Krishna Mukunda Murari Weekly: కడుపు చేసింది మురారినే.. నిజాలన్నీ బట్టబయలు.. సీరియల్‌లో బిగ్ ట్విస్ట్

తెలుగు బుల్లితెరపై సరికొత్త కంటెంట్‌తో చాలా రకాల సీరియళ్లు వస్తున్నాయి. అయితే, అందులో సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటే సీరియళ్లు తక్కువగానే ఉంటున్నాయి. అందులోనూ కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఒకటి.

దాదాపు ఏడాది నుంచి ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతూ రంజుగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకూ పెంచేస్తోంది. ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే మే 20వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఈ 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఎలా సాగిందో మీరే లుక్కేయండి!

Krishna Mukunda Murari Latest Week roundup story May 20th to 25th Episodes highlights

20వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
20వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. తన పిలుపు మేరకు వచ్చిన కృష్ణ, మురారికి ముకుంద ఒక లెటర్ ఇస్తుంది. అందులో అబార్షన్ చేయించుకున్నట్లు రాసి ఉంటుంది. అది చూసిన కృష్ణ తల్లడిల్లిపోతూ ఆమెపై ఫైర్ అవుతుంది. మురారి కూడా ఆమెను తిడతాడు. అప్పుడు ముకుంద.. కృష్ణ బాగు కోసమే తాను ఇలా చేసినట్లు వివరిస్తుంది. కానీ, వాళ్లు మాత్రం వినిపించుకోరు. దీంతో మురారి.. కృష్ణను ఓదార్చుతాడు. ఇక, తన కూతురితో ఆదర్శ్ పెళ్లి చేయాలని భవానీ దేవితో రజినీ గొడవకు దిగుతుంది. కానీ, ఆమె మాత్రం సంగీతతో ఆదర్శ్‌కు పెళ్లి ఇష్టం లేకుండా ఏమీ చేయలేనని తేల్చి చెప్పేస్తుంది. ఈ పూర్తి ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

21వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

21వ తేదీ మంగళవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ఇంటికి వచ్చిన తర్వాత అందరూ కింద కూర్చుని భోజనం చేస్తుంటే కృష్ణ కూడా అలాగే చేయబోతుంది. కానీ, భవానీ వద్దంటుంది. అప్పుడు ముకుంద వచ్చి తన పెళ్లిని ఎలా అయినా ఆపాలని, లేకపోతే మొత్తం బయటపెడతానని కృష్ణను బెదిరిస్తుంది. దీంతో కృష్ణ కళ్లు తిరిగి పడిపోతుంది. అప్పుడు అందరూ కంగారు పడుతుంటే తనకు ఏమీ కాలేదని అంటుంది. అనంతరం ముకుంద తీరుపై మురారికి డౌట్లు వస్తాయి. కావాలనే తను ఇలా చేస్తుందని అనుకుంటాడు. ఇక, ముకుంద తనకు నచ్చింది కాకుండా మురారికి నచ్చిన చీర తీసుకోవడంతో ఆదర్శ్ ఫీల్ అవుతాడు. ఈ పూర్తి ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

Krishna Mukunda Murari Latest Week roundup story May 20th to 25th Episodes highlights

22వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

22వ తేదీ బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. మీరా మీద డౌట్లు రావడంతో కృష్ణ ఆమె రూమ్‌లోకి వెళ్లి వెతుకుతుంది. అప్పుడామెకు కడుపులో బిడ్డ ఎదుగుదల కోసం వాడే ట్యాబ్లెట్లు కనిపిస్తాయి. దీంతో అసలు తను అబార్షన్ చేయించుకోలేదని నిజం తెలుస్తుంది. ఆ విషయం మురారికి చెప్పడంతో అతడికి ఎన్నో సందేహాలు వస్తాయి. తర్వాత మీరాను కృష్ణ షాపింగ్‌కు వెళ్దాం అని రెస్టారెంట్‌కు తీసుకు వస్తుంది. అక్కడ ఆమెతో నిజం చెప్పించాలని తాము మరోసారి సరోగసికి వెళ్తున్నామని అబద్ధం చెప్తుంది. అయినా మీరా నోరు మెదపకపోవడంతో లాగి పెట్టి చెంప మీద ఒకటి ఇచ్చేస్తుంది. ఈ పూర్తి ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

23వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

23వ తేదీ గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. మాట్లాడేందుకు వచ్చిన మీరాను తన ప్రశ్నలతో కృష్ణ ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. తర్వాత సరోగసికి వెళ్తున్నట్లు చెప్తుంది. దీంతో మీరా కంగారు పడుతుంది. అప్పుడు ఆమె చెంప పగలగొట్టిన కృష్ణ.. తమ బిడ్డ సేఫ్‌గా ఉందన్న నిజం తెలిసిందని అంటుంది. అయితే, ఆ వెంటనే తాను మీరాను కాదని, ముకుందను అన్న నిజాన్ని కూడా కృష్ణకు చెప్తుంది. అంతేకాదు, నీ గర్భాన్ని నేనే పోగొట్టానని, మురారి కోసమే ఇలా చేస్తున్నానని తన పన్నాగాన్ని బయటపెడుతుంది. దీంతో భయపడిన కృష్ణ.. మీరాను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత తమదే మురారితో అంటుంది. ఈ పూర్తి ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

24వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

24వ తేదీ శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. కృష్ణ తన పుట్టింటికి వెళ్తుంది. ఆమెను చూసి బాబాయి గొడవలు ఏమైనా పెట్టుకుని వచ్చావా అని అడుగుతుంది. కానీ, వాళ్లకు అబద్దాలు చెప్తుంది. తర్వాత కృష్ణ తన పుట్టింటికి వెళ్లిందని ఇంట్లో వాళ్లు మాట్లాడుతుంటే ముకుంద విని సంతోష పడుతుంది. అనంతరం ముకుంద, ఆదర్శ్‌ పెళ్లి సందర్భంగా ప్రీ వెడ్డింగ్ షూట్ చేయించేందుకు ఫొటోగ్రాఫర్‌ను మధు తీసుకు వస్తాడు. తర్వాత కృష్ణకు ఫోన్ చేసిన భవానీ.. ప్రభాకర్‌కు నిజాలన్నీ చెప్తుంది. అనంతరం ముకుంద ఇంట్లో కళ్లు తిరిగి పడిపోతుంది. అప్పుడు డాక్టర్ చెక్ చేయగా.. ఆమె ప్రెగ్నెంట్ అన్న విషయం బయటపడుతుంది.

Krishna Mukunda Murari Latest Week roundup story May 20th to 25th Episodes highlights

25వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
25వ తేదీ శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ముకుంద ప్రెగ్నెంట్ అని తెలుసుకున్న భవానీ కోపం వచ్చి ఆదర్శ్ చెంప చెల్లుమణిపిస్తుంది. అంతేకాదు, పెళ్లికి ఒప్పుకున్నా కూడా ఎందుకు తొందరపడి ముకుందను ప్రెగ్నెంట్ చేశావని ప్రశ్నిస్తుంది. దీంతో ఆదర్శ్ తనకు దీనికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తాడు. ఆ తర్వాత అందరూ కలిసి కడుపు రావడానికి కారణం ఎవరని ముకుందను ప్రశ్నించగా.. ఆమె మురారి అని అబద్దం చెప్తుంది. దీంతో ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు. అంతేకాదు, ఆదర్శ్ అయితే అది నిజమే అని నమ్మేసి మురారిని అపార్థం చేసుకుంటాడు. తర్వాత మురారి ఇంట్లో కనిపించకపోవడంతో నిజమే అని అంతా నమ్ముతారు. ఈ పూర్తి ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

ఈ వారంలో హైలైట్ అయింది ఇదే

మే 20వ తేదీ నుంచి 25వ వరకు సాగిన 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలతో సాగింది. ముఖ్యంగా ఈ వారంలో మీరానే ముకుంద అన్న నిజం కృష్ణకు తెలిసిపోతుంది. తర్వాత ఆమె కడుపుతో ఉన్న విషయం కూడా చెబుతుంది. అంతేకాదు, తన కడుపునకు కారణం మురారినే అని చెప్పి మీరా పెద్ద ట్విస్టునే ఇచ్చింది. దీంతో వచ్చే వారం ఈ సీరియల్ మరింత రసవత్తరంగా సాగబోతున్నట్లు అర్థం అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X