Krishna Mukunda Murari Weekly: మళ్లీ జంటగా కృష్ణ, మురారి.. అంతలోనే ఊహించని ఘటన.. కథలో సూపర్ ట్విస్ట్
సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై సరికొత్త కంటెంట్‌తో చాలా రకాల సీరియళ్లు వస్తున్నాయి. అయితే, అందులో సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటే సీరియళ్లు తక్కువగానే ఉంటున్నాయి. అందులోనూ కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఒకటి. తమిళ నటి కస్తూరి ప్రధాన పాత్రలో ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతూ రసవత్తరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకూ పెంచేస్తోంది. ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే జనవరి 8వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఈ 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఎలా సాగిందో మీరే చూడండి!
08వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
08వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. మురారితో పెళ్లి జరిగే పరిస్థితి కనిపించకపోవడంతో కృష్ణ బాధలో మునిగిపోతుంది. ఆ తర్వాత తన బాబాయి కోసం జైలుకు కూడా వెళ్తుంది. అయినా ప్రయోజనం ఉండదు. అనంతరం ఇంటికి వచ్చిన కృష్ణను మురారి ఓదార్చడంతో పాటు పెళ్లి జరుగుతుందని ధైర్యం చెప్తాడు. ఇక, కృష్ణ పరిస్థితిని చూసిన దేవ్.. భవానీని ఎదురించినట్లు మాట్లాడతాడు. ఆ సమయంలో అతడి ఉంగరం చూసిన కృష్ణ.. అసలు దోషి దేవ్ అని గుర్తిస్తుంది. అప్పుడే పరిమిళ వచ్చి ఆధారాలు చూపించడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. ఈ పూర్తి ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

09వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
09వ తేదీ మంగళవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. దేవ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుని వెళ్లిపోతారు. దీంతో కృష్ణ ఎంతో సంతోషంగా ఉంటుంది. ఆ తర్వాత ఔట్ హౌస్‌కు వెళ్లి జరిగిన విషయం మొత్తం శకుంతలకు చెప్తుంది. దీంతో అందరూ ఆనందంగా ఉంటారు. అనంతరం ముకుందను భవానీ ఇంట్లో నుంచి వెళ్లిపోమని అంటుంది. అప్పుడామె ఎంత చెప్పినా వినిపించుకోదు. ఆ సమయంలోనే ముకుందకు కృష్ణ అండగా నిలుస్తుంది. ముకుందను క్షమించమని అడుగుతుంది. కానీ, భవానీ దేవి మాత్రం అస్సలు వినిపించుకోదు. అయినా కృష్ణ మాత్రం ఆమె వైపు మాట్లాడడంతో అందరూ షాక్‌లో ఉండిపోతారు.
10వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
10వ తేదీ బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. సమస్యలన్నీ తీరిపోయిన తర్వాత కృష్ణ.. ఎలాగైనా ఆదర్శ్‌ను తీసుకు వచ్చి ముకుందతో కలపాలని అనుకుంటుంది. ఈ విషయం మురారికి చెప్పడంతో అతడు కూడా ఓకే అంటాడు. తన కోసం మంచి చేస్తున్న ముకుంద.. కృష్ణను ఔట్ హౌస్ నుంచి తీసుకు రావాలని భవానీతో చెబుతుంది. అందుకుగానూ తానే అక్కడకు వెళ్లిపోతానని అంటుంది. ఇంట్లో వాళ్లు కూడా అదే అనడంతో భవానీ ఓకే అంటుంది. ఇక, నిర్దోషి అయిన ప్రభాకర్‌ను విడిపించేందుకు భవానీ దేవి లాయర్‌ను పిలిపించి మాట్లాడుతుంది. ఈ పూర్తి ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

11వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
11వ తేదీ గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ముకుంద మంచిగా మారినట్లు వ్యవహరిస్తున్న తీరుకు ఆమె మీద మధుకర్ వాళ్లకు డౌట్ వస్తుంది. ఆమెతో ఎందుకైనా జాగ్రత్తగా ఉండాలని అనుకుంటారు. ఆ తర్వాత ఆదర్శ్‌ను తీసుకు రావాలని కృష్ణ, మురారి వెళ్తారు. అప్పుడు అతడి గురించి ఓ వ్యక్తి కొంత సమాచారం ఇస్తాడు. ఇక, రేవతిని పిలిచిన భవానీ.. ప్రభాకర్‌ను విడిపించే ప్రయత్నం చేస్తున్నానని చెప్తుంది. అప్పుడే రేవతి కూడా మురారి, కృష్ణకు ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేయాలనుకుంటున్నట్లు చెబుతుంది. దీనికామె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సంతోషిస్తుంది. ఈ పూర్తి ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.
12వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
12వ తేదీ శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. సంక్రాంతి సందర్భంగా ఔట్ హౌస్‌లో పిండి వంటలు చేస్తుండగా మధుకర్ వీడియో తీస్తాడు. అందరూ తనతో మంచిగా ఉండడంతో ముకుంద సంతోషిస్తుంది. మురారికి ప్రేమ పరీక్ష పెట్టిన కృష్ణ అతడి వీపుపై కొన్ని రాస్తుంది. వాటిని అతడు కనిపెట్టాలని చెప్తుంది. ఆ తర్వాత ఇద్దరి మధ్య రొమాన్స్ జరుగుతుంది. భోగి మంటలు పెట్టే సమయంలో మధుకర్ బాధ పడుతుండగా.. భవానీ అతడిలో చాలా టాలెంట్ ఉందని ఎంకరేజ్ చేస్తుంది. దీంతో అతడు సంతోషిస్తాడు. ఆ తర్వాత ఇంట్లోని వస్తువులు తెచ్చి భోగి మంటలు వేసేందుకు అందరూ ఏర్పాట్లు చేస్తారు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.
13వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
13వ తేదీ శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. భోగి మంటలు వేస్తున్న సమయంలో ముకుంద ఒంటరిగా ఉండడంతో కృష్ణ ఆమెను తీసుకుని వస్తుంది. ఆ తర్వాత అందరూ కలిసి పండుగను సంతోషంగా జరుపుకుంటారు. ముందుగా డ్యాన్స్‌లు వేసి ఆనందంగా గడుపుతారు. ఆ తర్వాత రోజు అందరూ కింద కూర్చుని భోజనం చేయాలని భవానీ దేవి కండీషన్ పెట్టడంతో అంతా అలాగే చేస్తారు. ఇంట్లో వాళ్లంతా భోజనం చేసిన తర్వాత వాటిని ముకుంద వండిందని తెలుస్తుంది. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురవుతారు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

ఈ వారంలో హైలైట్ అయింది ఇదే
జనవరి 8వ తేదీ నుంచి 13వ వరకు సాగిన 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలతో సాగింది. ముఖ్యంగా ఈ వారంలో అసలు నిందితుడు దేవ్ అని కృష్ణ గుర్తించడాన్ని, అతడిని పోలీసులు అరెస్ట్ చేయడాన్ని హైలైట్ చేశారు. ఆ తర్వాత ముకుంద కోసం కృష్ణ త్యాగం చేయడం.. ఆదర్శ్‌ను వెతికి తీసుకు రావాలని అనుకోవడం చూపించారు. ఇక, సంక్రాంతి పండుగను సంతోషంగా జరుపుకోవాలని అందరూ అనుకుంటారు. అంతలోనే ఊహించని ఘటన జరుగుతుంది. దీన్ని వచ్చే వారంలో చూపించబోతున్నారు.


Click it and Unblock the Notifications











