Krishna Mukunda Murari Weekly Roundup: దొరికిపోయిన దోషి.. ఆమెతోనే మురారి పెళ్లి.. కథలో ఊహించని మలుపు

సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై సరికొత్త కంటెంట్‌తో చాలా రకాల సీరియళ్లు వస్తున్నాయి. అయితే, అందులో సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటే సీరియళ్లు తక్కువగానే ఉంటున్నాయి. అందులోనూ కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఒకటి. తమిళ నటి కస్తూరి ప్రధాన పాత్రలో ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతూ రసవత్తరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకూ పెంచేస్తోంది. ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే డిసెంబర్ 25వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈ 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఎలా సాగిందో మీరే చూడండి!

25వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
25వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. మురారి, కృష్ణను వేరు చేయడం కోసం రంగంలోకి వచ్చిన దేవ్.. తన మాటలతో వాళ్లను పడేసే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ముకుంద కోసం ఆలోచించే వాడైతే ఆదర్శ్‌ను వెతుకుతాడుగా అని మురారికి డౌట్ వస్తుంది. దేవ్ ఇంటికి వచ్చినందుకు ఇబ్బంది పడుతుండడంతో భవానీ అతడిపై ఫైర్ అవుతుంది. నువ్వు ఎప్పుడైనా రావొచ్చని అరుస్తుంది. ఆ తర్వాత భవానీ.. కృష్ణను అవమానించి మాట్లాడగా.. దేవ్ ఆమెకు సపోర్ట్ చేస్తాడు. దీంతో ముకుంద అతడిపై సీరియస్ అవగా.. అందతా ప్లాన్ అని సర్ధి చెప్తాడు.

 Krishna Mukunda Murari Latest Week roundup story: December 25th to 30th Episodes highlights

26వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
26వ తేదీ మంగళవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. భవానీ అన్న మాటలను గుర్తు చేసుకుని బాధ పడుతున్న కృష్ణను మురారి ఓదార్చే ప్రయత్నం చేయగా.. అతడినే కూల్‌గా ఉండమని అంటుంది. ఉదయాన్నే తన దగ్గరకు వచ్చిన ముకుందపై మురారి ఫైర్ అవుతాడు. కృష్ణే తన భార్య అని ఆమెకు తేల్చి చెప్తాడు. అప్పుడు కృష్ణ వల్లే నువ్వు ఇలా అయ్యావని ముకుంద అబద్దాలు చెప్పగా అతడు సీరియస్ అవుతాడు. అనంతరం కృష్ణతో మనం వేరు కాపురం పెడదామని అనగా ఆమె వద్దంటుంది. తర్వాత భవానీకి విషయం తెలిసి రేవతిపై అరుస్తుంది.

27వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
27వ తేదీ బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. కృష్ణతో ఇంట్లో వాళ్లు మామూలుగానే ఉంటుండడం చూసి భవానీ దేవికి కోపం వస్తుంది. ఆ సమయంలో మురారి ఆమెను ఎదురించి మాట్లాడుతాడు. దీంతో శుక్రవారం కేసు తేలిపోతే ముకుందను పెళ్లి చేసుకోవాలన్న విషయాన్ని గుర్తు చేస్తారు. దీనికి మురారి కేసును ఎలాగైనా తేల్చి కృష్ణనే పెళ్లి చేసుకుంటానని తేల్చి చెప్పేస్తాడు. ఈ పరిణామాలతో ఇంట్లో రెండు వర్గాలు అవుతాయి. ముఖ్యంగా కృష్ణనే ఇష్టపడుతున్న మురారి కోసం ఎందుకు పరితపిస్తున్నావు అని దేవ్.. ముకుందను అడుగుతాడు. కానీ, ఆమె మాత్రం మురారి తనకే కావాలని అంటుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

28వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
28వ తేదీ గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. కృష్ణకు కాలు బెణకడంతో ఆమెను మురారి ఎత్తుకుని వచ్చి సపర్యలు చేస్తుంటాడు. అది చూసి భవానీ దేవికి కోపం వస్తుంది. అప్పుడే ముకుంద కూడా ఆమెను రెచ్చగొడుతుంది. అప్పుడు మురారి దోషిని కనిపెట్టి మురారిని ఈ ఇంటికి శాశ్వతంగా తీసుకొస్తా అంటాడు. ఇందుకోసం పరిమళ సాయంతో స్కెచ్ ఆర్టిస్టుతో బొమ్మ గీయించాలని అనుకుంటాడు. అప్పుడు ముకుందలో టెన్షన్ పెరుగుతుంది. కానీ, పరిమళకు కనపడకుండా దేవ్ జాగ్రత్త పడతాడు. వీళ్ల ప్రవర్తన చూసి మధుకర్‌కు సందేహం వచ్చి కృష్ణకు చెప్పగా.. ఆమె మాత్రం దేవ్ మంచోడని అంటుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

 Krishna Mukunda Murari Latest Week roundup story: December 25th to 30th Episodes highlights

29వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
29వ తేదీ శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. కృష్ణ కాలుకు మురారి మసాజ్ చేసుకుంటూ ఆమెతో ప్రేమగా మాట్లాడతాడు. దీంతో ఆమె ఎంతగానో సంతోషిస్తుంది. అదే సమయంలో ముకుంద కోసం ఆదర్శ్‌ను ఇంటికి తీసుకు వస్తానని మురారి హామీ ఇస్తాడు. ముకుంద, దేవ్ మధ్య తండ్రి గురించి చర్చ వస్తుంది. అప్పుడు అతడను నాన్నను తిడతాడు. అదే సమయంలో ఎలాగైనా కేసు నుంచి తప్పించుకోవాలని వాళ్లిద్దరూ ప్లాన్ చేసుకుంటారు. అనంతరం ముకుంద చేసిన సహాయం గురించి భవానీ దేవి.. మురారికి చెప్తుంది. దీంతో అతడు కేసు తేలిన తర్వాత సరైన నిర్ణయం తీసుకుంటానని హామీ ఇస్తాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

30వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
30వ తేదీ శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. కృష్ణను నమ్మించేందుకు దేవ్ ప్రయత్నాలు సాగిస్తాడు. దోషి ఎవరో తెలిస్తే చంపేస్తానని అంటాడు. అప్పుడు కృష్ణ వాళ్లు అది ఎవరో తెలిస్తే మురారి వదిలిపెట్టడని అంటారు. దీంతో అతడికి భయం వేస్తుంది. ఇక, మురారితో ముకుంద వాదనకు దిగగా.. కేసు తేల్చేసి కృష్ణను పెళ్లి చేసుకుంటానని చెప్తాడు. ఆమెనేమో తనను మోసం చేశావని నిందిస్తుంది. అప్పుడు అన్నీ తెలిసే ఆదర్శ్‌ను పెళ్లి చేసుకున్నావని మురారి అంటాడు. అనంతరం కృష్ణ గురించి భవానీతో మురారి మాట్లాడతాడు. కేసు సాల్వ్ అయిన తర్వాత మాట మీద నిలబడతానని హామీ ఇచ్చేస్తాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

ఈ వారంలో హైలైట్ అయింది ఇదే
డిసెంబర్ 25వ తేదీ నుంచి 30వ వరకు సాగిన 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలతో సాగింది. ఈ వారంలో కృష్ణ, మురారిని నమ్మించేందుకు దేవ్‌ను రంగంలోకి దింపగా.. అతడే బుక్కయ్యే పరిస్థితులు వచ్చాయి. పరిమళ, స్కెచ్ ఆర్టిస్టు సహాయంతో దోషిని పట్టుకోవాలని మురారి ప్రయత్నాలు ముమ్మరం చేయగా.. ముకుంద మాత్రం తప్పించుకోడానికి ట్రై చేస్తుంది. ఇలా ఈ వారం అంతా ఎన్నో మలుపులతో సాగింది. వచ్చే వారంలో మాత్రం స్కెచ్ ఆర్టిస్టు బొమ్మ గీయడంతో మరింత రంజుగా మారబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X