Krishna Mukunda Murari Weekly: పోలీస్ దెబ్బలకు మురారి మృతి.. మళ్లీ ఎంటరైన ముకుంద.. కథలో మలుపులు
జనరేషన్లు మారుతున్నా తెలుగు బుల్లితెరపై సరికొత్త కంటెంట్‌తో చాలా రకాల సీరియళ్లు వస్తున్నాయి. అయితే, అందులో సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటే సీరియళ్లు తక్కువగానే ఉంటున్నాయి. అందులోనూ కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఒకటి. దాదాపు ఏడాది నుంచి ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతూ రంజుగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకూ పెంచేస్తోంది. ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే మార్చి 18వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఈ 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఎలా సాగిందో మీరే లుక్కేయండి!
18వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
18వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ముకుంద కనిపించడంతో మురారి ఆలోచనలో పడతాడు. దీంతో కృష్ణ వచ్చి ఏమైందని అడుగుతుంది. అప్పుడతను ముకుంద విషయంలో తప్పు చేశానా అని బాధపడుతుంటాడు. దీంతో కృష్ణ భర్తను ఓదార్చి ధైర్యం చెప్తుంది. తర్వాత ఆదర్శ్ అన్న మాటలను మధుకు చెప్పడంతో అతడు కోప్పడతాడు. తర్వాత మందు తాగుతుండగా ముకుంద వచ్చి దెయ్యంలా భయపెడుతుంది. తర్వాత మురారిని కూడా ఇబ్బంది పెడుతుంది. అంతేకాదు, కృష్ణను చంపేస్తానంటూ వార్నింగ్ ఇస్తుంది. చివర్లో మురారి, ఆదర్శ్ కొట్టుకుంటుండగా ముకుంద కనిపించి షాక్ ఇస్తుంది. ఈ పూర్తి ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

19వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
19వ తేదీ మంగళవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ఆదర్శ్ మాటలతో బాధపడుతున్న కృష్ణను నందినీ వచ్చి ఓదార్చుతుంది. అప్పుడామె భవానీ తనకు అప్పగించిన బాధ్యతను నిర్వర్తించలేకపోతున్నానని బాధపడుతుంది. దీంతో నందినీ ధైర్యం చెప్తుంది. మధు దెయ్యం గురించి భయపడుతుంటే మురారి ధైర్యం చెప్తాడు. కానీ, ఈ విషయం కృష్ణ దగ్గర దాస్తాడు. అనంతరం నందినీ వెళ్లి ఆదర్శ్‌తో మాట్లాడగా.. అతడు కృష్ణ మీద మరిన్ని నిందలు వేస్తాడు. ఇక, ముకుందను రెచ్చగొట్టాలని మురారి, కృష్ణపై ఇంకా ప్రేమను చూపిస్తుంటాడు. అలా బైక్‌పై వెళ్తున్న వాళ్లకు ప్రమాదం జరుగుతుంది. అది ముకుంద చూస్తుంది. ఈ పూర్తి ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.
20వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
20వ తేదీ బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. బైక్ మీద నుంచి కింద పడిన తర్వాత మురారికి ముకుంద కనిపించడంతో ఆమె నిజంగానే ఆత్మగా మారిందని నమ్ముతాడు. తర్వాత మురారి ఆస్పత్రికి ఫోన్ చేస్తే ముకుంద లిఫ్ట్ చేసి వార్నింగ్ ఇస్తుంది. అంతేకాదు, ఆస్పత్రిలో పని చేసే వ్యక్తితో అబద్ధం కూడా చెప్పిస్తుంది. ఆత్మగా మారినట్లు నమ్మించిన ముకుంద.. ఇక రూపం మార్చుకుని ప్లాన్ బీ అమలు చేయాలని అనుకుంటుంది. ఇంట్లో ఆదర్శ్ మాత్రం తరచూ మురారి వాళ్లను ఏదో ఒక మాట అంటూ రెచ్చగొడుతుంటాడు. అయినా వాళ్లు కోప్పడకుండా కూల్‌గానే ఉంటారు. ఈ పూర్తి ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.
21వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
21వ తేదీ గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ప్లాస్టిక్ సర్జరీ జరిగిన తర్వాత తన ముఖాన్ని చూసుకుని ముకుంద సంతోషిస్తుంటుంది. అప్పుడే తండ్రి వచ్చి ఆమెను గుర్తు పట్టకపోవడంతో ప్లాన్ వర్కౌట్ అవుతుందని అనుకుంటుంది. తర్వాత కృష్ణను అరెస్ట్ చేయించమని తండ్రికి చెబుతుంది. దానికి ఆయన ఓకే అని చెప్పినా.. బయటకు వచ్చిన తర్వాత హోమ్ మినిస్టర్‌ను కలిసి మురారిని లాకప్ డెత్ చేయించమని చెప్తాడు. ఆ తర్వాత పోలీసులు అతడి దగ్గరకు వెళ్లి అరెస్ట్ చేస్తారు. అప్పుడు ముకుంద రాసిన లెటర్‌ను మరణ వాగ్మూలంగా చూపిస్తారు. అది చూసి ఆదర్శ్ మరోసారి అపార్థం చేసుకుంటాడు.

22వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
22వ తేదీ శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ముకుంద మరణ వాగ్మూలం చూసిన తర్వాత ఆదర్శ్ ఇంకా గొడవ చేస్తాడు. దీంతో కృష్ణకు కోపం వస్తుంది. తర్వాత ముకుంద దగ్గరకు తండ్రి రావడంతో చెప్పినట్లు చేశావా అని అడుగుతుంది. కానీ, అతడు మురారిని అరెస్ట్ చేయించి.. కృష్ణను చేయించనట్లుగా అబద్ధం చెప్తాడు. తర్వాత ఇంట్లో మళ్లీ మురారి ప్రస్తావన రావడంతో ఆదర్శ్ రెచ్చిపోతాడు. కృష్ణకు సారీ చెప్పిన అతడు.. మురారిని మాత్రం అపార్థం చేసుకుంటాడు. చివర్లో మురారి కోసం కృష్ణ పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా అక్కడ అతడు కనిపించడు. దీంతో మురారిని ఏదో చేస్తారని ఆమెకు సందేహం వస్తుంది. ఈ పూర్తి ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.
23వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
23వ తేదీ శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. రేవతి ద్వారా మురారి గురించి తెలుసుకున్న భవానీ దేవి.. మినిస్టర్‌కు కాల్ చేసి అతడిని విడిపించమని రిక్వెస్ట్ చేస్తుంది. కానీ, మంత్రి ఆమె విన్నపానికి ఒప్పుకోనని చెప్తాడు. అప్పుడే కానిస్టేబుల్ వచ్చి మురారిని లాకప్ డెత్ చేయించబోతన్నారని చెప్తాడు. దీంతో శ్రీనివాస్ దగ్గరకు కృష్ణ వెళ్తుంది. అప్పుడు ఆమె మాటలు విన్న ముకుంద ఏం జరిగిందని నిలదీయడంతో మురారిని అరెస్ట్ చేయించానని చెప్తాడు. అప్పుడు ముకుంద.. మురారిని వెతుక్కుంటూ పోలీస్ స్టేషన్‌కు వెళ్తుంది. అంతేకాదు, ఎమోషన్‌లో అసలేం జరిగిందో మొత్తం అతడికి నిజం చెప్పేస్తుంది. ఈ పూర్తి ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.
ఈ వారంలో హైలైట్ అయింది ఇదే
మార్చి 18వ తేదీ నుంచి 23వ వరకు సాగిన 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలతో సాగింది. ముఖ్యంగా ఈ వారంలో ముకుంద ఆత్మహత్య తర్వాత ఆదర్శ్ మురారి వాళ్లపై పగ పెంచుకుంటాడు. అదే సమయంలో ముకుంద ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని మురారికి దగ్గర కావాలని ప్లాన్ చేస్తుంది. కానీ, ఆమె తండ్రి మాత్రం మురారిని లాకప్ డెత్ చేయించాలని ప్లాన్ చేస్తాడు. ఇలా ఈ వారంలో అనుకోని ఎన్నో సంఘటనలు జరిగాయి. వచ్చే వారంలో భవానీ దేవి.. ముకుందను తన ఇంటికి తీసుకు రావడంతో ఆసక్తిగా మారనుంది.


Click it and Unblock the Notifications











