Krishna Mukunda Murari Weekly: మురారిని చంపాలని ప్లాన్.. మీరా నాటకంలో ట్విస్ట్.. కృష్ణకు అన్యాయం!

తెలుగు బుల్లితెరపై సరికొత్త కంటెంట్‌తో చాలా రకాల సీరియళ్లు వస్తున్నాయి. అయితే, అందులో సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటే సీరియళ్లు తక్కువగానే ఉంటున్నాయి. అందులోనూ కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఒకటి. దాదాపు ఏడాది నుంచి ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతూ రంజుగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకూ పెంచేస్తోంది. ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే మార్చి 25వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈ 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఎలా సాగిందో మీరే లుక్కేయండి!

25వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
25వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. మురారి గురించి తెలుసుకుని పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ముకుంద అలియాస్ మీరా అతడిని విడిపించాలని హోం మినిస్టర్‌కు ఫోన్ చేసి చెప్తుంది. దీంతో పోలీసులు అతడిని వదిలేస్తారు. అప్పుడు మురారి ఆమె గురించి ఎంక్వైరీ చేసి థ్యాంక్స్ చెప్తాడు. అప్పుడు మీరా తాను ముకుంద ఫ్రెండ్‌ను అని అబద్ధాలు చెబుతుంది. తర్వాత ఆదర్శ్ ఇంటికి వెళ్లి మీరా తనను విడిపించిందని చెప్తాడు. దీంతో కృష్ణకు ఆమెపై డౌట్లు వస్తాయి. తర్వాత ముకుంద రాసిన లెటర్ గురించి అందరూ చర్చించుకుంటారు. ఈ పూర్తి ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

Krishna Mukunda Murari Latest Week roundup story March 25th to 30rd Episodes highlights

26వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

26వ తేదీ మంగళవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. మురారిని విడిపించి వచ్చిన తర్వాత శ్రీనివాస్.. ముకుందను తప్పు చేశావని అంటాడు. అంతేకాదు, ఒక్క రాత్రి ఆగుంటే మురారి చనిపోయేవాడని చెప్తాడు. దీంతో ముకుంద తండ్రిపై సీరియస్ అవుతుంది. అంతేకాదు, అతడిని దూరంగా వెళ్లిపోమని పంపిస్తుంది. ఇక, మురారిని చూస్తూ కృష్ణ నిద్రపోకుండా ఉంటుంది. ఆమె ప్రేమను, మాటలను చూసి మురారి ఎమోషనల్ అవుతాడు. ఇక, మధును ఆదర్శ్ అవమానించేలా మాట్లాడతాడు. అప్పుడే భవానీ వచ్చి అతడిని కొడుతుంది. తర్వాత పోలీసు దెబ్బలు తిన్న మురారిపై భవానీ ప్రేమను చూపిస్తూ మాట్లాడుతుంది.

27వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
27వ తేదీ బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. మురారిని కాపాడిన మీరాకు థ్యాంక్స్ చెప్పేందుకు భవానీ దేవి వెళ్లిందని తెలిసి ఆదర్శ్ కోప్పడతాడు. దీంతో కృష్ణ అతడికి సీరియస్ వార్నింగ్ ఇస్తుంది. తర్వాత భవానీ.. మీరాను వెతుక్కుంటూ వెళ్లగా.. ఆమె దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నట్లు యాక్టింగ్ చేస్తుంది. దీంతో చలించిపోయిన భవానీ ఆమెను తనతో పాటు ఇంటికి వచ్చేయమని అడుగుతుంది. మొదట యాక్టింగ్ చేసినా తర్వాత ఓకే చెప్తుంది. మీరా ఇంటికి వస్తుందన్న విషయం తెలిసి అందరూ ఆమె కోసం ఎదురు చూస్తుంటారు. ఇక, ముకుంద తండ్రిని అతడి స్నేహితులు పరామర్శించేందుకు వస్తారు. ఈ పూర్తి ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

Krishna Mukunda Murari Latest Week roundup story March 25th to 30rd Episodes highlights

28వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

28వ తేదీ గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. నందినీని ఇంట్లో నుంచి వెళ్లిపోమని ఆదర్శ్ అనడంతో మురారి అతడితో గొడవ పడతాడు. తర్వాత కృష్ణ అతడికి సర్ధి చెబుతుంది. దీని తర్వాత ఆ ఇంటికి భవానీ.. మీరాను తీసుకుని వస్తుంది. అప్పుడు అందరికీ పరిచయం చేస్తుంది. ఆదర్శ్ మాత్రం ఆమెను చూసి కోప్పడతాడు. మీరా బ్యాగ్రౌండ్‌పై కృష్ణకు డౌట్ వస్తుంది. కానీ, ఆమె జాలి పడడంతో మురారి జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తాడు. తర్వాత మీరా తన ప్లాన్ ఎలాగైనా వర్కౌట్ చేసుకోవాలని అనుకుంటుంది. ఎలాగైనా కేవలం నెల రోజుల్లో మురారిని తన సొంతం చేసుకోవాలని అనుకుంటుంది. ఈ పూర్తి ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

29వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

29వ తేదీ శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ఆదర్శ్‌ను భోజనానికి పిలవకపోతే ఫీల్ అవుతాడని ఇంట్లో వాళ్లంతా మాట్లాడుకుంటారు. అప్పుడే అతడు అన్న మాటలను భవానీకి రేవతి చెప్తుంది. ఆ తర్వాత అతడు వచ్చి నానా మాటలు అంటాడు. దీంతో మురారి, కృష్ణ వెళ్లిపోబోతారు. అప్పుడు ఆదర్శ్ తాను అనేది మీరా గురించి అని, ఆమెను ఇంటి నుంచి పంపించమని అంటాడు. అదంతా విన్న మీరా.. అక్కడకు వచ్చి యాక్టింగ్ షురూ చేస్తుంది. ఏడుస్తూ తన పరిస్థితి గురించి అబద్దాలు చెప్తుంది. తర్వాత ఆమె స్వయంగా భోజనం వడ్డిస్తుంది. ఆ సమయంలో ముకుందలా చేస్తున్నావని కృష్ణ అడుగుతుంది. ఈ పూర్తి ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

Krishna Mukunda Murari Latest Week roundup story March 25th to 30rd Episodes highlights

30వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

30వ తేదీ శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ముకుంద ఫొటోను తీసేయమని మీరా అడగడంతో భవానీ.. ఆదర్శ్ చేత్తోనే దాన్ని తీయిస్తుంది. ఆ తర్వాత కృష్ణకు ఆమెపై డౌట్ వస్తుంది. దీంతో మురారి ఆమెకు సర్ధి చెబుతాడు. తర్వాత మురారి షర్ట్ కనిపించకపోవడంతో కృష్ణ వాళ్లు వెతుకుతుంటారు. కానీ అప్పుడు ముకుంద దానిలో మురారిని ఊహించుకుని మాట్లాడుతుంటుంది. తర్వాత మీరా తన తండ్రి శ్రీనివాస్‌ను కలుస్తుంది. ఆయన మాత్రం మురారిని చంపితేనే మంచిది అనుకుంటాడు. ఇక, మురారి, కృష్ణ తమకు తరచూ ఏదో ఒక ఇబ్బంది వస్తుండడంతో బాధపడుతుంటారు. ఈ పూర్తి ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

ఈ వారంలో హైలైట్ అయింది ఇదే

మార్చి 25వ తేదీ నుంచి 30వ వరకు సాగిన 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలతో సాగింది. ముఖ్యంగా ఈ వారంలో మీరాగా మారిన ముకుంద.. మురారిని విడిపించడంతో పాటు ప్లాన్ ప్రకారం ఆ ఇంట్లోకి చేరింది. అక్కడ తాను అనాథను అని అందరినీ నమ్మించింది. ఇలా నెల రోజుల్లోనే మురారిని తన సొంతం చేసుకోవాలని అనుకుంటుంది. కానీ, శ్రీనివాస్ మాత్రం మురారిని ఏదైనా చేస్తేనే ముకుంద తనకు దక్కుతుందని అనుకుంటాడు. దీంతో వచ్చే వారం ఈ సీరియల్ మరింత ఆసక్తికరంగా సాగబోతున్నట్లు అర్థం అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X