Krishna Mukunda Murari Weekly: మళ్లీ భవానీ ఇంట్లోకి ముకుంద.. కొత్త రూపంతో షాక్.. కృష్ణను చంపేస్తుందా?
కొత్త కంటెంట్ వస్తున్నా తెలుగు బుల్లితెరపై సరికొత్త కంటెంట్‌తో చాలా రకాల సీరియళ్లు వస్తున్నాయి. అయితే, అందులో సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటే సీరియళ్లు తక్కువగానే ఉంటున్నాయి. అందులోనూ కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఒకటి. దాదాపు ఏడాది నుంచి ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతూ రంజుగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకూ పెంచేస్తోంది. ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే మార్చి 11వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఈ 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఎలా సాగిందో మీరే లుక్కేయండి!
11వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
11వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. శోభనం గదిలో నుంచి బయటకు వచ్చిన ఆదర్శ్.. తన స్థానంలో మురారిని వెళ్లమంటాడు. దీంతో అతడు కొడతాడు. అప్పుడు ఆదర్శ్ తన లైఫ్‌ను అందరూ కలిసి నాశనం చేశారని చెబుతాడు. ముఖ్యంగా కృష్ణ వల్లే ఇలా అయిందని ఆరోపిస్తాడు. అప్పుడు కృష్ణ కోపంగా వెళ్లి ముకుందను కిందకు తీసుకుని వచ్చి అందరి ముందే ప్రశ్నిస్తుంది. దీంతో ఆమె నిజాలు అన్నీ ఒప్పుకుంటుంది. అంతేకాదు, మురారికి ఈ విషయాలు ముందే చెప్పానని అనడంతో ఆదర్శ్‌లో కోపం పెరుగుతుంది. తర్వాత కూడా రెచ్చిపోయి మాట్లాడుతుంటే కృష్ణ.. ముకుంద చెంపను చెల్లుమనిపిస్తుంది.

12వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
12వ తేదీ మంగళవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ముకుంద అందరి ముందు నిజాలు ఒప్పుకోవడంతో కృష్ణకు కోపం పెరిగిపోతుంది. దీంతో ఆమెను ఘోరంగా అవమానించడంతో పాటు చెంప పగలగొడుతుంది. అప్పుడు ముకుంద వార్నింగ్ ఇస్తూ ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోతుంది. తర్వాత ఆదర్శ్ కూడా అంతటికి కారణం కృష్ణే అని నిందిస్తాడు. అప్పుడు మురారి అతడిపై కోప్పడతాడు. తర్వాత ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయేందుకు రెడీ అవుతాడు. కానీ, కృష్ణ, మురారి కలిసి ముకుందను మళ్లీ తీసుకు వస్తామని చెప్పి అతడిని ఆపుతారు. చివర్లో ఆదర్శ్ తనపై నిందలు వేయడాన్ని కృష్ణ తట్టుకోలేకపోతుంది. ఈ పూర్తి ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.
13వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
13వ తేదీ బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ముకుంద వెళ్లిపోయిందన్న బాధలో ఆదర్శ్ మందు తాగుతూ రచ్చ రచ్చ చేస్తుంటారు. దీంతో ఆమెను వెతికి తీసుకు వచ్చేందుకు కృష్ణ, మురారి బయటకు వెళ్తారు. ఆ సమయంలో ఆమెకు ఏమైనా జరిగి ఉంటుందేమో అని కృష్ణ భయపడుతుంటుంది. దీంతో మురారి ఆమెకు ధైర్యం చెప్తాడు. అనంతరం ఆదర్శ్ తన బాధ మొత్తాన్ని మధుకు చెప్తాడు. అంతేకాదు, ఇంట్లో అందరూ కలిసి తనను పిచ్చోడిని చేశారని నిందిస్తాడు. ఓ అమ్మాయి రైలు పట్టాలపై పడి ఉందని ఎవరో చెప్పడంతో అది ముకుంద అయి ఉంటుందేమో అనుకుని కృష్ణ, మురారి భయపడిపోతారు. ఈ పూర్తి ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.
14వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
14వ తేదీ గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో..ముకుంద వెళ్లిపోయిందన్న బాధలో ఉన్న ఆదర్శ్.. ఆమె దాచిన ఫొటోలను కాలుస్తుంటాడు. అప్పుడు అది చూసి మధు, రేవతి కంగారు పడతారు. అంతలోనే అక్కడకు మురారి వాళ్లు వస్తారు. అప్పుడు అక్కడ జరిగింది రేవతి చెబుతుంది. తర్వాత యువతి ఆత్మహత్య అని టీవీలో వచ్చేది చూసి అందరూ భయపడతారు. తర్వాత ఆస్పత్రికి వెళ్లి చూడాలని డిసైడ్ అవుతారు. అప్పటికే అక్కడ ఉన్న శ్రీనివాస్ చనిపోయింది ముకుందే అని చెప్తాడు. అంతేకాదు, ఆ ఇంట్లో వాళ్లు అందరిపై సీరియస్ అవుతాడు. తర్వాత ఆదర్శ్ మీద కూడా ఆయన కోపాన్ని ప్రదర్శిస్తాడు. ఈ పూర్తి ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

15వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
15వ తేదీ శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ముకుంద చనిపోయిందని బాధతో వచ్చిన శ్రీనివాస్‌కు ఆమె ఇంట్లోనే కనిపిస్తుంది. అంతేకాదు, త్వరలోనే ముఖాన్ని మార్చుకుని మురారికి దగ్గర కావాలని అనుకుంటున్నట్లు తండ్రికి చెబుతుంది. దీంతో అతడు కూడా ఆమెను ఎంకరేజ్ చేస్తాడు. ఇక, తన ఫ్రెండ్‌తో ఆదర్శ్ బాధను వ్యక్తం చేసుకోగా.. అతడు కృష్ణ తప్పిదం వల్లే ముకుంద చనిపోయిందని చెప్తాడు. దీంతో ఆదర్శ్‌కు ఆమెపై కోపం పెరిగిపోతుంది. ఆ వెంటనే ఇంటికి వచ్చిన తర్వాత కృష్ణను నిందిస్తూ ఉంటాడు. అప్పుడామెకు ఇంట్లో వాళ్లు ఆమెకు అండగా నిలిచినా ఆదర్శ్ మాత్రం నమ్మడు. ఈ పూర్తి ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

16వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
16వ తేదీ శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. కృష్ణ ఎంతగా నచ్చజెప్పాలని చూసినా ఆదర్శ్ మాత్రం వినిపించుకోడు. పైగా ఆమెను ఘోరంగా తిడతాడు. మరోవైపు ముకుంద మాత్రం తన ఇంటిని మార్చేసి కొత్త ప్లేస్‌కు వెళ్తుంది. అంతేకాదు, తాను బతికి ఉన్నట్లు తెలియకూడదని తండ్రికి వార్నింగ్ ఇవ్వడంతో పాటు మురారిని పిచ్చోడిని చేయాలని అనుకుంటున్నట్లు చెప్తుంది. తర్వాత ప్లాన్‌లో భాగంగా మురారి ఇంటికి వెళ్తుంది. అక్కడ ఆమెను మురారి చూస్తాడు. కానీ, తర్వాత కనిపించకుండా తప్పించుకుంటుంది. ఇలాగే మురారి తన భ్రమలోనే బతకాలని ముకుంద మరిన్ని వ్యూహాలు రచించుకుంటుంది. ఈ పూర్తి ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

ఈ వారంలో హైలైట్ అయింది ఇదే
మార్చి 11వ తేదీ నుంచి 16వ వరకు సాగిన 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలతో సాగింది. ముఖ్యంగా ఈ వారంలో ముకుంద ఆత్మహత్య చేసుకున్నట్లు చూపించి షాకిచ్చారు. అయితే, ఆమె కావాలనే చనిపోయినట్లు నాటకం ఆడిందని వెంటనే రివీల్ చేశారు. కానీ, ముకుంద రూపాన్ని మార్చుకునే ప్లాన్‌తో కొత్త నాటకానికి తెరలేపడాన్ని హైలైట్ చేశారు. మొత్తానికి మరోసారి భవానీ దేవి ఇంట్లోకి వెళ్లేలా ప్లాన్లు చేయబోతున్నట్లు చెప్పించారు. దీంతో వచ్చే వారం నుంచి ఈ సీరియల్ మరింత రంజుగా మారబోతుంది.


Click it and Unblock the Notifications











