For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'గమ్యం' క్రిష్... డైలీ సీరియల్ ఈ రోజు నుంచే

By Srikanya
|

హైదరాబాద్ : గమ్యం, వేదం, 'కృష్ణం వందే జగద్గురుం చిత్రాల దర్శకుడు క్రిష్ ఇప్పుడో టీవీ సీరియల్ కి వర్క్ చేస్తున్నారు. ఈ సీరియల్ వినాయక చవితి నుంచి ఈటీవీలో ప్రసారం కానుంది. వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబా నిర్మాతలు. ఈ సోమవారం నుంచి ఈ ధారావాహిక ఈటీవీలో రాత్రి 8గంటలకు ప్రసారమవుతుంది. ఈ సందర్భంగా జాగర్లమూడి రాధాకృష్ణతో మీడియాముచ్చటించింది.

క్రిష్ మాట్లాడుతూ... ''తెలుగు సీరియల్స్ లో మానవతా విలువల స్థానంలో ఏడుపులు, పెడబొబ్బలు, మహిళా ప్రతినాయికల కుట్రలు, కొట్లాటలు చేరిపోయాయి. అందుకే అనువాద సీరియల్స్ వైపు కొందరు మళ్లుతున్నారు. మనసుని హత్తుకొనే కథతో వస్తే మన ధారావాహికల్ని ప్రేక్షకులు ఎప్పటికీ ఆదరిస్తారు'' అన్నారు సినీ దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్‌). ఆయన కథని అందించిన ధారావాహిక 'స్వాతి చినుకులు'. ఈటీవీ, ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ సంస్థలు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.

Krish's Swathi Chinukulu from Vinayaka Chavithi

అలాగే ...'గమ్యం' సినిమాని ఈనాడు వాళ్లు కన్నడలో 'సవారి'గా తెరకెక్కించారు. ఆ సమయంలో బాపినీడు గారికి ఓ కథ చెప్పాను. అదే 'పుత్తడి బొమ్మ'. 'కృష్ణం వందే జగద్గురుం' తర్వాత మరో కథ చెప్పాను. దానికి దృశ్యరూపమే ఈ 'స్వాతి చినుకులు'. ఓ అందమైన ప్రేమకథని సినిమాగా చేయాలనుకున్నాను. కానీ అనుకున్న విషయాన్ని చక్కగా చెప్పాలంటే ధారావాహికే సరైన మార్గం అనిపించింది. దీన్ని ఈటీవీ ద్వారా చేస్తేనే బాగుంటుందనిపించి వెంటనే అజయ్‌ శాంతి గారిని కలిశాం. దాన్ని ఆయన మరింత చక్కగా మార్చారు.

ఇక ప్రస్తుతం వస్తున్న సీరియల్స్ కు భిన్నంగా కథ ఉండాలని ఈటీవీవారు కోరడం నాకు చాలా ఆనందమేసింది. అందుకే అనుబంధాలకు విలువనిచ్చేలా దీన్ని రూపొందించాం. గోడకి ఒకవైపు ఓ సన్నివేశాన్ని తీసి, దాని వెనకే ఓ చిన్న చెట్టు పెట్టి ఏదో కొత్త ప్రాంతంలో తీసినట్లు చూపించే పద్ధతి కాదు ఈటీవీది. అందుకే ఖర్చుకి వెనుకాడకుండ యూరప్‌లోని ఇటలీ, ఆస్ట్రియా, క్రొయేషియా, బోస్నియా, వెనిస్‌, స్లొవేనియాల్లో చిత్రీకరించాం. అదే సమయంలో గోదావరి ఒడ్డున అందమైన ప్రాంతాల్లోనూ చిత్రీకరణ జరిపాం అన్నారు.

ఏవేవో పంచ్‌లు, పెద్ద పెద్ద డైలాగ్‌లు ఉండే సీరియల్‌ కాదిది. రోజూ సంభాషణల్లో కనీసం పదింటికి వీక్షకులు చప్పట్లు కొడతారనడంలో సందేహం లేదు. సాయిమాధవ్‌ అంతబాగా రాశారు. పోతన ఓంప్రకాశ్‌ కెమెరా పనితనం ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తుంది. ఈనాడు సంస్థ విలువలకు కట్టుబడి ఉన్న సంస్థ. అనువాద ధారావాహికలను నిలిపేయాలనే ఆలోచన రాగానే వాటిని ఆపేశారు. ప్రతి చినుకు ముత్యంగా మారదు. ముత్యంగా మరే చినుకుకి ఉన్న గుర్తింపు వేరు. అలా ముత్యంలా మారే కొన్ని జీవితాల మిళితమే ఈ ధారావాహిక. అందుకే దీనికి 'స్వాతి చినుకులు' అని పేరు పెట్టాం అని చెప్పుకొచ్చారు.

English summary
"Swathi Chinukulu" 1st episode on this Mon 8 PM. Don't miss the 1st episode of "Swathi Chinukulu" which was created by director Krish.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more