Krishna Mukunda Murari Weekly: మురారి బుక్ అయ్యాడా? వాళ్లకు పెళ్లి చేస్తారా? ఒకే ట్విస్టుతో మారిన కథ
చాలా కాలంగానే తెలుగు బుల్లితెరపై సరికొత్త కంటెంట్‌తో చాలా రకాల సీరియళ్లు వస్తున్నాయి. అయితే, అందులో సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటే సీరియళ్లు తక్కువగానే ఉంటున్నాయి. అందులోనూ కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఒకటి. దాదాపు ఏడాది నుంచి ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతూ రంజుగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకూ పెంచేస్తోంది. ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే మే 6వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఈ 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఎలా సాగిందో మీరే లుక్కేయండి!
06వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
06వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. సరోగసి మదర్ ఎవరో తెలుసుకుని వస్తానని మురారి, కృష్ణను ఇంటికి పంపించేస్తాడు. అప్పుడు అతడికి ఫోన్ చేసి భవానీ తిడుతుంది. ఆమె హడావిడి చూసి ఆదర్శ్‌కు కోపం వస్తుంది. ఇక, తన కూతురిని ఆదర్శ్‌కు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్న రజినీ.. కృష్ణ దగ్గరకు వెళ్లి మాట్లాడుతుంది. అంతేకాదు, మీరా అతడితో చనువుగా ఉంటుందని, ఎలాగైనా తన కూతురితోనే పెళ్లి చేయమని అడుగుతుంది. అనంతరం మురారి దగ్గరకు వెళ్లిన ముకుంద సరోగసి మదర్‌ను తానేనని అతడికి తేల్చి చెప్పేస్తుంది. ఇలా అయినా మురారికి దగ్గర అవుతానని అనుకుంటుంది.

07వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
07వ తేదీ మంగళవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. సరోగసి మదర్ గురించి చెప్పడంతో మీరాపై మురారికి ప్రేమ పెరిగిపోతుంది. ఆమెను జాగ్రత్తగా చూసుకుంటానని అనడంతో పొంగిపోతాడు. మరోవైపు, ఆదర్శ్‌ను పడేయాలని ప్లాన్ చేసి విఫలం అవుతోన్న సంగీతకు మధు సలహాలు ఇస్తాడు. అప్పుడామె మీరా తన పెళ్లి చేస్తానన్న విషయం చెప్తుంది. దీంతో వెంటనే ఈ విషయాన్ని కృష్ణకు చెప్తాడు. అప్పుడు వాళ్లిద్దరూ ఆమె డబుల్ గేమ్ ఆడుతుందని అనుకుంటారు. ఇక, మురారి.. మీరాను కారులో తీసుకుని రావడంతో అందరికీ కోపం వస్తుంది. అప్పుడు సరోగసి మదర్ ఆమెనని చెప్పకూడదని మురారి డిసైడ్ అయిపోతాడు. ఈ పూర్తి ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.
08వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
08వ తేదీ బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. అమృత ఇంటికి రావడంతో కృష్ణను చెక్ చేయమని భవానీ దేవి చెప్తుంది. కానీ, కృష్ణ మాత్రం తాను కూడా డాక్టర్‌నే అని, తనకు తెలుసు అంటూ కవర్ చేస్తుంది. కానీ, రిపోర్టులు అయినా చూపించమని అనడంతో మురారి వెళ్లి తీసుకొస్తాడు. అందులో బాగానే ఉందని అమృత చెప్తుంది. మురారి ఇంట్లో వాళ్లను మోసం చేస్తున్నానని బాధపడుతుంటే ముకుంద వచ్చి ధైర్యం చెప్తుంది. అనంతరం ఆదర్శ్ ఆమెకు చీరలు కొనుక్కొని తీసుకు రావడంతో అంతా షాక్ అవుతారు. కానీ, మురారి సపోర్ట్ చేస్తాడు. తర్వాత కృష్ణను కాకా పట్టేందుకు డ్రామా ఆడతాడు. ఈ పూర్తి ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

09వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
09వ తేదీ గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. సరోగసి మదర్ మంచిదని మాట్లాడుతుంటే కృష్ణకు డౌట్ వస్తుంది. ఆమె ఎవరని అడగ్గా మురారి ఏదో చెప్పి కవర్ చేసుకుంటాడు. తర్వాత వీళ్లు ఉన్న ఆస్పత్రికే ముకుంద వస్తుంది. ఆమెను చూసి మురారి షాక్ అవుతాడు. వెంటనే ఆమెను కృష్ణ చూడకుండా కవర్ చేస్తాడు. అనంతరం కృష్ణను పంపేసి ముకుందకు పొగుడుతూ మాట్లాడతాడు. తర్వాత ముకుందకు సరోగసి ప్రాసెస్ చేస్తారు. మరోవైపు, ఆదర్శ్.. ముకుంద కోసం వెతుకుతుంటే భవానీ వాళ్లు మురిసిపోతారు. అనంతరం ఆమె రావడంతో ఆదర్శ్ ఎక్కడికి వెళ్లావు అని ప్రశ్నించగా నోరు జారి నిజం చెప్పేస్తుంది. ఈ పూర్తి ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.
11వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
11వ తేదీ శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. తనకు పిల్లలు పుట్టరన్న బాధలో ఉన్న కృష్ణ దగ్గరకు మురారి వస్తాడు. అప్పుడామెను అర్థం చేసుకుని ధైర్యం చెప్తాడు. అనంతరం కృష్ణ.. మీరాకు, ఆదర్శ్‌కు పెళ్లి చేయాలనుకుంటున్న విషయం చెప్తుంది. దీంతో సరోగసి మదర్ విషయంలో తేడా వస్తుందని అతడు దానికి ఒప్పుకోడు. అనంతరం ఇంట్లో పూజ మొదలు పెడతారు. అప్పుడు మురారి.. మీరాకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత మీరా కళ్లు తిరిగి పడిపోతుంది. దీంతో ఆమెకు కృష్ణ చెక్ చేయగా.. ప్రెగ్నెంట్ అన్న విషయం తెలుస్తుంది. తర్వాత అమృత చెక్ చేసినా ఇదే విషయం తెలుస్తుంది. ఈ పూర్తి ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

ఈ వారంలో హైలైట్ అయింది ఇదే
మే 6వ తేదీ నుంచి 11వ వరకు సాగిన 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలతో సాగింది. ముఖ్యంగా ఈ వారంలో ముకుంద సరోగసి మదర్ అన్న విషయం మురారికి తెలుస్తుంది. అప్పటి నుంచి అతడి ప్రవర్తనలో మార్పులు వస్తాయి. మరోవైపు కృష్ణ దొరికిపోకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తుంటుంది. ఈ వారం చివరికి మీరా ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని అమృత, కృష్ణ తెలుసుకున్నారు. మరి వాళ్లు ఈ విషయం అందరికీ చెప్పారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. *ఈ వారంలో శుక్రవారం ఎపిసోడ్ ప్రసారం కాలేదు.


Click it and Unblock the Notifications











