పవన్ కళ్యాణ్ పై ప్రశ్న.. నీ యాబ్బ అంటూ యాంకర్ ప్రదీప్ పై నిహారిక ఫైర్

మెగా డాటర్ నిహారిక కొణిదెల ప్రస్తుతం టెలివిజన్ షోలతో ప్రేక్షకులను అలరిస్తోంది. మరోవైపు నిర్మాతగానూ ఫీల్ గుడ్ చిత్రాలను నిర్మిస్తూ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది. చివరిగా 'కమిటీ కుర్రాళ్లు' అనే చిత్రాన్ని విడుదల చేసి మంచి సక్సెస్ ను అందుకుంది. దీంతో నెక్ట్స్ మరో చిత్రాన్ని ఎప్పుడూ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే నిహారిక కొణిదెల తాజాగా సర్కారు సీజన్ 5 గేమ్ షోకు హాజరైంది. షోలో పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. నిహారిక ఆన్సర్ చేసే సమయంల్ ప్రదీప్ మాచిరాజ్ జోక్యం చేసుకోవడంతో ఫైర్ అయ్యింది. దీంతో సర్కార్ 5లోని నెక్ట్స్ ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

విజయవంతంగా సర్కార్ 5..
ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో సర్కార్ గేమ్ షో స్ట్రీమింగ్ అవుతోంది. 2021లో ప్రారంభమైన ఈ రియాలిటీ గేమ్ షోకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. సర్కార్ సీజన్ 1, సర్కార్ సీజన్ 2, సర్కార్ సీజన్ 3, సర్కార్ సీజన్ 4 వరకు స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజ్ ఈషోకు హోస్ట్ గా వ్యవహరించారు. ఇక సర్కార్ సీజన్ 5కి బుల్లితెర స్టార్, నటుడు సుడిగాలి సుధీర్ హోస్ట్ వ్యవహరిస్తుండటం విశేషం. ప్రదీప్ మాచిరాజ్ కు ధీటుగానే సుడిగాలి సుధీర్ ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ప్రతి ఎపిసోడ్ ను ఆసక్తిభరితంగా నడిపిస్తున్నారు.

Konidela Niharika fire on Anchor Pradeep machiraju

ఆసక్తికరంగా లేటెస్ట్ ఎపిసోడ్..
బుల్లితెర ప్రేక్షకులకు మంచి ఎంటర్ టైన్ మెంట్ అందిస్తున్న గేమ్ షో సర్కార్ 5. ఈ సీజన్ 5లో ఇప్పటి వరకు 8 ఎపిసోడ్ లకు గెస్ట్ లు హాజరై అలరించారు. ఇక తాజాగా 9వ ఎపిసోడ్ ప్రసారానికి సిద్ధమవుతుంది. అయితే తాజాగా ఈ షోకు సంబంధించిన లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో నిహారిక కొణిదెల యాంకర్ ప్రదీప్ మాచిరాజ్ పై ఫైర్ అయ్యింది. లేటెస్ట్ ఎపిసోడ్ ను హీరో నవదీప్, నిహారిక కొణిదెల, యంగ్ బ్యూటీ చాందిని చౌదరి, స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజ్ తో కలిసి షూట్ చేశారు. ఫన్ ఫిల్డ్, అదిరిపడే పంచులు, ఇంట్రెస్టింగ్ కన్వర్జెషన్ తో నెక్ట్స్ ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

ప్రదీప్ మాచిరాజ్ పై ఫైర్..
సర్కార్ సీజన్ 5లో హోస్ట్ గా వ్యవహరిస్తున్న సుడిగాలి సుధీర్ షోకు వచ్చిన గెస్ట్ లతో ఫుల్ ఎనర్జిటిక్ గా షోను నడిపించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలపై ఒక ఆసక్తికరమైన ప్రశ్నను అడిగారు. పవన్ కళ్యాణ్ తో ఎక్కువ సార్లు నటించిన హీరోయిన్ ఎవరంటూ సుధీర్ ప్రశ్నించాడు. దీంతో నిహారిక కొణిదెల శృతి హాసన్ పేరును చెప్పే ప్రయత్నం చేసింది.

కానీ ప్రదీప్ మాచిరాజ్ అదికాదు నీకు తెలియకపోతే నేను చెప్పానని శృతి హాసన్ పేరునే చెబుతాడు. దీంతో నిహారిక కొణిదెల మోసం చేశావని నీ యబ్బా అంటూ ప్రదీప్ మాచిరాజుపైకి దూకుతుంది. దాంతో అందరూ షాక్ అవుతున్నారు. లేటెస్ట్ ఎపిసోడ్ లో ప్రదీప్ మాచిరాజ్, సుడిగాలి సుధీర్, హీరో నవదీప్ మధ్య ఫన్ ఫుల్ కన్వర్జేషన్ జరగడం విశేషం. దీంతో పూర్తి ఎపిసోడ్ పై ఆసక్తి పెరిగింది. ఇక సర్కార్ సీజన్ 5 ఎపిసోడ్ 9 ఆగస్టు 1న రాత్రి 7 గంటలకు ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X