Krishna Mukunda Murari Weekly: ముకుంద ఊహించని నిర్ణయం.. మళ్లీ వచ్చిన దేవ్.. చంపాలని ప్లాన్ చేయడంతో!
తెలుగు బుల్లితెరపై సరికొత్త కంటెంట్‌తో చాలా రకాల సీరియళ్లు వస్తున్నాయి. అయితే, అందులో సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటే సీరియళ్లు తక్కువగానే ఉంటున్నాయి. అందులోనూ కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఒకటి. దాదాపు ఏడాది నుంచి ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతూ రంజుగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకూ పెంచేస్తోంది. ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే ఫిబ్రవరి 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఈ 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఎలా సాగిందో మీరే లుక్కేయండి!
12వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో:12వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. వాలెంటైన్స్ డే కోసం సర్‌ప్రైజ్ ప్లాన్ చేశామని కృష్ణ చెప్పడంతో ఇంట్లో వాళ్లంతా ఆలోచనలో పడతారు. కానీ, ముకుంద మాత్రం తనకు ఏదైనా పరీక్ష పెడతారేమో అని భయపడుతుంటుంది. దీంతో కృష్ణ ఫస్ట్ ప్రైజ్ మీకే వస్తుందని ముకుందతో అనగా.. రేవతి ఆమెపై సీరియస్ అవుతుంది. ఇక, ఆదర్శ్ మాటలకు ముకుంద ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది. తర్వాత మురారి తొడిగిన ఉంగరాన్ని కృష్ణ ఎక్కడో పడేస్తుంది. అది జరగడంతో ఆమె భయంతో ఏడుస్తుంది. దీంతో అందరూ కృష్ణను ఓదార్చుతూ ఉంటారు. ఈ పూర్తి ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

13వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో:13వ తేదీ మంగళవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. మురారితో తీసుకున్న ఫొటో, ఆదర్శ్ ముఖం మడతపెట్టి ఉన్న ఫొటోలు ముకుంద కబోర్డులో ఉంటాయి. వాటిని ఆదర్శ్ చూసి ఆమెపై అనుమానపడతాడు. తర్వాత మురారి, కృష్ణ డెకరేషన్ చేస్తుంటారు. అప్పుడు తన ఉంగరం పోవడం గుర్తు చేసుకుని కృష్ణ బాధ పడగా మురారి ఓదార్చుతాడు. తర్వాత ఆమెకు మురారి ప్రపోజ్ చేస్తాడు. ఫొటో దిగడానికి జంటలను రమ్మంటే ముకుంద వద్దంటుంది. దీంతో మధు రెచ్చగొట్టగా ఒప్పుకుంటుంది. కానీ, ఆదర్శ్ కనిపించకపోవడంతో ఫొటోలు చూశాడేమో అనుకుంటుంది. మధు వెళ్లి ఆదర్శ్‌ను ప్రశ్నించగా కోప్పడతాడు.
14వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో:14వ తేదీ బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. వాలెంటైన్స్ డే కాంపిటీషన్ మొదలైన తర్వాత సర్‌ప్రైజ్ ఏంటా అని అంతా ఆసక్తిగా చూస్తారు. అప్పుడు మురారి, కృష్ణ అదేంటో మధు చెప్తాడని ట్విస్ట్ ఇస్తారు. అనంతరం మధు వచ్చి తనకు నచ్చినట్లు ఆటలు ఆడిస్తాడు. ముకుంద నిజస్వరూపం బయటపెట్టాలన్న ఉద్దేశ్యంతో టాస్కులు ఇస్తాడు. కానీ, ఆమె మాత్రం ఆదర్శ్‌ను మురారిగా ఊహించుకుని అన్నీ పూర్తి చేస్తుంది. ఆ తర్వాత కృష్ణ, మురారి కూడా సక్సెస్‌ఫుల్‌గా టాస్కులు కంప్లీట్ చేసుకుంటారు. ఎవరు గెలిచారో చెప్పే బాధ్యత భవానీదే అని అంటారు. కానీ, ఆమె మాత్రం ఇంట్లో కనిపించదు. ఈ పూర్తి ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.
15వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో:15వ తేదీ గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. వాలెంటైన్స్ డే కాంపిటీషన్‌లో ఎవరు గెలిచారన్న దానిపై ఉత్కంఠ ఉన్నప్పుడు భవానీ వచ్చి.. కృష్ణ, మురారి విజయం సాధించారని చెప్తుంది. అంతేకాదు, వాళ్లకు ఓ గిఫ్టును కూడా ఇస్తుంది. అనంతరం తాను అమెరికాకు వెళ్లిపోతున్నట్లు ఇంట్లో వాళ్లకు చెప్తుంది. అంతేకాదు, అందరికీ కొన్ని గుడ్ న్యూస్‌లు చెప్తుంది. కానీ, ముకుందకు చెప్పకపోవడంతో ఆమె నిరాశ చెందుతుంది. తర్వాత కృష్ణ వాళ్లు తమకు ప్రైజ్ ఇవ్వడంపై నిరాశగా ఉండగా రేవతి వచ్చి సర్ధి చెప్తుంది. ఇక, ముకుందతో కశ్మీర్‌కు వెళ్లిపోదాం అని ఆదర్శ్ అనడంతో ఆమె మాత్రం ఒప్పుకోదు. ఈ పూర్తి ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

16వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో:16వ తేదీ శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ముకుందను కశ్మీర్ వెళ్లిపోదాం అని ఆదర్శ్ అడుగుతాడు. కానీ, ఆమె మాత్రం మురారికి దూరం అవుతానన్న ఉద్దేశ్యంతో వద్దని అంటుంది. కానీ, ఆదర్శ్ ఆమెపై ప్రేమను వ్యక్త పరుస్తూ ఉండడంతో ఎలాగైనా నిజం చెప్పాలని నిర్ణయించుకుంటుంది. ఆ తర్వాత భవానీ దేవి ఇచ్చిన గిఫ్టును, ఆమె రాసిన లెటర్‌ను చూసి కృష్ణ మురిసిపోతుంది. అయితే, అది తనకు మాత్రమే కాదని, ముకుందకు కూడా అని కృష్ణ అనడంతో రేవతి ఆమెపై సీరియస్ అవుతుంది. కానీ, ముకుంద మాత్రం ఆ లెటర్‌ను కృష్ణ కోసమే రాసిందని చెప్పి తప్పించుకుంటుంది. ఈ పూర్తి ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.
17వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో:17వ తేదీ శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. మురారి ఫొటోను చూసుకుంటూ ముకుంద ఆలోచిస్తుంటుంది. అలాగే, ఆదర్శ్‌కు ఎలాగైనా నిజాన్ని చెప్పేయాలని అనుకుంటుంది. అంతలోనే ఆదర్శ్ రావడంతో ఆ ఫొటోలను దాచేస్తుంది. అప్పుడు అతడు బ్యాగ్ చెక్ చేయబోతుంటే అడ్డుకుంటుంది. ఆ తర్వాత కృష్ణ, ముకుంద వాళ్లు జంటలుగా బయటకు వెళ్తారు. అప్పుడు ముకుంద.. ఆదర్శ్ పక్కన కూర్చోడానికి ఇబ్బంది పడి ముందు సీటులోకి వెళ్లిపోతారు. దీంతో మురారి వాళ్లు వెనక్కి వచ్చి రొమాన్స్ చేస్తుంటారు. వాళ్లను అలా చూసి ముకుంద అసూయ పడుతూ ఉంటుంది. తర్వాత మురారి తలనొప్పి డ్రామా ఆడతాడు. ఈ పూర్తి ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

ఈ వారంలో హైలైట్ అయింది ఇదే:ఫిబ్రవరి 12వ తేదీ నుంచి 17వ వరకు సాగిన 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలతో సాగింది. ముఖ్యంగా ఈ వారంలో వాలెంటైన్స్ డే కాంపిటీషన్ జరుగుతుంది. ఇందులో కృష్ణ వాళ్లు గెలవడం.. తర్వాత భవానీ దేవి ఇంట్లో నుంచి వెళ్లిపోవడం.. ఆదర్శ్‌కు ముకుంద నిజం చెప్పాలని డిసైడ్ అవడం చూపించారు. దీంతో ఈ వారం అంతా ఎన్నో మలుపులు తిరిగింది. ఇక, వచ్చే వారంలో దేవ్ తిరిగి రావడంతో పాటు ముకుందకు అడ్డు తొలగించాలని ప్లాన్ చేయడం చూపిస్తారు. దీంతో ఈ సీరియల్ మరింత రంజుగా మారనుంది.


Click it and Unblock the Notifications











