అసలు నిందితుడిని పట్టుకున్న కృష్ణ.. పెళ్లికి ముందు ట్విస్ట్
సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై సరికొత్త కంటెంట్‌తో చాలా రకాల సీరియళ్లు వస్తున్నాయి. అయితే, అందులో సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటే సీరియళ్లు తక్కువగానే ఉంటున్నాయి. అందులోనూ కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఒకటి. తమిళ నటి కస్తూరి ప్రధాన పాత్రలో ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతూ రసవత్తరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకూ పెంచేస్తోంది. ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే జనవరి 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఈ 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఎలా సాగిందో మీరే చూడండి!
01వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 01వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. భవానీ అవమానించేలా మాట్లాడడంతో కృష్ణను మురారి ఓదార్చుతాడు. అంతేకాదు, దోషిని ఎలాగైనా వెతికి పట్టుకుని కేసును సాల్వ్ చేస్తానని చెప్తాడు. అనంతరం ముకుంద టెన్షన్ పడుతూ దేవ్ దగ్గరకు వెళ్లి ఏదో ఒకటి చేయమని అడుగుతుంది. దీంతో అతడు ఆలోచనలో పడతాడు. ఆ తర్వాత స్కెచ్ ఆర్టిస్టు వచ్చి పరిమళ చెప్పినట్లుగా బొమ్మను గీస్తాడు. కానీ, అది వాచ్‌మన్ కొడుకుది కావడంతో భవానీ దేవి.. మురారి, కృష్ణపై సీరియస్ అవుతుంది. ఆ తర్వాత అలా తానే ప్లాన్ చేసినట్లు దేవ్.. ముకుందకు చెప్తాడు. ఈ పూర్తి ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

02వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 02వ తేదీ మంగళవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. స్కెచ్ ఆర్టిస్టు చేసిన పనికి దోషులుగా మారిన కృష్ణ, మురారి కలిసి భవానీకి సర్ధి చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ, ఆమె మాత్రం వినిపించుకోదు. ఆ తర్వాత దేవ్ తలకు కట్టుతో ఇంటికి వస్తాడు. ఏమైందని అందరూ అడగ్గా.. శ్రీధర్‌ను తీసుకు రావడానికి వెళ్తే.. ఎవరో తనను కొట్టారని, స్పృహలోకి వచ్చే సరికి శ్రీధర్ చనిపోయి ఉన్నాడని చెప్తాడు. దీంతో శ్రీధర్ చనిపోవడం వల్ల తమకు మంచే జరిగిందని మురారి చెప్తాడు. దీంతో దేవ్ కంగారు పడతాడు. ఇక, భవానీ ఎప్పటిలానే ప్రభాకర్‌పై అనుమానపడుతుంది.
03వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 03వ తేదీ బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. శ్రీధర్ హత్యకు గురయ్యాడని తెలిసిన తర్వాత అందరూ అయోమయంలో ఉంటారు. అప్పుడు కృష్ణ వెళ్లి.. ముకుందపై అనుమానం వ్యక్తం చేస్తుంది. దీనికి మురారి మాత్రం ఏకీభవించడు. ఆ తర్వాత రేవతి వచ్చి కూడా ముకుందపై డౌట్ పడగా.. భవానీ సీరియస్ అవుతుంది. ఇక, శ్రీధర్ డెడ్ బాడీ ఫొటోలను చూసినప్పుడు అతడి ముఖంపై ఉన్న రింగ్ గుర్తును కృష్ణ చూసి మురారికి చెప్తుంది. దీంతో కేసులో ఇదో ఆధారం అని గుర్తిస్తాడు. అనంతరం శ్రీధర్ అకౌంట్‌లోకి కాశ్మీర్ నంబర్ నుంచి డబ్బు వచ్చిందని తెలుస్తుంది.
04వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 04వ తేదీ గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. శ్రీధర్‌ను ఎవరు చంపి ఉంటారని కృష్ణ ఆలోచిస్తూ దేవ్ మీద సందేహం వ్యక్తం చేస్తుంది. దీంతో మురారి ఆమెకు కొన్ని జాగ్రత్తలు చెప్తాడు. ఆ తర్వాత ముకుంద వచ్చి పెళ్లి విషయంలో భవానీని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు రేవతి అడ్డుపడగా.. ఆమెకు భవానీ కౌంటర్లు ఇస్తుంది. ఇక, మురారి, ముకుంద పెళ్లికి ఏర్పాట్లు చేస్తుండడంతో శకుంతల కృష్ణ, మురారిని తీసుకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తుంది. కానీ, కృష్ణ మాత్రం ఆమెతో వెళ్లేందుకు ఇష్టపడదు. అంతేకాదు, దోషిని బయట పెట్టి మురారి సార్‌ను పెళ్లి చేసుకుంటాను అని అందరినీ తేల్చి చెప్పేస్తుంది.
05వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 05వ తేదీ శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. కృష్ణ, మురారి కాన్ఫిడెన్స్ చూసిన భవానీకి తనపై తనకే సందేహం వస్తుంది. నేనేమైనా తప్పు చేస్తున్నానా అనుకుంటుంది. కానీ, తర్వాత సమర్ధించుకుంటుంది. అనంతరం శకుంతల వచ్చి భవానీని ప్రాధేయపడినా ఆమె కృష్ణను క్షమించదు. ఇక, దేవ్ చేతికి ఉన్న ఉంగరం చూసి కృష్ణకు డౌట్ వస్తుంది. కానీ, పొరపాటు అనుకుంటుంది. అనంతరం ముకుంద - మురారికి నలుగు పెట్టే కార్యక్రమం ఔట్ హౌస్‌లోనే చేస్తున్నట్లు చెప్పి భవానీ దేవి అందరికీ షాక్ ఇస్తుంది. అప్పుడు కృష్ణ బాధపడుతుండగా.. మురారి వెళ్లి ఆమెకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.
06వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 06వ తేదీ శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ముందుగా అనుకున్నట్లుగానే ముకుంద, మురారికి నలుగు పెట్టే కార్యక్రమం చేస్తుంటారు. అప్పుడే శ్రీధర్‌ను చంపిన నిందితుల్లో ఒకరు దొరికారని మురారికి ఫోన్ వస్తుంది. ఈ విషయాన్ని భవానీ దేవికి చెప్పగా.. ఆమె నమ్మదు. దీంతో ఆ నిందితుడిని అక్కడికే తీసుకు రమ్మని మురారి చెప్తాడు. అతడు వచ్చిన వెంటనే జైల్లో ఉన్న ప్రభాకర్ చెప్పడం వల్లే ఇలా చేశానని అబద్ధం చెప్తాడు. దీంతో మరోసారి మురారి, కృష్ణపై భవానీ ఓ రేంజ్‌లో సీరియస్ అయిపోతుంది. ఆ తర్వాత ఇదంతా దేవ్ ప్లాన్ ప్రకారం చేసిన డ్రామా అని చూపిస్తారు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.
ఈ వారంలో హైలైట్ అయింది ఇదే: జనవరి 1వ తేదీ నుంచి 6వ వరకు సాగిన 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలతో సాగింది. ముఖ్యంగా ఈ వారంలో శ్రీధర్ హత్య జరగడాన్ని హైలైట్ చేశారు. అతడిని చంపిన వారిని పట్టుకునేందుకు కృష్ణ, మురారి చేస్తున్న ప్లాన్స్‌ను కూడా చూపించారు. దేవ్ మాస్టర్ మైండ్‌తో వాళ్లిద్దరూ భవానీ దేవి ముందు దోషులుగా మిగిలిపోయారు. అయితే, రాబోయే ఎపిసోడ్‌లో దేవ్ అసలు హంతకుడు అని కృష్ణ గుర్తించడం ప్రోమోలో చూపించారు. దీంతో ఈ సీరియస్ మరింత రసవత్తరంగా మారబోతుందని చెప్పుకోవచ్చు.


Click it and Unblock the Notifications











