Krishna Mukunda Murari Weekly: శోభనం గదిలో ఊహించని ఘటన.. ఇంట్లో వాళ్లకు తెలిసిన నిజం.. బిగ్ ట్విస్ట్

గతంలో కంటే ఈ మధ్య కాలంలో తెలుగు బుల్లితెరపై సరికొత్త కంటెంట్‌తో చాలా రకాల సీరియళ్లు వస్తున్నాయి. అయితే, అందులో సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటే సీరియళ్లు తక్కువగానే ఉంటున్నాయి. అందులోనూ కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఒకటి. దాదాపు ఏడాది నుంచి ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతూ రంజుగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకూ పెంచేస్తోంది. ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే మార్చి 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఈ 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఎలా సాగిందో మీరే లుక్కేయండి!

04వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
04వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. భార్యభర్తలు ఇద్దరూ ఒకరి పాదాలపై ఒకరి పాదాలు పెట్టి ప్రదక్షిణలు చేయాలని పంతులు చెబుతాడు. దీంతో ముకుంద తప్పించుకోవడానికి ప్లాన్లు చేస్తుండగా.. మురారి, కృష్ణ మాత్రం వాళ్లిద్దరిని ఇంకా గట్టిగా పట్టుకోమని బలవంతపెడతారు. చివరకు తన చేతికి ఉన్న గాజులను పగలగొట్టి వేయగా.. అవి ఆదర్శ్‌కు గుచ్చుకుంటాయి. దీంతో అతడు ప్రదక్షిణలు ఆపేస్తాడు. ఆ తర్వాత కాయిన్ నిలబెట్టి కోరికలు కోరుకోమంటే ముకుంద.. మురారి తన సొంతం కావాలని అనుకుంటుంది. ఈ పూర్తి ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

Krishna Mukunda Murari Latest Week roundup story March 4th to 9th Episodes highlights

05వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
05వ తేదీ మంగళవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. మురారి తన సొంతం కావాలని ముకుంద పెట్టిన కాయిన్ నిలబడడంతో ఆమె సంతోషంగా ఉంటుంది. కానీ, కృష్ణ మాత్రం తన కాయిన్ నిలబడకపోవడంతో బాధ పడిపోతుంది. తర్వాత ముకుంద వచ్చి మురారితో మాట్లాడుతుండగానే ఆమె కాయిన్ కింద పడిపోయి ఉంటుంది. తర్వాత మురారి వాళ్లు రెస్టారెంట్‌కు వెళ్లగా అక్కడ వెయిటర్ తన శోభనం గురించి శాడ్ స్టోరీ చెప్తాడు. దీంతో ఆదర్శ్‌కు కూడా అలాగే అవుతుందని అనుకుంటారు. ఇక, ఇంటికొచ్చిన తర్వాత ముకుంద తీరు చూసి మధు, రేవతికి డౌట్ వస్తుంది. చివర్లో మురారి తనను కొట్టాడని కృష్ణ షాకిస్తుంది.

06వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
06వ తేదీ బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. మురారి తనను కొట్టాడని కృష్ణ అందరికీ చెప్తుంది. దీంతో అతడితో పాటు ఇంట్లో వాళ్లూ షాక్ అవుతారు. తర్వాత మురారి వెళ్లి కృష్ణను అడగ్గా.. ముకుంద విషయాన్ని డైవర్ట్ చేయడానికి అబద్ధం చెప్పానని అంటుంది. అనంతరం వీళ్లిద్దరూ ఆదర్శ్ గురించి జాలిగా మాట్లాడుకుంటారు. ముకుంద ఎంతకైనా తెగిస్తుందని, వెంటనే శోభనం ఆపేయాలని ప్లాన్ చేస్తారు. ఈ విషయం చెప్పడానికి ఆదర్శ్ దగ్గరకు మురారి వెళ్తాడు. అప్పుడు అతడు ఎమోషనల్‌గా మాట్లాడడంతో పాటు ముకుంద వీళ్లను చూడడంతో మురారి వెనక్కి వచ్చేస్తాడు. ఈ విషయాన్ని తర్వాత కృష్ణకు చెబుతాడు. ఈ పూర్తి ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

07వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
07వ తేదీ గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. కృష్ణ వాళ్ల ఫస్ట్ నైట్ ఆపేసి.. దాని ద్వారా తన శోభనం కూడా ఆపేయాలని ముకుంద ప్లాన్ చేస్తుంది. ఇందుకోసం కృష్ణకు దురదలు వచ్చే పౌడర్‌ను ఇవ్వాలని అనుకుంటుంది. అయితే, ఈ విషయం మురారికి తెలిసిపోతుంది. అప్పుడతను ముకుందకు క్లాస్ పీకుతాడు. మంచిగా ఆదర్శ్‌తో కాపురం చేసుకోమని అంటాడు. కానీ, ముకుంద మాత్రం తనకు మురారినే కావాలని గొడవ చేస్తుంది. ఇక, ఆదర్శ్‌తో మాట్లాడేందుకు కృష్ణ వెళ్లగా.. అతడు ఎమోషనల్‌గా మాట్లాడతాడు. దీంతో ఏమీ చెప్పకుండానే కృష్ణ తిరిగి వస్తుంది. తర్వాత ముకుంద శోభనం కోసం రెడీ అవుతుంది. ఈ పూర్తి ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

Krishna Mukunda Murari Latest Week roundup story March 4th to 9th Episodes highlights

08వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
08వ తేదీ శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. శోభనం కోసం ముకుంద చక్కగా రెడీ అవడంతో రేవతి మురిసిపోతుంది. అంతేకాదు, ఓ బిడ్డను కని భవానీకి గిఫ్టుగా ఇవ్వాలని చెబుతుంది. కానీ, ఆమె మాత్రం మనసులో తాను ఎప్పటికైనా మురారితోనే బిడ్డను కంటాను అని అనుకుంటుంది. ముకుంద వేసిన పౌడర్ డబ్బా ప్లాన్‌ గురించి మురారి.. కృష్ణకు చెప్పేస్తాడు. దీంతో ఆమె ముకుంద శోభనం గదిలో ఆదర్శ్‌కు నిజం చెప్పేస్తుందేమో అని భయపడిపోతుంది. ఆ తర్వాత పాల గ్లాస్‌తో ముకుంద గదిలోకి వస్తుంది. అప్పుడు ఆదర్శ్ పాలు తీసుకోబోతే వాటిని పక్కన పెట్టేస్తుంది. ఈ పూర్తి ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

09వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
09వ తేదీ శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. పాల గ్లాస్‌తో శోభనం గదిలోకి వచ్చిన ముకుంద.. ఆదర్శ్‌కు వరుసగా షాక్‌లు ఇస్తుంది. అంతేకాదు, ఏది చెప్పినా మురారి ముందే చెప్పాడని అంటుంది. చివరికి పాలు సగం తాగి ఇవ్వబోయే మురారి ఇస్తే సంతోషంగా తాగేదాన్ని అంటుంది. దీంతో ఆదర్శ్ గుండె పగిలిపోతుంది. తర్వాత కళ్ల ముందే అతడు ఉండడం వల్ల మారలేకపోయానని చెబుతుంది. దీంతో ఆదర్శ్ మరి నా జీవితంతో ఎందుకు ఆడుకున్నారు అని నిలదీస్తాడు. తర్వాత బయటకు వచ్చి నానా రచ్చ చేస్తాడు. రేవతి ప్రశ్నించగా ముకుంద గురించి నిజాన్ని చెప్పేస్తాడు.

ఈ వారంలో హైలైట్ అయింది ఇదే
మార్చి 4వ తేదీ నుంచి 9వ వరకు సాగిన 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలతో సాగింది. ముఖ్యంగా ఈ వారంలో మురారి, ఆదర్శ్ జంటలకు శోభనం జరిపించడాన్నే ఎక్కువగా హైలైట్ చేశారు. ఫస్ట్ నైట్ ఆపమని ముకుంద డిమాండ్ చేసినా మురారి మాత్రం కొత్త ప్లాన్లతో రావడాన్ని చూపించారు. మొత్తానికి శోభనం గదిలో ముకుంద.. ఆదర్శ్‌కు నిజం చెప్పేయడం హైలైట్ చేశారు. వచ్చే వారం జరగబోయే ఎపిసోడ్‌లో ముకుంద అందరి ముందు నిజం చెప్పడాన్ని చూపించబోతున్నారు. దీంతో ఇది మరింత రంజుగా మారనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X