Krishna Mukunda Murari Weekly: నిజాలన్నీ బట్టబయలు.. అడ్డంగా దొరికిపోయిన మీరా.. మురారి చనిపోయాడా?

వేరే భాషలను పోల్చి చూసుకుంటే తెలుగు బుల్లితెరపై సరికొత్త కంటెంట్‌తో చాలా రకాల సీరియళ్లు వస్తున్నాయి. అయితే, అందులో సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటే సీరియళ్లు తక్కువగానే ఉంటున్నాయి. అందులోనూ కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఒకటి. దాదాపు ఏడాది నుంచి ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతూ రంజుగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకూ పెంచేస్తోంది. ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే మే 27వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు ఈ 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఎలా సాగిందో మీరే లుక్కేయండి!

27వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
27వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. మురారి ఇంట్లో కనిపించకపోవడంతో అతడు నిజంగానే తప్పు చేశాడని ఆదర్శ్ అనుకుంటాడు. అంతేకాదు, నోటికి వచ్చినట్లు తిడతాడు. అప్పుడు ఆడవాళ్లంతా మురారికి సపోర్ట్ చేస్తారు. ఆ సమయంలో రజినీ.. ముకుందను అనుమానిస్తుంది. దీంతో ఆమె అబద్దాల మీద అబద్దాలు చెప్తుంది. అంతేకాదు, అవసరం అయితే డీఎన్ఏ టెస్ట్ కూడా చేయించుకుంటానని అంటుంది. అనంతరం భవానీ దేవి.. కృష్ణ దగ్గరకు వెళ్తుంది. ఆమె మురారి గురించి అడిగితే అబద్దం చెబుతుంది. ఇక, ముకుంద తన కడుపును అడ్డం పెట్టుకుని పని చేయించుకోవాలని ప్లాన్ చేస్తుంది. ఈ పూర్తి ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

Krishna Mukunda Murari Latest Week roundup story May 27th to June 1st Episodes highlights

28వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
28వ తేదీ మంగళవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. మీరా మీద అందరూ అనుమానంగా మాట్లాడుతుండడంతో ఆమె ఎదురు తిరుగుతుంది. అంతేకాదు, మురారిని దోషిని చేసి మాట్లాడుతుంది. అప్పుడు ఆదర్శ్ మందు తాగి కోపంగా గన్ తీసుకుని వస్తాడు. ఆమెను చంపడానికి కాలుస్తాడు. కానీ, అంతలోనే అందరూ అడ్డుకోవడంతో ఆమె తప్పించుకుంటుంది. తర్వాత ప్రభాకర్ ఇంటికి వెళ్లిన భవానీ వాళ్లు బ్రతిమాలడంతో అక్కడే ఉండిపోతుంది. అక్కడ జరిగే జాతర కోసం రెడీ అవుతుండగా కృష్ణ కళ్లు తిరిగిపడిపోతుంది. దీంతో మురారి గురించిన నిజం అతడికి చెప్పకూడదని భవానీ డిసైడ్ అయిపోతుంది. ఈ పూర్తి ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

29వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
29వ తేదీ బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. జాతరకు వెళ్లిన కృష్ణ.. మురారి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అతడికి ఏమైనా అయిందా అని డౌట్ పడుతుంది. అదే సమయంలో భవానీ దేవి మాత్రం కృష్ణకు అబద్ధం చెప్తుంది. అప్పుడు పల్లకి సేవ చేస్తున్న సమయంలో విగ్రహం పక్కకు పడిపోతుంది. దీంతో ఏదో కీడు జరగబోతుందని అంతా అనుకుంటారు. ఇక, ఇంట్లో మీరా కనిపించకుండా వెళ్లిపోతుంది. దీంతో మురారితో కలిసి ఆమె వెళ్లిపోయిందని రజినీ అనుకుంటుంది. అనంతరం ఇంటికి వచ్చినప్పటి నుంచి కృష్ణ ప్రవర్తనలో వస్తున్న మార్పులు చూసిన ప్రభాకర్ ఏదో జరుగుతుందని అనుకుంటాడు. ఈ పూర్తి ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

Krishna Mukunda Murari Latest Week roundup story May 27th to June 1st Episodes highlights

30వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
30వ తేదీ గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ప్రభాకర్ ఇంటికి దగ్గర ఉన్న కృష్ణను కలిసేందుకు మీరా వస్తుంది. ఆమెను చూసి కృష్ణ షాక్ అవుతుంది. అప్పుడు మీరా 'నీ ప్రశాంతతను దూరం చేయడానికే ఇక్కడకు వచ్చాను' అని చెప్తుంది. ఇద్దరూ మాట్లాడుకుంటోన్న సమయంలోనే మురారి అక్కడకు రాలేదు అన్న విషయం మీరాకు తెలుస్తుంది. మరోవైపు ఇంటికి వెళ్లిన భవానీకి మీరా ఇంట్లో నుంచి వెళ్లిపోయిన విషయం చెప్తారు. అంతేకాదు, ఆదర్శ్ ఆమెను చంపాలని అనుకున్నది కూడా వివరిస్తారు. దీంతో భవానీ.. ఆదర్శ్ మీద ఫైర్ అవుతుంది. అప్పుడతను తన బాధనంతా తల్లికి చెప్పుకుంటాడు. ఈ పూర్తి ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

31వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
31వ తేదీ శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. కృష్ణ దగ్గరకు ముకుంద వచ్చి నిజాలన్నీ చెప్పిన తర్వాత తనతో పాటు ఇంటికి తీసుకు వెళ్తుంది. ఆ సమయంలో కృష్ణ తనకు ఎందుకు అన్యాయం చేస్తున్నావని ముకుందను ప్రశ్నిస్తుంది. దీంతో ఆమె తన మనసులోని కుట్రను మొత్తం బయటపెడుతుంది. అంతేకాదు, మురారిని సొంతం చేసుకుంటానని అంటుంది. తర్వాత ఇంటికి రాగానే కృష్ణతో పాటు పోలీసులు కూడా అక్కడకు చేరుకుంటారు. అంతేకాదు, మురారి కనిపించడం లేదని చెప్తారు. దీంతో కృష్ణ నిజాలన్నీ తెలిసిపోతాయి. దీంతో ముకుంద కుట్రను బయటపెట్టే బాధ్యతను ఆమె తీసుకుంటుంది. ఈ పూర్తి ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

Krishna Mukunda Murari Latest Week roundup story May 27th to June 1st Episodes highlights

01వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
01వ తేదీ శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. కృష్ణ రిపోర్టులు చూసి షాకైన భవానీ కోపంగా వచ్చి ఆమె చెంప పగలగొడుతుంది. ఆమెకు బిడ్డ పట్టదన్న విషయం అందరికీ చెప్తుంది. ఆదర్శ్ వచ్చి నిజాలు బయటపెడతాడు. దీంతో భవానీ, రేవతి కోడలిపై సీరియస్ అవుతారు. అనంతరం సరోగసి గురించి అందరికీ చెప్పాలనుకున్నా.. ముకుంద బెదిరించింది గుర్తు వచ్చి కృష్ణ ఆగిపోతుంది. కానీ, మధుకు అసలు విషయం చెప్తుంది. దీంతో అతడు ఇంట్లో వాళ్లకు సరోగసి నిజాన్ని చెప్తాడు. అప్పుడు అందరూ మీరాను నిందిస్తారు. కానీ, ఆమె మాత్రం తనకు, మురారికి పట్టబోతున్న బిడ్డ అని నమ్మించే ప్రయత్నం చేయగా.. మధు ఫైర్ అవుతాడు. ఈ పూర్తి ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

Krishna Mukunda Murari Latest Week roundup story May 27th to June 1st Episodes highlights

ఈ వారంలో హైలైట్ అయింది ఇదే
మే 27వ తేదీ నుంచి జూన్ 1వ వరకు సాగిన 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలతో సాగింది. ముఖ్యంగా ఈ వారంలో మురారి వల్లనే మీరా గర్భం దాల్చిందని అందరినీ నమ్మిస్తుంది. దీంతో అతడు కనిపించకుండా వెళ్లిపోతాడు. ఆ తర్వాత కృష్ణ గర్భవతి కాదన్న నిజం కూడా ఇంట్లో వాళ్లకు తెలిసిపోయింది. దీనితో పాటు మీరా సరోగసి ప్లాన్ కూడా బయటపడింది. ఇలా ఈ వారంలో నిజాలన్నీ బయటపడడంతో సీరియల్ రంజుగా మారింది. అదే సమయంలో మురారి ఏమయ్యాడు అన్నది సస్పెన్స్‌గా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X