Krishna Mukunda Murari Weekly: అడ్డంగా దొరికిన ముకుంద.. భవానీ దేవి కీలక నిర్ణయం.. కృష్ణకు అశుభాల భయం
తెలుగు బుల్లితెరపై సరికొత్త కంటెంట్‌తో చాలా రకాల సీరియళ్లు వస్తున్నాయి. అయితే, అందులో సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటే సీరియళ్లు తక్కువగానే ఉంటున్నాయి. అందులోనూ కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఒకటి. దాదాపు ఏడాది నుంచి ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతూ రసవత్తరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకూ పెంచేస్తోంది. ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే జనవరి 29వ తేదీ నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు ఈ 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఎలా సాగిందో మీరే లుక్కేయండి!
29వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
29వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ఆదర్శ్ వచ్చిన తర్వాత ముకుంద తీరును గమనించిన భవానీ దేవికి ఆమెపై అనుమానం మొదలవుతుంది. అంతలో రేవతి వచ్చి మరో పంతులును పిలిచి శోభనాలకు ముహూర్తం పెట్టిద్దాం అంటుంది. ఆ సమయంలో భవానీ దేవి తన అనుమానాలను రేవతి ముందు ఉంచుతుంది. మరోవైపు, ఆదర్శ్‌కు కూడా ముకుంద తీరుపై డౌట్ వస్తుంది. కానీ, తను నిజంగానే మారిందని అతడు నమ్ముతాడు. అయితే, ముకుంద ఎందుకు అరిచిందో తెలుసుకునేందుకు ఆదర్శ్‌తో మందు తాగించాలని మధు అనుకుంటాడు. అప్పుడు మురారి కూడా వాళ్లతో కలుస్తానంటాడు. ఈ పూర్తి ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

30వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
30వ తేదీ మంగళవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. నిజం చెప్పించాలని మధు ప్లాన్ చేసినట్లుగానే అందరూ మందు తాగేందుకు రెడీ అవుతారు. అప్పుడు మధు తొండ పడితే ఎందుకు అంతలా అరిచింది అని డౌట్ పడతాడు. అప్పుడు అందరూ అదే అంటారు. దీంతో ఆదర్శ్ నిజం చెప్పబోతాడు. అప్పుడు కంగారు పడిన ముకుంద వెంటనే కృష్ణ దగ్గరకు వెళ్తుంది. అప్పుడామెను నమ్మించేలా మాట్లాడి వాళ్లు మందు తాగడం ఆపాలని చెప్తుంది. దీంతో కృష్ణ, ముకుంద వచ్చి వాళ్లను తాగొద్దని అంటారు. దీంతో ఆదర్శ్ నిజం చెప్పడు. తర్వాత ముకుంద తన మనసులో మురారినే ఉన్నాడని అసలు విషయం బయటపెడుతుంది. ఈ పూర్తి ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.
31వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
31వ తేదీ బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. మందు తాగి ఉన్న ఆదర్శ్ తన భార్య ముకుంద గురించి పొగుడుతూ మాట్లాడతాడు. తర్వాత మురారి కూడా అలాగే కృష్ణ గురించి చెప్తుంటాడు. ఆ తర్వాత ముకుంద వేరేగా పడుకోవడం చూసిన ఆదర్శ్.. ఆమెను సూటిగా కొన్ని ప్రశ్నలను అడుగుతాడు. వాటిని ముకుంద తెలివిగా అబద్ధాలు చెప్పి తప్పించుకుంటుంది. అప్పుడు కృష్ణ వాళ్లను అడుగుదాం అని అనగా.. వద్దని చెబుతుంది. శోభనం విషయంలోనూ ఆదర్శ్‌కు షాక్ ఇస్తుంది. ఈ పూర్తి ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

01వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
01వ తేదీ గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ముకుంద, ఆదర్శ్‌ను ఉంగరాలు మార్చుకోవాలని కృష్ణ షాక్ ఇస్తుంది. దీంతో ఆదర్శ్ సంతోషంగా ఉండగా.. ముకుంద మాత్రం డల్‌గా ఉంటుంది. దీంతో తనకు ఇష్టం లేదని మధు అందరి ముందే అంటాడు. అందుకు తగ్గట్లుగానే ఆదర్శ్ ఉంగరం తొడిగే ప్రయత్నం చేయగా.. ముకుంద వెనక్కి లాక్కుంటుంది. దీంతో అందరికీ సందేహం వస్తుంది. అప్పుడు ఆమె తెలివిగా కృష్ణ, మురారిలను ఉంగరాలు మార్చుకోమంటుంది. దీంతో వాళ్లు మార్చుకుంటారు. తర్వాత ఆదర్శ్‌కు ఈ విషయంపై సారీ చెప్పగా.. అతడు మాత్రం ఆమెకు మద్దతుగా మాట్లాడతాడు.
02వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
02వ తేదీ శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. రింగ్‌ల విషయంలో ముకుంద చెప్పిన మాటలను ఆదర్శ్ నమ్మేస్తాడు. దీనిపై మురారి, కృష్ణ చర్చిస్తారు. వాళ్లు కూడా ముకుంద మారిందనే అనుకుంటారు. కానీ, భవానీ దేవి మాత్రం ముకుంద మారలేదని, తన కొడుకుకు అన్యాయం చేస్తుందేమో అని అనుమానం వ్యక్తం చేస్తుంది. అప్పుడే రేవతి వచ్చి వాళ్లకు పెట్టుడు ముహూర్తంతో శోభనం జరిపించాలని అనుకుంటున్నట్లు చెప్తుంది. కానీ, దీనికి భవానీ మాత్రం ఒప్పుకోదు. పైగా ఆమెపై సీరియస్ అవుతుంది. తర్వాత ఈ విషయం కృష్ణకు చెప్పడంతో ఆమె వచ్చి భవానీని అడుగుతుంది. ఆమెపై కూడా భవానీ కోప్పడుతుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.
03వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
03వ తేదీ శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ముకుంద, ఆదర్శ్ ఫస్ట్ నైట్ జరిగినప్పుడే మేము కూడా చేసుకుంటాం అని పెద్దత్తయ్యతో చెప్పాను అని మురారితో కృష్ణ చెప్తుంది. దీంతో అతడు షాక్ అవుతాడు. ఇందుకోసం ముకుంద, ఆదర్శ్‌ను బెస్ట్ కపుల్ పోటీకి తీసుకు వెళ్లాలని మురారి ప్లాన్ చేస్తాడు. ఆ తర్వాత ఇదే విషయం వాళ్లకు చెప్పగా.. ముకుందకు ఇష్టం లేదని తేల్చి చెప్తుంది. ఇందుకోసం ఆమె కొన్ని అబద్దాలు చెప్తుంది. దీంతో భవానీ దేవికి ముకుంద తీరుపై అనుమానం మరింత ఎక్కువ అయిపోతుంది. చివరికి అక్కడకు వెళ్లేందుకు ఎలా తప్పించుకోవాలా అని ముకుంద ఆలోచిస్తూ ఉంటుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.
ఈ వారంలో హైలైట్ అయింది ఇదే
జనవరి 29వ తేదీ నుంచి ఫిబ్రవరి 3వ వరకు సాగిన 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలతో సాగింది. ముఖ్యంగా ఈ వారంలో ముకుంద, ఆదర్శ్‌ను కలిపేందుకు మిగిలిన వాళ్లు ప్రయత్నించడం చూపించారు. అయితే, ముకుంద మాత్రం ఆదర్శ్‌కు దూరంగానే ఉంటూ వస్తుంది. దీంతో భవానీ దేవి వాళ్ల శోభనానికి అడ్డు పడుతుంది. అలా ఈ వారం మొత్తం ముకుంద తీరును హైలైట్ చేశారు. ఇక, వచ్చే వారంలో కృష్ణ ఏదో కీడు జరుగుతుందని భయపడుతుండగా.. మరో అశుభం జరుగుతుంది. ఇది మరింత రంజుగా మారనుంది.


Click it and Unblock the Notifications











