Krishna Mukunda Murari Weekly: పెళ్లికి ముందు మీరా షాక్.. కడుపులో బిడ్డను చంపాలని.. కృష్ణ ఏం చేసింది?
సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై సరికొత్త కంటెంట్‌తో చాలా రకాల సీరియళ్లు వస్తున్నాయి. అయితే, అందులో సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటే సీరియళ్లు తక్కువగానే ఉంటున్నాయి. అందులోనూ కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఒకటి. దాదాపు ఏడాది నుంచి ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతూ రంజుగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకూ పెంచేస్తోంది. ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే మే 13వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఈ 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఎలా సాగిందో మీరే లుక్కేయండి!
13వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
13వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. మీరాను చెక్ చేసిన తర్వాత అమృత కూడా వీక్‌నెస్ వల్లే పడిపోయిందని అబద్ధం చెప్తుంది. తర్వాత వీళ్లిద్దరూ మాట్లాడుకుంటారు. అప్పుడు కృష్ణ.. మీరా ప్రెగ్నెంట్ అవడానికి ఆదర్శే కారణం అంటుంది. అంతేకాదు, వాళ్లిద్దరికీ పెళ్లి జరిపించాలని అనుకుంటుంది. మరోవైపు మీరా తను గర్భవతి కాలేదా అని డౌట్ పడుతుంది. మురారి కూడా అదే ఆలోచిస్తుండగా.. కృష్ణ వచ్చి నిజం చెప్తుంది. అప్పుడు మురారి సరోగసి మదర్ మీరానే అని నిజం చెప్తాడు. దీంతో కృష్ణ అతడితో మీరా ఏదో చెడు ఉద్దేశంతోనే అలా చేస్తుందని, ఆదర్శ్ ఆమెను ప్రేమిస్తున్నాడని అంటుంది.

14వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
14వ తేదీ మంగళవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. మీరాను ఆదర్శ్ ప్రేమిస్తున్నాడని, వాళ్లిద్దరికి పెళ్లి చేద్దాం అని మురారితో కృష్ణ చెప్తుంది. దీంతో అతడు కోప్పడతాడు. అప్పుడు తనకు చెప్పకుండా సరోగసికి ఎందుకు ఒప్పుకున్నారని కృష్ణ నిలదీస్తుంది. దీంతో ఆమెను ఒప్పించేలా మురారి ప్రయత్నిస్తాడు. మీరా తనను చూసి సిగ్గు పడడంతో ఆమెకు ప్రపోజ్ చేయాలని ఆదర్శ్ ప్లాన్ చేసుకుంటాడు. ఆ విషయాన్ని మురారికి వెళ్లి చెప్తాడు. అప్పటి నుంచి అతడిలో టెన్షన్ పెరుగుతుంది. అనంతరం మీరాను కృష్ణ సూటి ప్రశ్నలతో ఇబ్బంది పెడుతుంది. దీంతో మీరా ఆమెను గొడ్రాలు అంటూ అవమానిస్తుంది. ఈ పూర్తి ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.
15వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
15వ తేదీ బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ముకుందకు, ఆదర్శ్‌కు పెళ్లి చేద్దాం అని చెప్పగానే కృష్ణ వద్దు అంటుంది. దీంతో భవానీ, రేవతి ఏమైందని ప్రశ్నిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తారు. అప్పుడు కృష్ణ వాళ్లను అడిగి ఒప్పుకుంటే చేద్దాం అని కవర్ చేస్తుంది. తర్వాత ఇదే విషయం మురారికి చెప్పడంతో అతడు టెన్షన్ పడతాడు. ఇక, ముకుంద పుట్టినరోజు సందర్భంగా ఆదర్శ్ ఆమెకు లవ్ సింబల్ ఇచ్చి విషెస్ చెప్తాడు. అది చూసి ముకుంద సిగ్గు పడడంతో వీళ్లకు పెళ్లి చేయాలనుకున్న విషయం భవానీ చెప్తుంది. అప్పుడు వాళ్లు ఒప్పుకున్నట్లు సైగలు చేస్తారు. దీంతో ముకుందను పిలిచి మురారి క్లాస్ పీకుతాడు. ఈ పూర్తి ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.
16వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
16వ తేదీ గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. తనతో మాట్లాడేందుకు వచ్చిన మురారి, కృష్ణను పెళ్లి ఆపాల్సిన బాధ్యత మీదే అంటూ ముకుంద తేల్చేస్తుంది. దీంతో వాళ్లకు టెన్షన్ పెరిగిపోతుంది. అలా ఇద్దరూ భయపడుతుండగా ముకుంద రాక్షసానందం పొందుతుంది. అంతేకాదు, ఇంకా ఇంకా నరకం చూపించాలని అనుకుంటుంది. అనంతరం మధు, సంగీతకు మంచి చెప్తుంటే అపార్థం చేసుకున్న రజినీ అతడిని కొడుతుంది. దీంతో సంగీత తల్లికి ఎదురు తిరుగుతుంది. ముకుంద, ఆదర్శ్ పెళ్లికి ముహూర్తం పెట్టడానికి పంతులు వస్తాడు. అప్పుడు పెళ్లి బాధ్యతను భవానీ.. కృష్ణ వాళ్లకు అప్పగిస్తుంది. ఈ పూర్తి ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.
17వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
17వ తేదీ శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ఇంటికి వచ్చిన పంతులు పెళ్లి వారంలోనే జరిగేలా ముహూర్తం పెడతాడు. దీంతో ఆదర్శ్ సంతోషిస్తుండగా కృష్ణ వాళ్లు టెన్షన్ పడుతుంటారు. దీంతో పెళ్లిని ఆపాలన్న బాధ్యతను కృష్ణ, మురారిదేనని ముకుంద తేల్చి చెప్తుంది. అంతేకాదు, భవానీ దేవి కోసం ఈ పెళ్లికి ఒప్పుకున్నట్లు కవర్ చేస్తుంది. కానీ, ముకుంద తీరు చూసిన కృష్ణకు డౌట్ వస్తుంది. అయితే, ఆమెను మురారి సపోర్ట్ చేస్తాడు. అనంతరం ముకుందకు వాంతులు అవుతాయి. అప్పుడు మురారి ఆమెకు సాయం చేస్తాడు. ఇది చూసిన వాళ్లకు ముకుంద ప్రెగ్నెంట్ అయిందన్న సందేహం వస్తుంది. ఈ పూర్తి ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.
18వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
18వ తేదీ శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. మీరా వాంతులు చేసుకుంటుంటే సాయం చేసినందుకు కృష్ణ అలుగుతుందేమో అని మురారి ఆమెకు వివరణ ఇస్తుంటాడు. కానీ, తానేమీ ఫీల్ కాలేదని కృష్ణ చెప్తుంది. అనంతరం భవానీ దేవి.. కృష్ణను పిలిచి ముకుంద కడుపుతో ఉందని అంటుంది. ఇందుకోసం ఆమెను ఒకసారి చెక్ చేయమని కృష్ణతో చెప్తుంది. ఈ విషయం మురారికి చెప్పడంతో అతడు చెక్ చేసి అబద్ధం చెప్పమని అంటాడు. అనంతరం ముకుంద ఇంట్లో కనిపించకపోవడంతో ఆదర్శ్ టెన్షన్ పడుతూ ఉంటాడు. అలా అందరూ ఆమెను వెతుకుతుండగా కృష్ణకు ఫోన్ చేసి రెస్టారెంట్‌కు రమ్మని చెబుతుంది. ఈ పూర్తి ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.
ఈ వారంలో హైలైట్ అయింది ఇదే
మే 13వ తేదీ నుంచి 18వ వరకు సాగిన 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలతో సాగింది. ముఖ్యంగా ఈ వారంలో ముకుంద ప్రెగ్నెంట్ అన్న విషయం భవానీ అర్థం చేసుకోవడంతో రసవత్తరంగా మారింది. అంతేకాదు, ముకుంద కూడా పెళ్లి విషయంలో కృష్ణ వాళ్లను బ్లాక్ మెయిల్ చేయడాన్ని హైలైట్ చేసి చూపించారు. ఇలా ఈ వారంలో ముకుందదే పైచేయి అన్నట్లుగా సీరియల్ నడిచింది. ఇక, వచ్చే వారంలో కడుపులోని బిడ్డను చంపేస్తానని ముకుంద బెదిరిస్తుంది. దీంతో ఇది మరింత రంజుగా మారబోతుంది.


Click it and Unblock the Notifications











