' కార్యక్రమానికి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ షోలో తనతో మాట్లాడటానికి వచ్చే సెలబ్రిటీల నుంచి పలు ఆసక్తికర సమాధానాలు రాబట్టడంలో కరణ్ జోహార్ దిట్ట.

ఇప్పటికే విజయవంతంగా 5 సీజన్లు పూర్తి చేసుకుని ప్రస్తుతం 6వ సీజన్ రన్ అవుతున్న ఈ సెలబ్రిటీ టాక్ షోలో ముగ్గురు సర్‌ప్రైజింగ్ గెస్టులు సందడి చేయబోతున్నారు. వారు మరెవరో కాదు, బాహుబలి సినిమాతో దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన త్రి మూర్తులు... దర్శకుడు రాజమౌళి, ప్రభాస్, రానా.

మై ప్రౌడెస్ట్ కప్ ఆఫ్ కాఫీ

మై ప్రౌడెస్ట్ కప్ ఆఫ్ కాఫీ

రాజమౌళి, ప్రభాస్, రానాలతో నిన్న ఓ ఎపిసోడ్ షూట్ చేసిన కరణ్ జోహార్... ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. బాహుబలి టీమ్‌తో నేను గర్వంగా కాఫీ తాగాను అంటూ ఈ ముగ్గురితో కలిసి దిగిన ఫోటోను అభిమానులతో పంచుకున్నారు.

దేశ వ్యాప్తంగా ఉత్కంఠ

దేశ వ్యాప్తంగా ఉత్కంఠ

బాహుబలి సినిమాతో రాజమౌళి, ప్రభాస్, రానా దేశ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో స్టార్ వరల్డ్‌లో ప్రసారం కాబోయే ఈ షోలోపై భారీ అంచనాలు నెలకొన్నాయి. హిందీ ప్రేక్షకులతో పాటు తెలుగు, తమిళ అభిమానులు కూడా చూస్తారు కాబట్టి ఇది బిగ్గెస్ట్ షో అవుతుందని అంచనా వేస్తున్నారు.

 ఎలాంటి విషయాలు విప్పబోతున్నారు?

ఎలాంటి విషయాలు విప్పబోతున్నారు?

ఈ షోలో కరణ్ జోహార్ ఈ ముగ్గురిని ఎలాంటి విషయాలు అడగబోతున్నారు? వారి నుంచి ఇప్పటి వరకు ప్రేక్షకులకు తెలియని ఏయే విషయాలు రాబట్టబోతున్నారు? అనేది ఆసక్తిగా మారింది. ముఖ్యంగా రాజమౌళి నుంచి రాబట్టే అంశాలు హాట్ హాట్‌గా ఉంటాయని భావిస్తున్నారు.

ప్రభాస్, రానా పెళ్లి గురించి...

ప్రభాస్, రానా పెళ్లి గురించి...

కరణ్ జోహార్ హోస్ట్ చేస్తున్న ఈ షోలో యాక్టర్ల ప్రేమ వ్యవహారాలు, ఎఫైర్లు, పెళ్లి గురించిన అంశాలను రాబట్టే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఈ షోలో ప్రభాస్, రానా నుంచి ఎలాంటి సమాధానాలు వస్తాయో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

 రాజమౌళి నుంచి ‘ఆర్ఆర్ఆర్' విషయాలు

రాజమౌళి నుంచి ‘ఆర్ఆర్ఆర్' విషయాలు

రాజమౌళి ప్రస్తుతం రూ. 300 కోట్ల బడ్జెట్‌తో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా ‘ఆర్ఆర్ఆర్' లాంటి భారీ ప్రాజెక్ట్ చేపట్టిన నేపథ్యంలో ఆయన నుంచి కరణ్ జోహార్ ఇందుకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు రాబట్టే అవకాశం ఉంది.

 కాఫీ విత్ కరణ్

కాఫీ విత్ కరణ్

కాఫీ విత్ కరణ్ కార్యక్రమం ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు స్టార్ వరల్డ్‌లో ప్రసారం అవుతుంది. అయితే బాహుబలి టీమ్ కు సంబంధించి షో ఈ రోజు కాకుండా వచ్చే ఆదివారం ప్రసారం అయ్యే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X