Krishna Mukunda Murari Weekly: శోభనం ఆపేసింది ఆమె వల్లే.. నిజం చెప్పబోతున్న ఆదర్శ్.. కథలో ట్విస్ట్
చాలా ఏళ్లుగా తెలుగు బుల్లితెరపై సరికొత్త కంటెంట్‌తో చాలా రకాల సీరియళ్లు వస్తున్నాయి. అయితే, అందులో సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటే సీరియళ్లు తక్కువగానే ఉంటున్నాయి. అందులోనూ కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఒకటి. దాదాపు ఏడాది నుంచి ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతూ రసవత్తరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకూ పెంచేస్తోంది. ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే జనవరి 22వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఈ 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఎలా సాగిందో మీరే చూడండి!
22వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
22వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. మురారి, కృష్ణ కలిసి ఆదర్శ్ ఉన్న ప్లేస్‌ను కనుక్కుని అతడి దగ్గరకు వెళ్తారు. కానీ, వీళ్లను అతడు గుర్తు పట్టడు. అప్పుడు కృష్ణ జరిగింది మొత్తం వివరించి చెప్తుంది. దీంతో ఆదర్శ్ ఆప్యాయంగా మురారితో మాట్లాడతాడు. అన్నీ మాట్లాడుకున్న తర్వాత అతడిని ఇంటికి రమ్మని అడుగుతారు. కానీ, ఆదర్శ్ రాను అని చెప్తాడు. అప్పుడు కృష్ణ కూడా ముకుంద అతడి కోసం వేచి చూస్తుందని నిజాలు చెప్తుంది. అయినా ఆదర్శ్ మాత్రం తిరిగి రాలేనని తేల్చి చెబుతాడు. దీంతో ముకుంద మారిపోయిందని, వస్తే చక్కగా ఉండొచ్చని కృష్ణ, మురారి అతడిని ఒప్పించే ప్రయత్నం చేస్తారు. ఈ పూర్తి ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

23వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
23వ తేదీ మంగళవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. మురారి, కృష్ణ కలిసి ఆదర్శ్‌ను ఇంటికి తిరిగి వచ్చేందుకు ఒప్పిస్తారు. కానీ, ఇంట్లో వాళ్లకు కృష్ణ వాళ్లు ఫోన్ నెంబర్లు కనెక్ట్ అవకపోవడంతో అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. ఆ తర్వాత భవానీ దేవి చేసిన కాల్ కృష్ణకు కలుస్తుంది. అప్పుడామె ఆదర్శ్ తిరిగి వస్తున్నాడన్న విషయాన్ని చెబుతుంది. దీంతో అందరూ సంతోషిస్తుండగా.. ముకుంద మాత్రం ముభావంగా ఉంటుంది. అది గమనించిన మధుకర్‌కు ఆమెపై డౌట్ వస్తుంది. ఆ తర్వాత ముకుంద దగ్గరకు వెళ్లి సూటిగా ప్రశ్నిస్తాడు. దీనికి ముకుంద కవర్ చేసుకుంటుంది. ఆదర్శ్ ఇంటికొచ్చేందుకు రెడీ అవుతాడు. ఈ పూర్తి ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.
24వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
24వ తేదీ బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ముకుందకు తండ్రి ఫోన్ చేసి మీ అన్నయ్య ఇంత కాలం బంధించాడని చెప్తాడు. తర్వాత ఆమె ఆదర్శ్ తిరిగి వస్తున్నాడని అంటుంది. అనంతరం ఇంట్లో వాళ్లంతా ఆదర్శ్ కోసం వేచి చూస్తుండగా.. ముకుంద డల్‌గా ఉంటుంది. అది భవానీ దేవి గమనించి ఆమెపై డౌట్ పడుతుంది. ఆ తర్వాత ఆదర్శ్‌ను కృష్ణ వాళ్లు తీసుకు వస్తారు. అతడిని చూసి భవానీ దేవి ఎమోషనల్ అవుతుంది. అప్పుడు ముకుందను, అందరినీ వదలి వెళ్లిపోనని ఆదర్శ్ హామీ ఇస్తాడు. కానీ, ముకుంద మాత్రం తన మనసులో ఆదర్శ్‌కు ఏమాత్రం స్థానం లేదని అనుకుంటుంది. ఈ పూర్తి ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.
25వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
25వ తేదీ గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ఇంటికి వచ్చిన తర్వాత ముకుంద రూమ్‌లోకి వెళ్లిన ఆదర్శ్.. తన ప్రేమను మొత్తం ఆమెకు వ్యక్తపరుస్తాడు. అంతేకాదు, అసలు తిరిగి ఎందుకు రావాల్సి వచ్చిందో వివరించి చెప్తాడు. దీనికి ముకుంద కూడా మారిపోయినట్లు నటిస్తుంది. అనంతరం కృష్ణ, మురారి.. ముకుంద, ఆదర్శ్ గురించి మాట్లాడుకుంటారు. వాళ్ల కథ సుఖాంతం అయిపోయిందని అనుకుంటారు. అంతేకాదు, ఆదర్శ్‌కు కొత్తగా కట్టే హాస్పిటల్ బాధ్యతలు అప్పగించాలని అనుకుంటారు. తర్వాత అతడి కోసం భవానీ దేవి స్వయంగా వండి అన్నీ దగ్గరుండి వడ్డిస్తుంది. దీంతో ఆదర్శ్ ఎమోషనల్ అవుతాడు.
26వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
26వ తేదీ శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ఆదర్శ్‌ను రిజైన్ ఎందుకు చేశావని భవానీ ప్రశ్నించగా.. రిస్క్ ఎక్కువ చేయడం వల్ల అడ్మినిస్ట్రేషన్‌లో వేశారని, అందుకే అలా చేశాడని కృష్ణ చెప్తుంది. అప్పుడామె తల్లి ఉందని గుర్తు లేక అలా చేశాడని అంటుంది. దీంతో ముకుంద గురించి చెప్పడం లేదేంటి అని మురారి వాళ్లు అనుకుంటారు. అప్పుడు ముకుంద కూడా భవానీకి డౌట్ రాకుండా నటించాలని అనుకుంటుంది. తర్వాత ఆదర్శ్, ముకుందకు కూడా శోభనం చేయాలని అనుకుంటారు. వీళ్లు కలిసేలా చేసిన కృష్ణను భవానీ మెచ్చుకుంటుంది. ఇక, ఇంట్లో జరిగిన కథను సినిమాగా తీస్తానని మధు అంటాడు.
27వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
27వ తేదీ శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ఆదర్శ్ వచ్చిన తర్వాత ఫుల్ జోష్‌లో ఉన్న కృష్ణ.. ఇకపై భవానీ దేవిలా ఉంటానని అంటుంది. అంతేకాదు, ఆమెను ఇమిటేట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడకు వచ్చిన భవానీ.. నువ్వు నీ లాగనే ఉండు అని కృష్ణతో అంటుంది. ఆదర్శ్, మురారి జంటలకు శోభనం ముహూర్తం చూడడానికి వచ్చిన పంతులు.. పది రోజుల వరకూ మహూర్తాలు లేవని చెప్తాడు. అతడితో భవానీనే అలా చెప్పిస్తుంది. ఇక, ముకుంద మనసులో ఒకరిని పెట్టుకుని ఆదర్శ్‌తో కలిసి బతకలేనని అనుకుంటుంది. అప్పుడే అతడు వచ్చి చేయి వేయగా అరుస్తుంది. దీంతో అంతా కంగారు పడతారు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.
ఈ వారంలో హైలైట్ అయింది ఇదే
జనవరి 22వ తేదీ నుంచి 27వ వరకు సాగిన 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలతో సాగింది. ముఖ్యంగా ఈ వారంలో కృష్ణ, మురారి కలిసి ఆదర్శ్‌ను ఇంటికి తీసుకు రావడాన్ని హైలైట్ చేశారు. అలాగే, అతడితో ముకుంద దూరంగా ఉండడం కూడా చూపించారు. మొత్తానికి ఆదర్శ్ తిరిగి రావడం వల్ల అంతా సవ్యంగా సాగుతుందని ఇంట్లో వాళ్లు అనుకుంటూ ఉండగా.. ముకుంద మాత్రం అతడికి దూరంగానే ఉండేందుకు ప్లాన్లు చేస్తుంది. ఇక, ఆదర్శ్ నిజం చెప్పడానికి రెడీ అయినట్లు వచ్చే వారంలో చూపించబోతున్నారు.


Click it and Unblock the Notifications











