Krishna Mukunda Murari Weekly: ముకుందకు ఎదురుదెబ్బ.. ఇష్టం లేకున్నా ఆదర్శ్‌తోనే.. కృష్ణ సూపర్ ప్లాన్

తెలుగు బుల్లితెరపై సరికొత్త కంటెంట్‌తో చాలా రకాల సీరియళ్లు వస్తున్నాయి. అయితే, అందులో సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటే సీరియళ్లు తక్కువగానే ఉంటున్నాయి. అందులోనూ కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఒకటి. దాదాపు ఏడాది నుంచి ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతూ రంజుగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకూ పెంచేస్తోంది. ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే ఫిబ్రవరి 26వ తేదీ నుంచి మార్చి 2వ తేదీ వరకు ఈ 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఎలా సాగిందో మీరే లుక్కేయండి!

26వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
26వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ముకుంద ఫోన్‌లో మురారి పేరే నా మొగుడు ఉందేమో అనుకుని టెస్ట్ చేయడానికి కృష్ణ వస్తుంది. ఆమెకు మస్కా కొట్టి ఫోన్ చెక్ చేస్తుంది. అప్పటికే ఇది గ్రహించిన ముకుంద.. ఆ పేరును మార్చేస్తుంది. అనంతరం భర్త దగ్గరకు వెళ్లి కృష్ణ నిలదీయగా.. నాకు ముకుంద అంటేనే ఇష్టం అంటూ సరదాగా ఏడిపిస్తాడు. ఆ తర్వాత మురారిని కలిసిన ముకుంద.. ఆదర్శ్ అంటే తనకు ఇష్టం లేదన్న నిజాన్ని చెప్పేస్తుంది. అంతేకాదు, అతడిని పంపించకపోతే చచ్చిపోతాను అంటూ బెదిరిస్తుంది. ఈ పూర్తి ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

Krishna Mukunda Murari Latest Week roundup story February 26th to March 2nd Episodes highlights

27వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
27వ తేదీ మంగళవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. మురారికి నిజం చెప్పేసిన తర్వాత ముకుంద సంతోషంగా ఇంటికి వస్తుంది. ఆమెను చూసి కాలు నొప్పి తగ్గిపోయిందని కృష్ణ సంతోషిస్తుంది. మురారి మాత్రం ముకుంద ఇచ్చిన షాక్‌తో అయోమయంలో ఉండిపోతాడు. ఏం చేయాలో తెలియక ఆలోచనలో పడిపోతాడు. కృష్ణ కాఫీని తీసుకొచ్చి ఆదర్శ్‌కు ఇవ్వగా దాన్ని ముకుందతో కలిసి షేర్ చేసుకుంటాడు. ఇక, రేవతి.. మధు మాటలను గుర్తు చేసుకుని డైలమాలో ఉంటుంది. ముకుంద మనసు మార్చి ఆదర్శ్‌తో కలిపాలని మురారి ప్లాన్ చేస్తాడు. ఆదర్శ్ మాత్రం శోభనం కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తుంటాడు.

28వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
28వ తేదీ బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ముకుంద ఇచ్చిన షాక్‌తో మురారి ఆమె గురించే ఆలోచిస్తూ ఉంటాడు. అంతలోనే కృష్ణ వచ్చి మాట్లాడబోగా ఆమెపై సీరియస్ అవుతాడు. తర్వాత బుజ్జగిస్తూ తనకు నచ్చిన ఉల్లి దోశ చేయమంటాడు. అంతకు ముందే కృష్ణ వంట బాధ్యతను ముకుందకు అప్పగిస్తుంది. మురారి కోసం ఆమె దోశ చేస్తే ముకుంద మారలేదు అనుకుంటుంది. అంతలోనే మురారి.. ముకుంద దగ్గరకు వెళ్లి దోశ వేయకుండా చేయాలని అనుకుంటాడు. కానీ, ముకుంద మాత్రం అతడిపై ప్రేమను వ్యక్త పరుస్తూ మాట్లాడుతుంది. దీంతో మురారి ఆమెను కొట్టేందుకు చేయి లేపుతాడు. ఈ పూర్తి ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

29వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
29వ తేదీ గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. తన దగ్గరకు వచ్చిన మురారితో ముకుంద ఎలాగైనా ఆదర్శ్‌ను పంపించేయమని చెబుతుంది. కృష్ణకు నిజం తెలిస్తే వెళ్లిపోతుందని, అప్పుడు మనిద్దరం సంతోషంగా ఉందామని కూడా ముకుంద.. మురారితో అంటుంది. ఇదంతా కృష్ణ పక్కనుంచి వింటుంది. తర్వాత మురారి వెళ్లి తన ఫ్రెండ్‌తో చెప్పుకుని బాధ పడతాడు. అనంతరం కృష్ణ అతడిని కలిసి తనకు నిజం తెలిసిపోయిందని, ధైర్యంగా ఉండమని చెబుతుంది. ఇక, ఆదర్శ్ విషయంలో ముకుంద ప్రవర్తిస్తున్న తీరుపై మధు డౌట్ పడుతుంటాడు. అదే మాటను ఆదర్శ్‌కు కూడా చెబుతాడు. ఈ పూర్తి ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

Krishna Mukunda Murari Latest Week roundup story February 26th to March 2nd Episodes highlights

01వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
01వ తేదీ శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ముకుంద గురించి నిజం తెలుసుకున్న తర్వాత కృష్ణ వాళ్ల శోభనం ఎలాగైనా ఆపాలని నిర్ణయించుకుంటుంది. ఆ వెంటనే మురారికి ఓ ప్లాన్‌ను చెబుతుంది. ఆ తర్వాత వాళ్లు ఇంటికి వెళ్లి పంతులు దగ్గరకు వెళ్లామని చెబుతారు. అంతేకాదు, ఆదర్శ్ వాళ్లతో పాటు తమకు కూడా శోభనం ముహూర్తం పెట్టారని చెప్పడంతో ముకుంద షాక్ అవుతుంది. అనంతరం వాళ్లను ప్రశ్నించగా గ్రహచారం ప్రకారమే ముహూర్తం పెట్టారని చెబుతుంది. ఇక, శోభనం ఆగిపోయినా ధైర్యంగా ఉండేలా ఆదర్శ్‌ను మోటివేట్ చేయాలని కృష్ణ, మురారి డిసైడ్ అవుతారు. ఈ పూర్తి ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

02వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
02వ తేదీ శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ఆదర్శ్ విషయంలో ముకుందకు సర్ధి చెప్పేందుకు మురారి ప్రయత్నిస్తాడు. కానీ, ఆమె మాత్రం అతడి మాటలను అస్సలు పట్టించుకోదు. పైగా ఆదర్శ్‌ను పంపకపోతే అందరికీ నిజం చెప్పేస్తానని బెదిరిస్తుంది. దీంతో మురారి ఆమెకు ఎదురు తిరుగుతాడు. దీంతో దేవుడే కాపాడతాడని అంటుంది. అప్పుడు మురారి.. దేవ్ గురించి ప్రస్తావించి ముకుందకు షాకిస్తాడు. అనంతరం రేవతి అందరినీ తీసుకుని దేవుడి గుడికి వెళ్తుంది. అక్కడ పంతులు భార్యభర్తలకు ఒక టాస్క్ ఇస్తాడు. దీంతో ముకుందకు మరో ఎదురుదెబ్బ తగులుతుంది. ఈ పూర్తి ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

ఈ వారంలో హైలైట్ అయింది ఇదే
ఫిబ్రవరి 26వ తేదీ నుంచి మార్చి 2వ వరకు సాగిన 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలతో సాగింది. ముఖ్యంగా ఈ వారంలో మురారికి నిజం చెప్పిన ముకుంద.. శోభనం ఆపడంతో పాటు ఆదర్శ్‌ను పంపించేయాలని డిమాండ్ చేయడాన్ని హైలైట్ చేశారు. కానీ, అంతలోనే కృష్ణకు నిజం తెలియడంతో పాటు ఆమె మురారికి అండగా నిలిచినట్లు చూపించారు. దీంతో ఇద్దరూ కలిసి ముకుందను మార్చాలని డిసైడ్ అవుతారు. వచ్చే వారం కూడా ముకుందకు ట్విస్టులు ఇచ్చేలా వాళ్లిద్దరూ ప్లాన్ చేసినట్లు చూపించబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X