Krishna Mukunda Murari Weekly: సరోగసి మదర్ గురించి తెలిసిన నిజం.. భవానీ దేవి ఊహించని నిర్ణయం
తెలుగు బుల్లితెరపై సరికొత్త కంటెంట్‌తో చాలా రకాల సీరియళ్లు వస్తున్నాయి. అయితే, అందులో సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటే సీరియళ్లు తక్కువగానే ఉంటున్నాయి. అందులోనూ కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఒకటి. దాదాపు ఏడాది నుంచి ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతూ రంజుగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకూ పెంచేస్తోంది. ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే ఏప్రిల్ 29వ తేదీ నుంచి మే 4వ తేదీ వరకు ఈ 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఎలా సాగిందో మీరే లుక్కేయండి!
29వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో:29వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. మురారి, కృష్ణ తల్లిదండ్రులు కాలేకపోతున్న బాధలో ఉంటే.. ముకుంద మాత్రం డాక్టర్ వైదేహి దగ్గర సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది. అంతేకాదు, సరోగసి ద్వారా మురారి బిడ్డకు తానే తల్లిని కావాలని ఆమెకు చెప్తుంది. ఆ తర్వాత బాధలో ఉన్న కృష్ణను మురారి ఓదార్చుతాడు. ఆ సమయంలో కృష్ణ సరోగసి ద్వారా బిడ్డకు జన్మనిద్దామని, అందుకోసం మంచి అమ్మాయిని చూద్దామని అంటుంది. దీనికి మురారి కూడా ఓకే చెప్తాడు. అది విన్న ముకుంద ఎంతో సంతోషిస్తుంది. ఆ తర్వాత వాళ్లు డాక్టర్ దగ్గరకు వెళ్లగా.. వైదేహిని సంప్రదించమని సలహా ఇస్తుంది.

30వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో:30వ తేదీ మంగళవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. మురారి, కృష్ణ తల్లిదండ్రులు కాలేకపోతున్నారని భావించిన భవానీ దేవి వాళ్ల కోసం సర్‌ప్రైజ్ పార్టీని చేయాలని ప్లాన్ చేస్తుంది. అందుకోసం హడావిడి చేస్తుండగా ఆదర్శ్‌కు నిజం తెలిసి షాక్ అవుతాడు. మరోవైపు, కృష్ణ తన సరోగసి మదర్‌ను చూపించమని డాక్టర్ వైదేహిని అడుగుతుంది. కానీ, ఆమె మాత్రం అలా వివరాలు చెప్పమని తేల్చి చెప్తుంది. అనంతరం ముకుంద డాక్టర్ దగ్గరకు వస్తుంది. అప్పుడామె కృష్ణ అడిగిన విషయం చెప్తుంది. అది తెలిసి ముకుంద సంతోషిస్తుంది. ఇక, పార్టీకి వచ్చిన వాళ్లు ఆదర్శ్‌ను అవమానిస్తూ మాట్లాడడంతో అతడికి కోపం వస్తుంది. ఈ పూర్తి ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.
01వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో:01వ తేదీ బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. కృష్ణ వాళ్లు మామిడికాయలు తీసుకుని ఇంటికి వచ్చేసరికి భవానీ దేవి సర్‌ప్రైజ్ పార్టీతో వాళ్లకు షాకిస్తుంది. అంతేకాదు, తమకు వారసుడిని ఇస్తుందని కృష్ణను ఆకాశానికి ఎత్తేస్తారు. అప్పుడు భవానీ ఫ్రెండ్స్ అందరూ కృష్ణ ప్రెగ్నెంట్ కాలేదని అంటారు. దీంతో భవానీ వాళ్లపై ఫైర్ అయిపోతోంది. అది చూసి కృష్ణ తనలో తాను కుమిలిపోతుంది. అప్పుడు మురారి వచ్చి ఆమెను ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. ఆ తర్వాత సరోగసి ప్రాసెస్ మొదలు కావడంతో ముకుంద సంతోషపడుతుంది. అనంతరం తనదైన మాటలతో కృష్ణపై ఆదర్శ్‌ను రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది.
02వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో:02వ తేదీ గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. కృష్ణ, మురారి ఇంటికి రాగానే వాళ్లకు భవానీ దేవి సర్‌ప్రైజ్ ఇస్తుంది. అక్కడ అందరి ముందే కోడలిని ఆమె పొగుడుతుంది. అంతా సవ్యంగా సాగుతున్నప్పుడే ఒక అమ్మాయి వచ్చి సరోగసి మదర్‌ను అని చెప్తుంది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగుతుంది. అప్పుడు అందరూ కృష్ణను అనుమానిస్తారు. అంతలోనే ముకుంద వెళ్లి ఆమె తప్పు అడ్రెస్‌కు వచ్చిందని కవర్ చేస్తుంది. దీంతో అసలు ఆమె ఎలా వచ్చిందని మురారి, కృష్ణకు డౌట్ వస్తుంది. అదే సమయంలో ప్రెగ్నెన్సీ విషయంలో భవానీ దేవి నమ్మకం కోల్పోతున్నందుకు కృష్ణ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఈ పూర్తి ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.
03వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో:03వ తేదీ శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. సరోగసి మదర్ అంటూ ఓ అమ్మాయి నేరుగా ఇంటికి రావడంతో మీరాపైనే మురారికి డౌట్ పెరిగిపోతుంది. అందుకే ఆమెను పిలిచి సూటిగా ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆమె ఏడుస్తూ యాక్టింగ్ షురూ చేసి నమ్మిస్తుంది. అనంతరం కృష్ణ ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తుండడంతో మురారి ఆమెకు ధైర్యం చెప్తాడు. అంతేకాదు, భవానీ దేవి కూడా ఒప్పుకుంటుందని అంటుంది. ఆ తర్వాత కృష్ణ ఇంటి పని చేయడానికి సిద్ధం అవుతుండడంతో భవానీ ఆమెపై కోప్పడుతుంది. అనంతరం మీరా వచ్చి ఏం కాదు అనడంతో భవానీ ఆమెపైన కూడా ఓ రేంజ్‌లో సీరియస్ అవుతుంది. ఈ పూర్తి ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

04వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో:04వ తేదీ శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ముకుందకు కొత్త బట్టలు కొనేందుకు ఆదర్శ్ ఆమెను షాపింగ్‌కు తీసుకెళ్తా అంటాడు. దీంతో ఆమె అతడికి పడిపోతుంది. కానీ, ఈ జీవితం మాత్రం మురారికే సొంతం అనుకుంటుంది. తర్వాత భవానీ వచ్చి.. ఆదర్శ్ - ముకుందకు పెళ్లి చేద్దామని కృష్ణతో అంటుంది. అనంతరం కృష్ణ ఆస్పత్రికి వెళ్లాలని అనుకుంటే భవానీ దేవి కూడా వస్తానని అంటుంది. కానీ, మురారి ఏవో మాటలు చెప్పి ఆమెను ఆపుతాడు. అనంతరం వీళ్లు వైదేహి దగ్గరకు వెళ్తారు. అక్కడ సరోగసి మదర్ ఎవరో చెప్పమని బ్రతిమాలతారు. కానీ, డాక్టర్ మాత్రం ఆమె వివరాలు బయటకు చెప్పలేనని అంటుంది. ఈ పూర్తి ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.
ఈ వారంలో హైలైట్ అయింది ఇదే:ఏప్రిల్ 29వ తేదీ నుంచి మే 4వ వరకు సాగిన 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలతో సాగింది. ముఖ్యంగా ఈ వారంలో కృష్ణ సరోగసి ద్వారా తల్లి కావాలని ప్లాన్ చేస్తుంది. కానీ, ఈ విషయం భవానీ దేవికి తెలియకుండా జాగ్రత్త పడాలని ప్లాన్ చేస్తుంది. అయితే, ముకుంద మాత్రం ఈ విషయంలో పైచేయి సాధించినట్లు చూపించారు. ఇక, వచ్చే వారంలో సరోగసి మదర్ ముకుందనే అనే నిజం మురారి వాళ్లకు తెలిసినట్లు చూపించారు. దీంతో ఈ సీరియల్ మరింత రసవత్తరంగా మారిపోయింది.


Click it and Unblock the Notifications











