Krishna Mukunda Murari Weekly: అడ్డంగా దొరికిన ముకుంద.. మురారికి తెలిసిన నిజం.. కథలో ఫుల్ ట్విస్టులు

వేరే భాషల కంటే తెలుగు బుల్లితెరపై సరికొత్త కంటెంట్‌తో చాలా రకాల సీరియళ్లు వస్తున్నాయి. అయితే, అందులో సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటే సీరియళ్లు తక్కువగానే ఉంటున్నాయి. అందులోనూ కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఒకటి. దాదాపు ఏడాది నుంచి ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతూ రంజుగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకూ పెంచేస్తోంది. ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే ఫిబ్రవరి 19వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఈ 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఎలా సాగిందో మీరే లుక్కేయండి!

19వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
19వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ఎవరికీ తెలియకుండా కృష్ణ.. ముకుంద పేరు మీద రిసార్టులో రూమ్స్ బుక్ చేస్తుంది. కానీ, అవి ఎవరు చేశారో తెలియక ఆమె టెన్షన్ పడుతుంది. అప్పుడే దేవ్.. ముకుందకు ఫోన్ చేస్తాడు. కృష్ణే వాటిని బుక్ చేసిందని చెప్తాడు. అంతేకాదు, ఆమెను చంపడానికి ప్లాన్ చేస్తానని అంటాడు. కానీ, ముకుంద మాత్రం వద్దని చెప్తుంది. ఇక, రేవతి దగ్గర మధుకర్.. ముకుంద మారలేదని, ట్రిప్ నుంచి వచ్చే సరికి ఓ విషయం తెలుస్తుంది అంటాడు. దీంతో ఆమె భయపడుతుంది. అప్పుడు మధుతో చెప్పి బాధపడగా.. అతడు ముకుంద తప్పు చేస్తే ఆమెను చంపేస్తానని చెబుతాడు. ఈ పూర్తి ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

Krishna Mukunda Murari Latest Week roundup story: February 19th to 24th Episodes highlights

20వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
20వ తేదీ మంగళవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ఆదర్శ్‌కు ఎలాగైనా నిజాన్ని చెప్పేయాలని ఫిక్సైన ముకుంద.. ఫుల్లుగా మందు తాగేస్తుంది. ఆ తర్వాత అతడికి నిజాలు చెప్తుంది. కానీ, ఆదర్శ్ మాత్రం చెవిలో ఇయర్ ఫోన్స్ ఉండడంతో ఆ మాటలను వినలేకపోతాడు. అది తెలిసి ముకుంద ఫీల్ అవుతుంది. ఆ తర్వాత హోటల్ రూమ్‌లో శోభనం ఏర్పాట్లు చేసి ఉంటాయి. అది చూసి ఆదర్శ్ సంతోష పడుతూ ముకుందపై ప్రేమను వ్యక్తం చేస్తుంటాడు. కానీ, ఆమె మాత్రం బయటకు వెళ్లిపోతుంది. అనంతరం కృష్ణ వాళ్లు కూడా శోభనం ఏర్పాట్లు చేసుకుంటారు. కానీ, వాళ్ల రూమ్‌కు వెళ్లి చూసి షాక్ అవుతారు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

21వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
21వ తేదీ బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. శోభనం తప్పించుకునే ప్లాన్లు చేస్తున్న ముకుంద.. మురారిపై తన ప్రేమ స్వచ్చమైనది అని అనుకుంటుంది. తర్వాత ఆమె కోసం మురారి వాళ్లు అందరూ రావడంతో కాలుకు దెబ్బ తగిలినట్లు నటిస్తుంది. అనంతరం కృష్ణను కిడ్నాప్ చేయడానికి దేవ్ ప్లాన్ చేసి రౌడీలను పంపుతాడు. కానీ, వాళ్లను ఆమె చూడడంతో పారిపోతారు. మరోవైపు, మధుకర్ అన్న మాటలను తలుచుకుని రేవతి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక, కాలుకు దెబ్బ తగిలిందని నటిస్తున్న ముకుందపై మురారి జాలి పడతాడు. కానీ, కృష్ణకు మాత్రం ఆమెపై అనుమానం వస్తుంది. దీంతో ముకుంద నిజస్వరూపం బయటపెట్టాలని డిసైడ్ అయిపోతుంది.

22వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
22వ తేదీ గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. కారులో వెళ్తుండగా ముకుందను టెస్ట్ చేయాలని కృష్ణ అనుకుంటుంది. అందుకు తగ్గట్లుగానే ఆదర్శ్ భుజం మీద పడుకోమని చెప్తుంది. మరోవైపు, ఆదర్శ్ విషయంలో ముకుంద తప్పు చేస్తుందని మధు, రేవతి మాట్లాడుకుంటారు. కృష్ణ మాత్రం ముకుంద ప్రవర్తన గురించి అయోమయానికి గురి అవుతుంటుంది. అదే సమయంలో అనుమానాలను వ్యక్తం చేస్తుంది. తర్వాత ఆదర్శ్‌తో మాట్లాడుతూ ముకుందకు కాలు నొప్పి లేదని నోరు జారి తర్వాత కవర్ చేస్తుంది. ఇక, ఇంటికి వచ్చిన తర్వాత ముకుంద, ఆదర్శ్‌కు శోభనం జరిపించాలని కృష్ణ ఏర్పాట్లు చేస్తుంది. ఈ పూర్తి ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

Krishna Mukunda Murari Latest Week roundup story: February 19th to 24th Episodes highlights

23వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
23వ తేదీ శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ఆదర్శ్‌తో శోభనం జరిపించాలని ప్లాన్ చేయడంపై ముకుంద అనుమానాలు వ్యక్తం చేస్తుంది. అంతేకాదు, అతడికి నిజం చెప్పాలని మరోసారి అనుకుంటుంది. కానీ, ఆదర్శ్ మాత్రం ఆమెపై ప్రేమను చూపిస్తూ మాట్లాడుతుంటాడు. భవానీ దేవికి ముకుందపై డౌట్ ఉన్న విషయాన్ని రేవతి.. కృష్ణతో చెబుతుంది. దీంతో ముకుందను టెస్ట్ చేసేందుకు కృష్ణ ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగానే ముందుగా పంతులుతో మాట్లాడి ఆదర్శ్, ముకుందకు శోభనం ముహూర్తం పెట్టిస్తుంది. అదే సమయంలో తమ శోభనం ముహూర్తం లేదని కూడా చెప్పిస్తుంది. ఈ పూర్తి ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

24వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
24వ తేదీ శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. శోభనం ముహూర్తం లేకపోవడంతో మురారి నిరాశగా ఉంటూ కృష్ణపై సీరియస్ అవుతుంటాడు. దీంతో ఆమె అతడికి సర్ధి చెప్పి కూల్ చేస్తుంది. ఇక, ముకుంద మాత్రం ఎలాగైనా శోభనం ఆపేందుకు భవానీకి నిజం చెప్పాలని అనుకుంటుంది. అది కుదరకపోవడంతో మురారితోనైనా చెప్పాలని నిర్ణయించుకుంటుంది. మధుకర్ తీసిన ముకుంద ఫొటోలను రేవతికి చూపించి అనుమానాలు నిజమే అని చెప్తాడు. ఇక, ముకుంద ఫోన్‌లో 'నా మొగుడు' అని ఉన్న కాంటాక్ట్ నెంబర్ మురారిదే అని కృష్ణకు తెలిసిపోతుంది. ఈ పూర్తి ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

ఈ వారంలో హైలైట్ అయింది ఇదే
ఫిబ్రవరి 19వ తేదీ నుంచి 24వ వరకు సాగిన 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలతో సాగింది. ముఖ్యంగా ఈ వారంలో ఆదర్శ్, ముకుందకు ఫస్ట్ నైట్ జరిపేందుకు కృష్ణ ప్లాన్ చేయడం.. ఆ ప్రయత్నాలను ముకుంద తెలివిగా తిప్పికొట్టడం హైలైట్ చేశారు. మరోవైపు ముకుంద అడ్డు తొలగించేందుకు దేవ్ రంగంలోకి దిగడాన్ని కూడా చూపించారు. మొత్తానికి కృష్ణకు ముకుందపై అనుమానం రావడంతో ఈ వారం ఎపిసోడ్స్ రంజుగా సాగాయి. ఇక, వచ్చే వారంలో మురారికి ముకుంద నిజం చెప్పేస్తుంది. దీంతో ఇది మరింత రసవత్తరంగా సాగబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X