Don't Miss!
- Lifestyle ఇవి తింటే మీ జుట్టు చాలా బలంగా మారుతుంది.. బట్టతల కూడా రాదు..
- News Lok Sabha Election 2024: 102 సీట్లలో తొలి దశ పోలింగ్ పూర్తి- దాదాపు 60 శాతం ఓటింగ్..!
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Sports SRH playing XI: అతనిపై వేటు..ఢిల్లీతో ఆడే తుదిజట్టు ఇదే
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
బిగ్ బాస్ షో బ్యాన్.. TRPల కోసం కంటెస్టెంట్స్ సూసైడ్ చేసుకునేలా.. గుట్టు విప్పిన హీరోయిన్
బిగ్ బాస్ షోపై సోషల్ మీడియాలో వచ్చే విమర్శలు అన్ని ఇన్ని కావు. హిందీలోనే కాకుండా సౌత్ లో కూడా షోకి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో పాటు నెగిటివ్ కామెంట్స్ అలాగే పోలీస్ కేసులు కూడా మొదలయ్యాయి. మరికొన్ని రోజుల్లో తెలుగులో బిగ్ బాస్ నాలుగవ సీజన్ మొదలు కాబోతున్న విషయం తెలిసిందే. అలాగే తమిళ్ లో కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఒక కాంట్రవర్సీ హీరోయిన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
హాట్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్
ఆ బ్యూటీ మరెవరో కాదు. బోల్డ్ హీరోయిన్ గా బిగ్ బాస్ షోతోనే క్రేజ్ అందుకున్న ఓవియా. తమిళ్ బిగ్ బాస్ షో మొదటి సీజన్ లోనే హాట్ కంటెస్టెంట్ గా అమ్మడు ఎంట్రీ ఇచ్చిన విధానం అప్పట్లో షోకి మంచి బజ్ క్రియేట్ చేసింది. అయితే ఆమెకు ఆడియెన్స్ ని మద్దతు ఏ రేంజ్ లో వచ్చిందో విమర్శలు కూడా అదే రేంజ్ లో వచ్చాయి.
బిగ్ బాస్ బ్యాన్ చేయాలా?
ఇదివరకే బిగ్ బాస్ షోపై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఓవియ ఇప్పుడు మరోసారి ఆ షోను బ్యాన్ చేయాలనే అభిప్రాయంపై తన ఫాలోవర్స్ నిర్ణయాన్ని కోరింది. దానికి మీరు అంగీకరిస్తారా లేదా అంటూ అమ్మడు తన ట్విట్టర్ లో పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది.
టార్చర్ చేస్తారా?
అదే విధంగా ఓవియ టీఆర్పీ కోసం సూసైడ్ అనే మాటను కూడా వాడటంతో సోషల్ మీడియాలో మరింత వైరల్ గా మారింది. ఒక విధంగా ఓవియ కారణంగానే మొదటి సీజన్ కి భారీ స్థాయిలో క్రేజ్ దక్కింది. ఆమె ఎదుర్కొన్న వివధాలు ఒక రేంజ్ లో చర్చకు తీశాయి. అయితే అలా చేయడానికి బ్యాక్ గ్రౌండ్ లో నిర్వాహకులు టార్చర్ చేస్తారనే విదంగా ఓవియ చెప్పడం కొత్త కాంట్రవర్సీకి దారి తీస్తోంది.
Recommended Video
సూసైడ్ చేసుకునేంత టర్చర్
టీఆర్పీల కోసం కంటెస్టెంట్స్ ను సూసైడ్ చేసుకునేంత టర్చర్ చేయకూడదని తాను కోరుకుంటున్నట్లు ఓవియ ట్వీట్ చేసిన విధానం హాట్ టాపిక్ గా మారింది. ఒక వైపు షోను బ్యాన్ చేయాలని విమర్శలు వస్తున్నప్పటికీ మరోవైపు నీకు బిగ్ బాస్ వల్లే అవకాశాలు వస్తున్నాయన్న విషయం మర్చిపోకు అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఓవియ సూసైడ్ అనే కామెంట్ ముందు ముందు ఎలాంటి వివాదాలకు దారి తీస్తుందో అనే అనుమానాలు కలుగుతున్నాయి.