Krishna Mukunda Murari Climax Weekly: బయటపడ్డ సంచలన నిజాలు.. కృష్ణ ముకుంద మురారి అలా సుఖాంతం
వేరే భాషలను పోల్చి చూసుకుంటే తెలుగు బుల్లితెరపై సరికొత్త కంటెంట్‌తో చాలా రకాల సీరియళ్లు వస్తున్నాయి. అయితే, అందులో సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటే సీరియళ్లు తక్కువగానే ఉంటున్నాయి. అందులోనూ కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఒకటి. దాదాపు ఏడాది నుంచి ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతూ రంజుగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకూ పెంచేస్తోంది. ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే జూన్ 3వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఈ 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఎలా సాగిందో మీరే లుక్కేయండి!
03వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
03వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. మీరా ఆడుతున్న నాటకం మొత్తం మధు బయటపెడతాడు. అప్పుడు కృష్ణ డీఎన్ఏ టెస్టు చేయాల్సింది తనకు అని అంటుంది. అలా అయితే బిడ్డ సరోగసి ద్వారా పుడుతుందా లేదా అన్నది తేలిపోతుందని అంటుంది. తర్వాత అందరూ ఆస్పత్రికి వెళ్తారు. అప్పుడు డాక్టర్ వైదేహిని నిజం చెప్పమని కృష్ణ అడగ్గా.. అసలు ముకుంద సరోగసి అనేది తనకు తెలీదు అని చెప్తుంది. దీంతో కృష్ణ అందరి ముందు దోషిగా నిలబడుతుంది. తర్వాత భవానీ, రేవతి కూడా కృష్ణపై కోప్పడతారు. ఇక, మీరా ఇంట్లో నుంచి వెళ్లిపోతానని అంటే.. కృష్ణ వచ్చి తన బిడ్డ కోసం అడ్డుకుంటుంది.

04వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
04వ తేదీ మంగళవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. మురారి జాడ తెలుసుకునేందుకు భవానీ.. మీరా గతంలో ఉన్న ఇంటి దగ్గరకు వెళ్తుంది. అక్కడ అతడు గాయాలతో పడుకుని కనిపిస్తాడు. తర్వాత అక్కడ ఉన్న వాళ్లను మీరా గురించి ఎంక్వైరీ చేయగా వాళ్లు ఆమె చెప్పినట్లు మంచిగా చెప్తారు. తర్వాత మీరా కూడా అక్కడకు వస్తుంది. కానీ, ఆమెకు కనిపించకుండా తప్పించుకుంటుంది. అనంతరం కృష్ణ మాత్రం మురారి గురించి ఆందోళన చెందుతుంది. అప్పుడు ముకుంద తండ్రి దగ్గరకు వెళ్లాలని అనుకుంటుంది. ఇక, ముకుంద మాత్రం మురారితో కృష్ణ చంపేస్తానని వార్నింగ్ ఇచ్చి భయపెట్టాలని చూస్తుంది.
05వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
05వ తేదీ బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. జాతరకు వెళ్లిన కృష్ణ.. మీరా గురించి ఎక్వైరీ చేసి వచ్చిన తర్వాత భవానీ దేవి.. ఇంట్లో వాళ్లకు ఆమె గురించి మంచిగా చెప్తుంది. దీంతో మధు కృష్ణ మాటలు నమ్మకుండా ఆమెను వెనకేసుకుని వస్తావేంటని ప్రశ్నిస్తాడు. దీంతో భవానీ 'మురారిని అడుగుదామని అంటే ఆ క్షణం నుంచి కనిపించకుండా పోయాడు' అంటుంది. అప్పుడు రేవతి 'కానీ కృష్ణ సరోగసి చేయించాము మీరా కడుపులో ఉన్న బిడ్డ మా బిడ్డ అంటుంది కదా' అనగా.. భవానీ మాత్రం డాక్టర్ సరోగసి చేయలేదని చెప్తుంది కదా అని అంటుంది. అప్పుడు రేవతి.. మీరా డాక్టర్‌ను మ్యానేజ్ చేస్తుందేమో అని అంటుంది. ఈ పూర్తి ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

06వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
06వ తేదీ గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. అందరూ కూర్చుని భోజనం చేస్తుంటే కృష్ణ వాళ్లపై సీరియస్ అవుతుంది. మురారి కనిపించడం లేదు.. నా మాటలు ఎవరూ నమ్మడం లేదు.. ఇంట్లో అంతా గందరగోళంగా ఉంది.. మరి మీరు ఎలా ప్రశాంతంగా ఉన్నారు? అని అంటుంది. తర్వాత ఇంట్లో వాళ్లు అందరూ ఆమెను ఏదో ఒకటి అంటారు. దీంతో కృష్ణ కూడా వాళ్ల రూట్‌లోనే వెళ్లి మీరా బాగోగులు చూసినట్లు నటిస్తుంది. అంతేకాదు, ఆమెకు ట్రీట్‌మెంట్ చేస్తానని అంటుంది. దీంతో మురారి తప్పు చేసినట్లు తాను కూడా నమ్ముతానని అంటుంది. దీంతో అందరూ షాక్‌లో ఉండిపోతారు. తర్వాత మీరా గదిలో ఎముకలు విరిగితే వాడే ట్యాబ్లెట్లు ఉన్నాయని, అంటే మురారి కూడా ఆమె దగ్గరే ఉండొచ్చని మధుతో చెప్తుంది. అది కనిపెట్టడం కోసం కృష్ణ ప్లాన్ చేస్తుంది.
07వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
07వ తేదీ శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ముకుంద చెప్పిన మాటలను కృష్ణ కూడా నమ్మినట్లు నటించడంతో ఇదే విషయాన్ని మురారికి చెప్తుంది. కానీ, అతడు మాత్రం తన భార్యపై నమ్మకం ఉందని అంటాడు. అలా వాళ్లిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా.. మధును తీసుకుని కృష్ణ అక్కడకు వెళ్తుంది. వెంటనే మీరా దగ్గర బందీగా ఉన్న తన భర్తను విడిపించుకుని ఆస్పత్రికి తీసుకు వెళ్తుంది. అనంతరం భవానీ దేవి డాక్టర్ వైదేహి దగ్గరకు వెళ్లి మీరా గురించి నిజం చెప్పమని బెదిరిస్తుంది. దీంతో ఆమె మీరా ఆడుతున్న నాటకం బయటపెడుతుంది. తర్వాత కృష్ణ సంతోషంగా ఇంటికి వచ్చేస్తుంది.

08వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
08వ తేదీ శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. కళ్లు తిరిగి పడిపోయిన కృష్ణను చెక్ చేసిన పరిమళ.. ఆమె ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని చెబుతుంది. అప్పుడే భవానీ వచ్చి మీరా బండారం మొత్తం బయటపెడుతుంది. అప్పుడు ముకుంద కూడా తన తప్పును ఒప్పుకుంటుంది. నిజం తెలిసిన వెంటనే ఆదర్శ్.. కృష్ణను క్షమించమని అడుగుతాడు. అంతేకాదు, ముకుందను మారుస్తానని హామీ ఇస్తాడు. ఆ తర్వాత జరిగినది అంతా మురారికి వివరిస్తారు. కట్ చేస్తే.. కృష్ణ, ముకుంద ఒక్కో బిడ్డకు జన్మనిస్తారు. ఆ తర్వాత ముకుంద బిడ్డను కృష్ణకు ఇవ్వగా ఆమె నీ దగ్గరే ఉంచుకో అంటుంది. దీంతో కృష్ణ ముకుంద మురారి సీరియల్‌కు శుభం కార్డు పడిపోయింది. ఈ పూర్తి ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications











