Krishna Mukunda Murari Weekly: మురారి సంచలన నిర్ణయం.. మీరాకు కోలుకోలేని షాక్.. మలుపు తిరిగిన కథ

చాలా భాషల కంటే తెలుగు బుల్లితెరపై సరికొత్త కంటెంట్‌తో చాలా రకాల సీరియళ్లు వస్తున్నాయి. అయితే, అందులో సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటే సీరియళ్లు తక్కువగానే ఉంటున్నాయి. అందులోనూ కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఒకటి. దాదాపు ఏడాది నుంచి ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతూ రంజుగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకూ పెంచేస్తోంది. ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే మార్చి 31వ తేదీ నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు ఈ 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఎలా సాగిందో మీరే లుక్కేయండి!

31వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో:31వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ఇంట్లో వాళ్లందరూ ఆదర్శ్‌కు వ్యతిరేకంగా మాట్లాడతారు. దీంతో అతడు సీరియస్ అవడంతో భవానీ కూడా నిలదీస్తుంది. అప్పుడతను ఇంటిని తన పేరిట రాసివ్వమని, అప్పుడు ఇంట్లో ఎవరు ఉండాలో.. ఎవరు వెళ్లిపోవాలో డిసైడ్ చేస్తానని అంటాడు. దీంతో భవానీ అతడిని కొడుతుంది. అప్పుడు మీరా.. ఆదర్శ్‌ను తీసుకుని గదిలోకి వెళ్లి మందు తాగిపిస్తూ తనవైపు తిప్పుకోవాలని చూస్తుంది. తర్వాత మురారి వస్తే అతడిని కూడా బుట్టలో వేసుకోవాలని ప్లాన్ చేస్తుంది. ఇక, ఆదర్శ్ ప్రవర్తనపై భవానీ బాధపడుతుండగా.. కృష్ణ ఆమెకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఈ పూర్తి ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

Krishna Mukunda Murari Latest Week roundup story March 31st to April 5th Episodes highlights

01వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో:01వ తేదీ మంగళవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చనందుకు భవానీకి కృష్ణ సారీ చెప్తుంది. అప్పుడే భవానీ ఆడబిడ్డ రజినీ, ఆమె కూతురు సంగీత వస్తారు. ఆమె ముకుంద చనిపోవడం గురించి, ఆదర్శ్ తాగుబోతు అవడం గురించి అవమానించేలా మాట్లాడుతుంది. దీంతో కృష్ణకు కోపం వచ్చి అరవగా.. రజినీ కౌంటర్ ఇస్తుంది. వాళ్లను చూసి ముకుంద తనకు అనుకూలంగా మార్చుకోవాలని ప్లాన్ చేస్తుంది. రజినీ తన కూతురు సంగీతను ఆదర్శ్‌కు దగ్గర చేయాలని భావిస్తుంది. అందుకు అతడి దగ్గరకు పంపించగా.. సంగీతపై సీరియస్ అయి పంపించేస్తాడు. ఈ పూర్తి ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

02వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో:02వ తేదీ బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. రజినీ ఓవర్‌గా మాట్లాడితే ఆమెకు కృష్ణ కౌంటర్లు వేస్తుంది. దీంతో సంగీతను వెళ్లి ఆదర్శ్‌ను మంచి చేసుకోమని చెప్తుంది. అది విన్న ముకుంద 'ఆదర్శ్ ఈ సంగీతకు కనెక్ట్ అయితే.. రేపు నేను ముకుంద అని తెలిసినా నాకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది' అని మనసులో అనుకుంటుంది. తర్వాత రజినీతో మీరా చేతులు కలుపుతుంది. అనంతరం మీరా తన తండ్రి శ్రీనివాస్‌తో మాట్లాడుతుంటే కృష్ణ వింటుంది. కానీ, ఆయన తన పాత ఇంటి ఓనర్ అని అబద్ధం చెప్తుంది. సంగీతకు మధు లైన్ వేయడం మొదలు పెడతాడు. ఈ పూర్తి ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

Krishna Mukunda Murari Latest Week roundup story March 31st to April 5th Episodes highlights

03వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో:03వ తేదీ గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. చనిపోయిన ముకుందకు పిండ ప్రదానం చేసి ఆత్మ శాంతింపజేయాలని రేవతి అనుకుంటుంది. అలాగే, శ్రీనివాస్‌ను కూడా పిలుద్దామని భవానీతో చెప్తుంది. కానీ, ఎవరూ దానికి రావని చెప్తారు. తర్వాత ముకుంద ఆత్మ అద్దంలో కనిపించి మీరాతో మాట్లాడుతుంది. ఆ తర్వాత ముకుందకు పిండ ప్రదానం చేయడానికి శ్రీనివాస్ ఇబ్బంది పడుతుంటాడు. అంతేకాదు, తన కూతురు బతికే ఉందని అంటాడు. అప్పుడు మీరా వచ్చి కవర్ చేసే ప్రయత్నం చేస్తుంది. అలాగే, తనకు పిండ ప్రదానం చేయమని తండ్రితో అంటుంది. దీంతో ఆయన ఇబ్బంది పడుతూనే పని చేస్తాడు.

04వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో:04వ తేదీ శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ముకుందకు పిండ ప్రదానం చేసిన తర్వాత శ్రీనివాస్.. మీరాను తన కూతురు అంటూ మాట్లాడతాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. తర్వాత ఆదర్శ్ వచ్చి మీరాకు ముకుంద పేరు పెడతానని అంటాడు. అంతేకాదు, ఇంట్లో వాళ్లు కూడా అలానే పిలవాలని చెప్తాడు. కానీ, దీనికి ఎవరూ అంగీకరించరు. అప్పుడు మీరా యాక్టింగ్ షురూ చేస్తుంది. ఇంట్లో వాళ్లను నమ్మించే ప్రయత్నం చేస్తుంది. ఇక, రజినీ.. కృష్ణను అవమానించేలా మాట్లాడుతుంటే భవానీ కోడలికి సపోర్ట్ చేస్తుంది. చివర్లో సంగీతను రజినీ తిడుతుండగా.. వాళ్లకు సపోర్ట్ చేస్తానని మీరా హామీ ఇస్తుంది. ఈ పూర్తి ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

Krishna Mukunda Murari Latest Week roundup story March 31st to April 5th Episodes highlights

05వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో:05వ తేదీ శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. మందు తాగొద్దని చెప్పిన మురారిపై ఆదర్శ్ సీరియస్ అవుతాడు. అంతేకాదు, తన కళ్ల ముందు తిరగడానికి సిగ్గు లేదా అన్నట్లుగా మాట్లాడతాడు. పరోక్షంగా మురారి, కృష్ణను ఇంట్లో నుంచి వెళ్లిపోమని అంటాడు. ఇదంతా విని భవానీ దేవి బాధపడుతుంది. అప్పుడు మీరా అన్నదమ్ములను కలుపుతాను అంటూ ఆమెకు హామీ ఇస్తుంది. అయితే, తనకు వచ్చిన ఛాన్స్‌ను వినియోగించుకుంటూ మురారి మంచోడని, కృష్ణే మొత్తం చేసిందని ఆదర్శ్‌కు చెబుతుంది. మురారి మాత్రం ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకుంటాడు. ఈ పూర్తి ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

ఈ వారంలో హైలైట్ అయింది ఇదే:మార్చి 31వ తేదీ నుంచి ఏప్రిల్ 5వ వరకు సాగిన 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలతో సాగింది. ముఖ్యంగా ఈ వారంలో రజినీ వాళ్లు ఆదర్శ్‌ను లైన్‌లో పెట్టాలని ప్లాన్ చేయడం చూపించారు. అలాగే, మీరా.. సంగీత - ఆదర్శ్‌ను కలపాలని అనుకోవడం.. ఆ తర్వాత కృష్ణను నిందితురాలు చేయాలని డిసైడ్ అవడాన్ని హైలైట్ చేశారు. కానీ, ఆమె ప్లాన్ మొత్తం పాడైపోయేలా మురారి ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకున్నాడు. దీంతో ఈ సీరియల్ కథ మరిన్ని మలుపులు తిరగబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X