Krishna Mukunda Murari Weekly: ఆదర్శ్‌ను కనిపెట్టేసిన మురారి.. నిజం తెలిసి అతడు ఏం చేశాడంటే!
తెలుగు బుల్లితెరపై సరికొత్త కంటెంట్‌తో చాలా రకాల సీరియళ్లు వస్తున్నాయి. అయితే, అందులో సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటే సీరియళ్లు తక్కువగానే ఉంటున్నాయి. అందులోనూ కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఒకటి. తమిళ నటి కస్తూరి ప్రధాన పాత్రలో ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతూ రసవత్తరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకూ పెంచేస్తోంది. ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే జనవరి 15వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఈ 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఎలా సాగిందో మీరే చూడండి!
15వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో:15వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ఇంట్లో సంక్రాంతి సంబరాలు జరిగిన తర్వాత భవానీ తరపున కృష్ణ వెళ్లి ముకుందకు గిఫ్ట్ ఇస్తుంది. దీంతో ఆమె ఎంతో సంతోషిస్తుంది. అనంతరం కృష్ణ దొరకడం తన అదృష్టం అనుకుంటున్న మురారి.. ఆమెను ముద్దు అడుగుతాడు. అప్పుడామె అద్దంలో ముద్దు ఇస్తుంది. అనంతరం పూజ జరుగుతుండగా దేవుడికి పెట్టాల్సిన పళ్లు కింద పడిపోతాయి. దీంతో అందరూ భయపడుతుంటారు. ఆ తర్వాత ఓ మొక్క తెచ్చి దానికి దంపతులతో నీళ్లు పోయిస్తారు. ముకుంద కూడా రాగా.. భర్త లేడని పంతులు వద్దంటాడు.

16వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో:16వ తేదీ మంగళవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. కృష్ణ హారతి తీసుకుంటూ ఉంటే అది ఆరిపోతుంది. దీంతో అందరూ కంగారు పడిపోతారు. అప్పుడు ముకుంద తన వల్లే ఇలా జరిగిందని అంటుంది. అనంతరం అందరూ గాలి పటాలు ఎగరేస్తూ ఉంటే కృష్ణది ముకుంద కట్ చేస్తుంది. దీంతో ఆమె కావాలనే ఇలా చేస్తుందా అని కృష్ణ సందేహం వ్యక్తం చేస్తుంది. ఇక, మురారి వచ్చి శోభనం గురించి కృష్ణతో చిలిపిగా మాట్లాడతాడు. దీంతో ఆదర్శ్ వచ్చి ముకుంద జీవితం బాగైన తర్వాతనే పెళ్లి చేసుకుందాం అని కండీషన్ పెడుతుంది. దీంతో మురారి ఇంత కాలం నీ మాట విన్నా.. ఇప్పుడు నా మాట వినాల్సిందే అంటాడు.
17వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో:17వ తేదీ బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. పంతులు గారు వచ్చి కృష్ణ, మురారి శోభనం కోసం ముహూర్తం పెడతారు. ఆ తర్వాత ముకుంద ఆ పనులు చూసుకుంటాను అనగా.. భవానీ దేవి మాత్రం వద్దని చెప్తుంది. దీంతో ముకుంద ఎంతగానో బాధపడుతుంది. ఇక, తన దగ్గరకు వచ్చిన రేవతితో భవానీ కొన్ని విషయాలు చెప్తుంది. అప్పుడే ప్రభాకర్‌కు కొత్తగా కట్టే హాస్పటల్ కాంట్రాక్టును అప్పగించాలని అనుకుంటున్నట్లు చెప్తుంది. ఇక, కృష్ణను బయటకు తీసుకు వెళ్లిన ముకుంద.. ఆమెను మోడ్రన్‌గా రెడీ చేయిస్తుంది. ఆ తర్వాత ఆమె ఇంటికి రాగానే అందరూ ఆశ్చర్యపోతారు. మురారి అయితే ఫ్లాట్ అవుతాడు. ఈ పూర్తి ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.
18వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో:18వ తేదీ గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. శోభనం కోసం కృష్ణను ముకుంద అందంగా రెడీ చేస్తూ ఉంటుంది. అప్పుడు రేవతి వచ్చి ముకుందకు థ్యాంక్స్ చెప్పబోతుండగా.. ఆమె వద్దని అంటుంది. అంతేకాదు, జీవితాంతం వీళ్లకు రుణపడి ఉంటానని అంటుంది. శోభనం గదిలోకి వెళ్లే ముందు ముకుంద ఎక్కడ ఉందని కృష్ణ అందరినీ అడుగుతుంది. అప్పుడు ఆమె ఏడుస్తూ ఒంటరిగా నిల్చుని ఉంటుంది. అది చూసిన కృష్ణ.. ఆదర్శ్ వచ్చి ముకుంద సంతోషంగా ఉండే వరకూ శోభనం వద్దని ట్విస్ట్ ఇస్తుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. మురారి మాత్రం కృష్ణ నిర్ణయాన్ని గౌరవిస్తానని చెప్తాడు. ఈ పూర్తి ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.
19వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో:19వ తేదీ శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. శోభనం వద్దని చెప్పిన కృష్ణపై అందరూ కోపంగా ఉంటారు. అప్పుడు మధు వచ్చి ఆమె ప్లాన్‌ను రేవతికి అర్థం అయ్యేలా వివరిస్తాడు. దీంతో ఆమె కూల్ అయిపోతుంది. ఇక, ఆదర్శ్‌ను తీసుకు రావాలని కృష్ణ అనగా.. అతడు వస్తాడని నమ్మకం లేదని మురారి అంటాడు. ఆ తర్వాత ఇంట్లో వాళ్లు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తారు. ఆ సమయంలోనే గతంలో ముకుంద ఇచ్చిన మాటను మురారి గుర్తు చేస్తాడు. అనంతరం ఆదర్శ్ వస్తే మళ్లీ కలుస్తావా అని ముకుందను నందూ ప్రశ్నిస్తుంది. దీంతో కృష్ణ కోసం ఏం చేయడానికైనా సిద్ధమే అని ఆమె చెబుతుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

20వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో:20వ తేదీ శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ఇంట్లో అందరూ భోజనం చేస్తుండగా కృష్ణ, మురారి వచ్చి ఆదర్శ్ జాడ తెలిసిందని చెప్తారు. దీంతో అందరూ సంతోషించగా.. ముకుంద మాత్రం బాధపడుతుంది. ఆ తర్వాత ఆమె తన అంతరాత్మతో మాట్లాడుతుంది. అనంతరం వాళ్ల మెహతా దగ్గరకు వెళ్లగా.. ఆదర్శ్ జాబ్ మానేశాడని, అతడికి ఓ పల్లెటూరిలో స్థలం ఇవ్వడంతో అక్కడే ఉంటున్నాడని చెప్తాడు. దీంతో మురారి, కృష్ణ అతడి దగ్గరకు వెళ్లాలని డిసైడ్ అవుతారు. ఆ వెంటనే కారులో ఆ ఊరు వెళ్లేందుకు ప్రయాణం అవుతారు. ఆ సమయంలో ఇద్దరూ గతాన్ని తలుచుకుని ఎమోషనల్ అవుతూ ఉంటారు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.
ఈ వారంలో హైలైట్ అయింది ఇదే:జనవరి 15వ తేదీ నుంచి 20వ వరకు సాగిన 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలతో సాగింది. ముఖ్యంగా ఈ వారంలో కృష్ణ, మురారికి శోభనం ప్లాన్ చేయడాన్ని హైలైట్ చేశారు. కానీ, దీన్ని కృష్ణ ఆపేయడాన్ని చూపించారు. అప్పటి నుంచి ముకుంద భర్త ఆదర్శ్‌ను వెతికే పనిని కృష్ణ, మురారి ముమ్మరం చేయడం కూడా చూపించారు. వచ్చే వారంలో మురారి వాళ్లు ఆదర్శ్‌ను కలిసి మాట్లాడబోతున్నారు. మరి అతడు తిరిగి వస్తాడా? ముకుందతో కలిసి ఉంటాడా? అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.


Click it and Unblock the Notifications











