Krishna Mukunda Murari Weekly: కృష్ణకు బిగ్ షాక్.. మాయం అయిన రింగ్.. ముకుంద, మురారి మళ్లీ కలుస్తారా?
చాలా ఏళ్లుగా తెలుగు బుల్లితెరపై సరికొత్త కంటెంట్‌తో చాలా రకాల సీరియళ్లు వస్తున్నాయి. అయితే, అందులో సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటే సీరియళ్లు తక్కువగానే ఉంటున్నాయి. అందులోనూ కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఒకటి. దాదాపు ఏడాది నుంచి ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతూ రసవత్తరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకూ పెంచేస్తోంది. ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఈ 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఎలా సాగిందో మీరే లుక్కేయండి!
05వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
05వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. కృష్ణ, మురారి బైక్ మీద వెళ్తుండగా వాళ్లకు ఓ అబ్బాయి అడ్డుగా వస్తాడు. అతడి పరిస్థితిని తెలుసుకుని వాళ్లు సహాయం చేస్తారు. ఇంట్లో కృష్ణ పూజ చేస్తుండగా హారతి కర్పూరం కింద పడి ఫ్లోర్ కాలిపోతుంది. అది జరిగిన తర్వాత ఆమె కంగారు పడుతూ ఉండగా.. మురారి ధైర్యం చెప్తాడు. ఇక, కృష్ణ వాళ్లు గుడికి వెళ్తుండగా ఆదర్శ్ వాళ్లను కూడా తీసుకెళ్లమంటారు. కానీ, ముకుంద మళ్లీ తప్పించుకుంటుంది. అనంతరం పంతులుతో కృష్ణ వరుసగా జరుగుతున్న అశుభాల గురించి చెప్తుంది. దీంతో ఆయన మురారి జాతకం అడిగి తీసుకుని.. ఆమెకు ఓ మంత్రం చెబుతాడు.

06వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
06వ తేదీ మంగళవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. కృష్ణకు కీడు శంకించడంతో పంతులు చెప్పినట్లు దేవుడి ముందు కర్పూరం వెలిగిస్తుంది. కానీ, అది కూడా ఆరిపోవడంతో కంగారు పడుతుంది. కానీ, పంతులు ఆమెకు ధైర్యం చెప్పి.. మనసులో మాత్రం ఆమెకు ప్రమాదం జరగబోతుందని అనుకుంటాడు. ఇక, డ్యాన్స్ ప్రాక్టీస్ చేద్దామని ఆదర్శ్ అడగడంతో ముకుంద తనకు కాంపిటీషన్‌లో పాల్గొనడం ఇష్టం లేదన్న నిజం చెప్పేస్తుంది. అంతేకాదు, అందులో పాల్గొనవద్దని అతడిని బ్రతిమాలుతుంది. ఇక, గుడిలో జరిగింది మొత్తం కృష్ణ.. మురారికి చెబుతుంది. దీంతో అతడు ఆమెను ధైర్యంగా ఉండమని ఓదార్చుతాడు. ఈ పూర్తి ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.
07వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
07వ తేదీ బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ఆదర్శ్ డల్‌గా కనిపించడంతో మధు వెళ్లి అతడిపై సందేహం వ్యక్తం చేస్తాడు. ఆ తర్వాత మురారికి ఫోన్ చేసిన గోపీ.. బెస్ట్ కపుల్ కాంపిటీషన్ క్యాన్సిల్ అయిందని చెప్తాడు. ఈ విషయాన్ని అతడు కృష్ణకు చెప్పగా.. ఆమె ఇంట్లోనే ఈ పోటీ పెడదామని అంటుంది. అనంతరం పోటీ క్యాన్సిల్ అయిన విషయాన్ని అందరి ముందే కృష్ణ ఇంట్లో వాళ్లకు చెప్తుంది. దీంతో ముకుంద సంతోషిస్తుంది. కానీ, మురారి ఇంట్లోనే ఆ పోటీ పెడుతున్నామని చెప్పడంతో ఆమె ముఖం వాడిపోతుంది. అదంతా గమనించిన భవానీ.. ముకుంద మనసులో ఉన్నది అర్థం చేసుకుంటుంది. ఈ పూర్తి ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

08వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
08వ తేదీ గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ముకుంద, ఆదర్శ్ నిజంగానే అన్యోన్యంగా ఉంటున్నారో లేదో తెలుసుకునేందుకు కృష్ణ వాళ్లను తమతో పాటే బయటకు రావాలని అడుగుతుంది. మొదట ఒప్పుకోకపోయినా మురారితో టైం స్పెండ్ చేయొచ్చు అని వెళ్తుంది. అందరూ కలిసి కారులో వెళ్తుండగా ముకుంద, ఆదర్శ్ సైలెంట్‌గా ఉంటారు. దీంతో కృష్ణ వాళ్లపై డౌట్ పడుతుంది. అప్పుడు ముంకుద ఏవేవో చెప్పి కవర్ చేస్తుంది. అనంతరం గుడిలో కోరికలు కోరుకుని దండం పెట్టుకుంటూ ఉండగా.. గంట ఊడి పడుతుంది. అది జరిగిన తర్వాత కృష్ణకు భయం ఇంకాస్త పెరిగిపోతుంది.
09వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
09వ తేదీ శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ధ్వజస్తంభం గంట ఊడిపడడంతో కృష్ణ బాధ పడుతూ ఉంటుంది. అప్పుడు ముకుంద వాళ్లు ఆమెకు ధైర్యం చెప్తారు. అనంతరం ఆదర్శ్ కొబ్బరి కాయ కొడుతుండగా గాయం అవుతుంది. దీంతో ముకుంద అతడిలో మురారిని ఊహించుకుని అల్లాడిపోతుంది. అనంతరం వాళ్లంతా కారులో వెళ్తుండగా ఒక దగ్గర ఆపేసి కృష్ణ పువ్వులు కొంటుంది. అవి తీసుకు వచ్చి ఆదర్శ్‌ను ముకుంద తలపై పెట్టమంటుంది. దీంతో అతడు పెడతాడు. అందరూ కలిసి ఓ రెస్టారెంట్‌కు వెళ్తారు. అక్కడ ముకుందనే ఆదర్శ్‌కు ఫుడ్ తినిపిస్తుంది. అది చూసి ముకుంద మారిపోయిందని మురారి, కృష్ణలు అనుకుంటారు.

10వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
10వ తేదీ శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. రెస్టారెంట్‌లో ఫుడ్ తింటుండగా ముకుందను ఆపిన కృష్ణ.. ఆదర్శ్ ప్లేట్‌లోనే తినమని అంటుంది. అప్పుడామె ఇబ్బంది పడుతుండగా.. ఆదర్శ్ కవర్ చేస్తూ తన ప్లేట్‌లోనే తినమని కవర్ చేస్తాడు. తర్వాత కృష్ణ పెట్టిన పువ్వులు వాడిపోవడంతో ఇంకాస్త భయపడుతుంది. దీంతో మురారి వచ్చి ఆమెకు ధైర్యం చెప్తాడు. ముకుంద, ఆదర్శ్ బంధాన్ని బయటపెట్టేందుకు మధుకర్ మరోసారి మందు పార్టీ ఏర్పాటు చేస్తాడు. అతడు ఆదర్శ్‌ను ప్రశ్నలు అడగడం మొదలు పెడతాడు. దీంతో మురారి, ఆదర్శ్ కలిసి మధుకు ఫుల్లుగా మందు తాగిపిస్తారు. అనంతరం మురారి, ఆదర్శ్‌కు కృష్ణ డ్రంక్ టెస్ట్ చేస్తుంది.
ఈ వారంలో హైలైట్ అయింది ఇదే
ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 10వ వరకు సాగిన 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలతో సాగింది. ముఖ్యంగా ఈ వారంలో ముకుంద, ఆదర్శ్‌ను కలిపేందుకు మురారి వాళ్లు బెస్ట్ కపుల్ కాంపిటీషన్ ఇంట్లోనే పెట్టాలని అనుకోవడంతో కథ మలుపు తిరిగింది. కానీ, ముకుంద తీరుపై భవానీకి అనుమానం పెరిగినట్లు చూపించడంతో వాళ్లలో అన్యోన్యతను పెంచేందుకు కృష్ణ వాళ్లు బయటకు తీసుకెళ్లారు. అక్కడ ముకుంద కవర్ చేయడంతో అంతా సవ్యంగా సాగింది. వచ్చే వారం మాత్రం కృష్ణ రింగ్ పోవడంతో కథ రంజుగా మారనుంది.


Click it and Unblock the Notifications











